How To Create a Website

Mana Manthani web site కు విచ్చేస్తున్న Manthanites కి స్వాగతం సుస్వాగతం మరియు మరియు శుభాకాంక్షలు .. , No. 9246575261

SRI MUDDU RAMAKRISHNAIH GARI EVENT@ MANTHANI


Unveiling Statue of Mana Manthani 's Ideal Educationist Person ..SRI MUDDU RAMAKRISHNAIH GARU at 10.30 am ,25th january-2013,at MANTRAPURI DHARSHAN,
Photos & videos On Mana Manthani Web Site



ముద్దు రామకృష్ణ గారి సేవలు దేశానికే ఆదర్శం
విద్య అనే పదమున్నంత కాలం ఆయన సేవలు నిలిచే ఉంటాయి
- నేటి తరాలకు క్రమశిక్షణ,దక్షత, నిజాయితీ అవసరం
- అప్పట్లో శ్రీధర్‌బాబు వంటి వాళ్లుంటే రామకృష్ణకు పద్మశ్రీ వచ్చేది
- విగ్రహావిష్కరణ సభలో ‘నమస్తే తెలంగాణ’ సీఎండీ సీఎల్ రాజం
మన మంథనిలో పుట్టిన ముద్దు రామకృష్ణయ్య జీవితం దేశానికి ఆదర్శమని నమస్తే తెలంగాణ సీఎండీ సీఎల్ రాజం పేర్కొన్నారు. శుక్రవారం మంథనిలో శ్రీ సీతారామసేవాసదన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముద్దు రామకృష్ణయ్య విగ్రహావిష్కరణ సభలో ఆయన విశిష్ట అతిథిగా పాల్గొని రామకృష్ణ స్మృతి పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ముద్దు రామకృష్ణయ్య చేసిన సేవలు, మంచి పనులకూ పుస్తకరూపమిచ్చి ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నం హర్షణీయమన్నారు. కాలం కదులుతూనే ఉంటుందని, వ్యక్తుల్ని సృష్టిస్తూనే కబళిస్తుందని.. కానీ కొందరి వ్యక్తిత్వాలను బంగారు దీపాల్లో వెలుగిస్తుందన్నారు.

అలాంటి తోరణ దీపమే ముద్దు రామకృష్ణయ్యని కొనియాడారు. నాగరికతలో విద్య అనే పదం ఉన్నంతకాలం ఆయన సేవలు నిలిచే ఉంటారన్నారు. ఆయన జీవించి ఉన్న కాలంలో మంత్రి శ్రీధర్‌బాబు వంటివారి రాజకీయ పలుకుబడి ఉన్నట్లయితే,రామకృష్ణకు కచ్చితంగా పద్మశ్రీ అవార్డు దక్కేదన్నారు.రామకృష్ణయ్య క్రమశిక్షణ, దక్షత, నిజాయితీ భవిష్యత్ తరాలకు ఎంతో అవసరమన్నారు. అలాంటి మహానుభావులను తగిన రీతిలో గుర్తుంచుకునే విధంగా కార్యక్షికమాలు చేపడుతున్న శ్రీ సీతారామాసేవాసదన్ ప్రయత్నాలను ప్రశంసించారు. రామకృష్ణ సేవలను పుస్తకాలు, సీడీల రూపంలో తయారుచేయడం అభినందనీయమన్నారు.

ఇలాంటి మంచి కార్యక్షికమాలకు నమస్తే తెలంగాణ తరఫున సహాయ సహకారాలు అందిస్తామన్నారు. నమస్తే తెలంగాణ డైరెక్టర్ విజయరాజం మాట్లాడుతూ శరీరం ఆశాశ్వతమైనదని, మంచి పనులే చరివూతలో శాశ్వతంగా నిలుస్తాయన్నారు. అలాంటి వ్యక్తులే వరహాల భీమయ్య, ముద్దు రామకృష్ణయ్యలని కొనియాడారు. లండన్ బీబీసీలో పనిచేసి తిరిగొచ్చి, ఎంతో మంది విదేశాలకు దారి చూపిన రామకృష్ణయ్య జన్మించిన మంథనిలో పుట్టినందుకు తనకు గర్వంగా ఉందన్నారు.

రామకృష్ణయ్య విగ్రహ, పుస్తక, డీవీడీల ఆవిష్కరణ
అంతకుముందు మంథని తమ్మిచెరువు కట్టలోని మంత్రపురి దర్శన్‌వద్ద ఏర్పాటు చేసిన ముద్దు రామకృష్ణయ్య విగ్రహాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు. తర్వాత సభలో రామకృష్ణయ్య రచించిన ‘నా ప్రథమ విదేశీయాత్ర’ పుస్తకాన్ని ఎమ్మెల్సీ చుక్కారామయ్య, ‘రామకృష్ణ స్మృతి’ పుస్తకాన్ని ‘నమస్తే తెలంగాణ సీఎండీ సీఎల్ రాజం ఆవిష్కరించారు. ముద్దు రామకృష్ణయ్య రాత ప్రతుల డీవీడీని సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ రాళ్లబండి కవితవూపసాద్ ఆవిష్కరించారు.

మంథని శ్రీ సీతారామ సేవా సదన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గట్టునారాయణ గురూజీ సభాధ్యక్షతన జరిగిన కార్యక్షికమంలో సదన్ అధ్యక్షుడు సువర్ణ లక్ష్మణ్‌రావు, ఉపాధ్యక్షుడు అష్ఠవధాని గంగాధర్, రామకృష్ణయ్య కుమార్తె పంగునూరి ప్రమీల, మనుమడు, మనుమరాలు రామేశ్, అరుణ, విశేష అతిథులు రాంపెల్లి కిష్టయ్య, ప్రమోద్, గౌరవ అతిథులు సువర్ణ చంటయ్య, మాదాడి ప్రభాకర్‌డ్డి, పనకంటి చంద్రశేఖర్, మాదాడి శ్రీనివాస్‌డ్డి, వొడ్నాల శ్రీనివాస్, గిరి నాగభూషణం, ఎంవీ నర్సింహాడ్డి, సూరజ్ శివశంకర్, ఎక్కెటి అనంతడ్డి, సదన్ సభ్యులు అవధానుల మురళీధర్, దుద్దిళ్ల గణపతి, మార్పాక ప్రసాద్, టక్కెగారి కిట్టన్న, రామకృష్ణయ్య కుటుంబ సభ్యులు, సన్నిహితులు, జగిత్యాల శిష్యబృందం, పట్టణ పురవూపముఖులు పాల్గొన్నారు.
-----------------------------------------------------------------------------------
ఆదర్శనీయం.. శ్రీ ముద్దు రామకృష్ణయ్య గారి జీవితం
మంథని విద్యాతపస్వి రామకృష్ణయ్య జీవితం స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంథని తమ్మిచెరువు కట్టలోని మంత్రపురి దర్శన్‌వద్ద ఏ ర్పాటు చేసిన ముద్దు రామకృష్ణయ్య విగ్రహాన్ని శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఆ కాలంలో ఇంగ్లండ్ వెళ్లిన రామకృష్ణయ్య ఉన్నత చదువులు చదివి అక్కడే స్థిర పడకుండా తిరిగి వచ్చి ఈ ప్రాంతంలో విద్యావ్యాప్తికి ఎంతో కృషిచేశారని కొనియాడారు. అనంతరం ‘రామకృష్ణ స్మృతి’ పుస్తకాన్ని ‘నమస్తే తెలంగాణ దిన ప్రతిక సీఎండీ సీఎల్ రాజం ఆవిష్కరించి మాట్లాడుతూ మంథనిలో పుట్టిన ముద్దు రామకృష్ణయ్య జీవి తం, రాష్ట్రానికే కాకుండా భారత దేశానికి ఆదర్శం గా నిలుస్తుందని కొనియాడారు.
శ్రీ సీతారామసేవాసదన్ ఆధ్వర్యంలో రామకృష్ణయ్య విగ్రహాన్ని ఆవిష్కరించడం, ఆయన చేసిన సేవలను పుస్తకం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేయ డం హర్షనీయమన్నారు. అనంతరం ‘నా ప్రథమ విదేశీయాత్ర’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ చుక్కారామయ్య మాట్లాడుతూ, మంథని ప్రాం తాన్ని అభివృద్ధి చేసేందుకు ఆర్థిక నాయకత్వం క లిగిన ‘నమస్తే తెలంగాణ’ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సీఎల్ రాజం, రాజకీయ నాయకత్వం ఉన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముందుకు రావడం హర్షనీ యమ న్నారు. రామకృష్ణయ్య ప్రతుల డీవీడీని ఆవిష్కరించిన సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ రాళ్లబండి కవితవూపసాద్ మాట్లాడుతూ, ఎంతో కష్టపడి తీసుకువచ్చిన మంథని వేద పాఠశాలలో విద్యార్థులు వేదం నేర్చుకునేందుకు ముందుకు రా క పోవడం దురదృష్టకరమన్నారు. ‘నమస్తే తెలంగా ణ’ డైరెక్టర్ విజయారాజం మాట్లాడుతూ, రామకృష్ణయ్య జన్మించిన మంథనిలో తాను పుట్టినందుకు గర్వపడుతున్నట్లు పేర్కొన్నారు.


 



 
























  • VIDEOS
  • PHOTOS
  • NEWS UPDATE