మౌనమునిని మరిచారు
తెలుగువాడిగా.. తెలంగాణ బిడ్డగా.. జాతి ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన పీవీ నర్సింహారావు 92వ జయంతి నేడు. ఆ మౌనమునికి ప్రభుత్వాలు ఏనాడూ కనీస గౌరవం ఇవ్వలేదు. మైనార్టీలో పడ్డ దేశ భవిష్యత్తును భుజస్కంధాలకు ఎత్తుకొని ప్రధానిగా ఐదేళ్లు పాలించిన దిట్ట పాములపర్తి వెంకట నర్సింహారావు. ఆయన చనిపోయిన రోజు మొదలు.. జయంతులు, వర్ధంతులు.. ఏ రోజూ కూడా ఇటు రాష్ట్ర పాలకులకు పట్టదు.. అటు కేంద్ర పెద్దలకూ పట్టదు..!! గల్లీ లీడర్లకు లెక్కలేసుకొని మరీ, గల్లీ నుంచి ఢిల్లీ దాకా విగ్రహాలు పెడతారు.. భుజాపూగరేసుకుంటూ పోటీ పడి దండాలు పెడతారు..! ఫ్లైఓవర్లకు, పార్కులకు, సినిమా హాళ్లకు, చివరికి చిల్లరకొట్టు దుకాణాలకూ వారి పేర్లే పెడతారు. కానీ, పార్లమెంట్‌ను శాసించిన ఒకే ఒక్కడు పీవీకి మాత్రం విగ్రహం పెట్టమం తాయ్‌మాయ్ అయితరు..! తెలంగాణ బిడ్డకు ఇంతకంటే అవమానం ఇంకేం కావాలి..?! నేడు ఆ మహానుభావుడికి ఘటిస్తోంది నాలుగున్నరకోట్ల రతనాల వీణ తెలంగాణ.. నివాళి..!!
భీమదేవరపల్లి, జూన్ 27 (టీ మీడియా):తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి గురువారం. మౌనమునిగా జాతి ఖ్యాతిని ఆయన ప్రపంచానికి చాటిచెప్పారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆర్థిక సంస్కరణల రూపశిల్పి... ఇలా ఎన్ని చెప్పుకున్నా పీవీ ప్రతిభ ముందు గడ్డిపోచతో సమానం. ప్రపంచం గుర్తించిన ఆ ‘లోపలి మనిషి’ కీర్తిని ఇటు రాష్ట్ర నేతలు.. అటు కేంద్ర పెద్దలు మరిచిపోయారు. ఊరూరా తమ కు కావాల్సిన వాళ్ల కంచువిక్షిగహాలు పెట్టుకొని, రాజకీయ లబ్ధి పొందుతున్న ఈ సిద్ధహస్తులకు రాష్ట్రంలో ఎక్కడ కూడా పీవీకి కాంస్య విగ్రహం కాదుకదా.. కనీసం శిలా విగ్రహం పెట్టాలన్న ధ్యాస లేదు..! తెలంగాణ బిడ్డగా...
తెలంగాణ బిడ్డ పీవీ. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర ఆయన సొంతూరు. రుక్మిణి, సీతారామారావు తల్లిదంవూడులు. 1921 జూన్ 28న పీవీ నర్సింహారావు జన్మించారు. ప్రాథమిక విద్య వంగర, హన్మకొండలో సాగింది. 1936లో మెట్రిక్‌లేషన్‌లో ఉత్తీర్ణులయ్యారు. 1938లో నిజాం వ్యతిరేక పోరాటంలో పీవీ పాల్గొన్నారు. దీంతో ఆనాడు రాష్ట్రంలో ఎక్కడా చదవకుండా ప్రభుత్వం నిర్బంధం విధించింది. చదువుపై మమకారంతో మహారాష్ట్రలోని పూణెలో బీఎస్సీ, నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. హైదరాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టిన పీవీ.. హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంవూతిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ ప్లీడర్‌గా చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక ముద్రవేసుకున్నారు. రాజకీయ ప్రస్థానం.. పీవీ 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. 1952లో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1957 నుంచి 1972 వరకు నాలుగుసార్లు మంథని నియోజకవర్గం(కరీంనగర్) నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1967లో బ్రహ్మానందడ్డి మంత్రివర్గంలో వైద్య, ఆరోగ్య, విద్య, దేవాదాయశాఖలు నిర్వహించారు. నాడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానంతరం చోటుచేసుకున్న పరిణామాల తర్వాత 1971 సెప్టెంబర్‌లో రాష్ట్ర ముఖ్యమంవూతిగా పదవీబాధ్యతలు చేపట్టారు. సీఎంగా పీవీ.. పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. భూసంస్కరణలను మలు చేశారు. ఇది కొందరికి కంటగింపుగా మారడంతో పదవికి రాజీనామా చేశారు.పీవీ సేవలను జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవాలని భావించిన ఇందిరాగాంధీ ఆయనను, 1973లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. పీవీ ఈ పదవిలో 1975 దాకా కొనసాగారు. 1977లో హన్మకొండ ఉంచి లోక్‌సభకు ఎన్నికైన పీవీ.. ఇందిరాగాంధీ మంత్రివర్గంలో కీలకమైన హోంశాఖ, విదేశాంగ శాఖలు నిర్వహించారు. 1984లో మహారాష్ట్రలోని రాంటెక్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాజీవ్ మంత్రివర్గంలో మానవవనరులు, హోంశాఖ మంత్రిగా పనిచేశారు. రాజీవ్‌గాంధీ హత్యానంతరం చోటుచేసుకున్న పరిణామాల్లో భాగంగా, 1991లో దేశ అత్యున్నత ప్రధాని పీఠాన్ని అధిష్ఠించారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా కూడా ఎంపికయ్యారు. 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి సరైన మెజార్టీ రాకపోవడంతో మైనార్టీలో పడ్డ కేంద్ర ప్రభుత్వాన్ని విపక్షాల మద్దతుతో నిలబెట్టుకున్నారు. తన నాయకత్వ పటిమతో ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపి..విమర్శకుల నోళ్లు మూయించారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రగతిబాట పట్టించారు.సచ్ఛీలుడి ముందు నిలవని కేసులునమ్ముకున్న పార్టీ నుంచి 1997 తర్వాత అనేక అవమానాలు పీవీకి ఎదురయ్యాయి. జీవిత చరమాంకంలో కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. కానీ, ఆ సచ్ఛీలుడి ముందు ఏ కేసూ నిలవలేదు.అపర చాణక్యుడురాజకీయాల్లో అపర చాణక్యుడిగా పీవీకి పేరుంది. ఏ పదవిని చేపట్టినా అది ప్రజల పక్షంగానే నడించింది. 1951లో అఖిల భారత కాంగ్రెస్ సభ్యుడిగా మొదలు.. దేశ ప్రధాని వరకు ఆయన ప్రజల మనిషిగా పనిచేశారు. ఇందిరాగాంధీకి అత్యంత నమ్మకస్తుడిగా ఉంటూ ఎమ్జన్సీ తర్వాత దేశ మంతటా కాంగ్రెస్ ఓడిపోయినా రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ జెండా రెపపలాడించారు. నాడు రాష్ట్రం లో 42 స్థానాల్లో 41స్థానాలు కాంగ్రెస్‌కు రావడంవెనుక పీవీ పాత్ర కీలకం.ఇందిర హయాంలో తన బహుముఖ ప్రతిభా సామర్థాన్ని అంతర్జాతీయ దౌత్యానికి ఉపయోగించారు. 1981లో అలీన దేశాల విదేశాంగ మంత్రుల మహాసభకు మన పీవీ అధ్యక్షత వహించారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో కీలక భూమిక పోషించారు. ఆ మహానుభావుడికి రాదన్న భాష లేదు. తెలియని విద్య లేదు..! తెలుగు మొదలు.. 17కు పైగా భాషల్లో మాట్లాడగల ఏకైక వ్యక్తి పీవీ. కవి, రచయిత, కథకుడు, అనువాదకుడు, పాత్రికేయుడుగా సాహిత్యానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. పీవీ ఆత్మకథ ‘ఇన్‌సైడర్’, తెలుగులో ‘లోపలి మనిషి’గా ప్రజల ముందుకు వచ్చింది. తనకు వారసత్వంగా సంక్రమించిన భూమిని పేదలకు పంచిన త్యాగశీలి మన పీవీ.పీవీ మరణమూ వారిని కదిలించలేదు..!దేశాన్ని ఏలిన ఏకైక తెలుగువాడిగా చరివూతకెక్కిన పీవీ నర్సింహారావు మరణమూ ఇటు రాష్ట్ర, అటు కేంద్ర పెద్దలను కదిలించలేదు. 2004 డిసెంబర్ 23న పీవీ మరణించారు. ఆయన అంత్యక్షికియలకు ప్రాధాన్యమివ్వడంలో పాలకులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఇది సగటు తెలుగువాడిని కలచివేసింది. జయంతుల రోజు, వర్ధంతుల రోజు కూడా అదే వివక్ష. గల్లీ లీడర్లకు లెక్కలేసుకొని విగ్రహాలు పెట్టే నేతలు.. పీవీ విషయంలో మాత్రం స్పందించడం లేదు. సొంతూరు వంగరలో కూడా ఆయన విగ్రహం లేదంటే వివక్షను అర్థం చేసుకోవచ్చు. కేవలం హైదరాబాద్‌లో ఎక్స్‌వూపెస్ వే మినహా ఎక్కడా పీవీ పేరు లేదు..!పీవీ సాధించిన విజయాల్లో మచ్చుకు కొన్ని..- పీవీ ప్రధానిగా ఉన్న కాలంలో దేశంలో ఎన్నో రాజకీయ, ఆర్థిక, సామాజిక మలుపులు చోటుచేసుకున్నాయి. దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవనం కల్పించారు. సంస్కరణకు బీజం వేశారు. అందుకే పీవీని దేశ ఆర్థిక సంస్కరణల పితాహహుడిగా పిలుస్తుంటారు.- పంజాబ్ తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ సొంతం.- దేశంలో అణుపరీక్షలు మొదలుపెట్టింది పీవీ సర్కారే.- పీవీపై గౌరవంతో నాడు ప్రధాని ఇందిరాగాంధీ ఏకంగా ఆయన కోసమే కేంద్ర మానవవనరుల శాఖను ఏర్పాటు చేశారు. తనకిచ్చిన గౌరవాన్ని పీవీ.. ప్రజల కోసం వినియోగించారు.