అద్భుత కళా సంపదకు నిలువెత్తు నిదర్శనం... నాటి శిల్పుల నైపుణ్యతకు తార్కాణం... రామగిరి ఖిల్లా. ఆహ్లదపరిచే ప్రకృతి రమణీయ దశ్యాలు ఓవైపు... ఉల్లాసాన్ని పంచే సెలయేటి గలగలలు, అబ్బురపరిచే కళాఖండాలు మరోవైపు... రాజుల ఏలుబడిలో శతాబ్దాల చరిత్ర కలిగిన రామగిరి ఖిల్లా... ప్రాచీన కళావైభవాన్ని చాటుతూ నేటకీ పర్యాటకులను అలరిస్తు విరాజిల్లు తోంది... కాకతీయుల కాలం శిల్ప కళాపోషణకు పెట్టింది పేరుగా ఉండేది... వీరి పరిపాలనలోనే రామగిరి దుర్గం పై అపురూప కట్టడాలు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. లక్ష్మణుడు, ఆంజనేయుడితోపాటు సీతా సమేతుడైన శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో రామగిరి దుర్గంపై విడిది చేసినట్లు చరిత్రకారులు చెబు తున్నారు. దీంతో రామగిరి పర్యాటక ేకంద్రంగానే కాక ఆధ్యాత్మిక ేకంద్రాంగాను బాసిల్లుతోంది... 200 రకాలకు పైగా వనమూలికలను కలిగివున్న ఈ ఖిల్లా ఆయుర్వేద వైద్యానికి మూలేకంద్రంగా పేరొందింది. చారిత్రాత్మక నేపథ్యంతో... ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొని... తెలంగాణ ప్రాంతంలో విశిష్టమైన పర్యాటక ేకంద్రాంగా గుర్తింపు పొందిన రామగిరిఖిల్లా విశేషాలు ‘విహారి’లో మీకోసం...

శ్రావణం మాసం లో సందడే సందడి...
వర్షాకాలంలో పచ్చదనం పరుచుకోవడం తో... ప్రతి శ్రావ ణమాసంలో రామగిరిఖిల్లాపై పర్యాటకుల సందడితో ఆహ్ల దకర వాతావరణం ఉంటుంది. రామగిరి దుర్గంపై ప్రకృతి అందచందాలను తిలకిస్తూ పర్యాటకులు మైమరిచిపోతా రు. ఆయుర్వేద వైద్యులు ఈ ఖిల్లాపై విలువైన వనమూ లికలను సేకరిస్తారు. తెలంగాణ ప్రాంతంలో ప్రాచీన కళా సంపదకు నిలయమైన రామగిరిఖిల్లా ఇంకా ఎంతో అభి వృద్ధి చెందాల్సివుంది. పర్యాటకకేంద్రంగా తీర్చిదిద్దుతా మని పాలకులు చెబుతున్న నేటికి ఆచరణకు అమలు కాలేదు.
శిల్ప కళకు ఒడి..!
కాకతీయుల కాలంలో రామగిరిపై నిర్మించిన రామగిరి కోట శిల్ప కళా సంపదతో శోభిల్లుతుంది. పర్యాట కులను ఆహ్లదపరు స్తూ అలరిస్తోంది. కాకతీయుల శిల్ప సాంస్కృతిక సంప దకు తార్కాణంగా నిలుస్తూ. .. శ్రావణ మాసంలో వచ్చే భక్తులకు, సందర్శకులకు నిలయంగా మారింది. ఇక్కడి నిర్మింపజేసిన రాతి కట్టడాలు అప్పటి శిల్ప కళానైపుణ్యాన్ని చాటుతాయి. రాతిపై చెక్కిన సుందర దశ్యాలు పర్యాటకులను మంత్ర ముగ్దులను చేస్తుంది.
రాముడు నడయాడిన నేల...
వనవాసం కాలంలో శ్రీరాముడు రామగిరిపై కొద్దిరోజులు కుటీరం ఏర్పారుచుకొని సీతా లక్ష్మణులతో ఉన్నారని పెద్ద లు చెబుతారు. ఈ ఖిల్లాపై సీతారామలక్ష్మణులు సంచరిం చినట్లు చెప్పబడుతున్న కొన్ని ఆనవాళ్ళు ఇప్పటికీ చెక్కుచెద రకుండా పర్యాటకులకు దర్శనమిస్తాయి. ఖిల్లాపైన గల బండరాతిపై శ్రీరాముని పాదాలు, సీతాదేవి స్నానమాచరిం చిన కొలనుతో పాటు శ్రీరామునితో సంచరించిన ఆంజనేయుడి విగ్రహం కూడా నెలకొల్పబడివుంది.
నాటి వాడలే నేటి పల్లెలు...

చూడాల్సిన ప్రదేశాలు...
రామగిరి దుర్గం అంతర్బాగంలో సాలుకోట, సింహల కోట, జంగేకోట, ప్రతాపరుద్రుల కోట, అశ్వశాల కోట, కొలువుశాల, మొఘల్‌శాల, చెరశాల, గజశాల, భజన శాల, సభాస్థలి వంటి వాటితో పాటు చెక్కరబావి, సీతమ్మ బావి, పసరుబావి, సీతమ్మకొలను, రహస్య మార్గాలు, సొరంగాలు లాంటి అనేక ప్రదేశాలు పర్యా టకులను ఇట్టే మైమరిచిపోయేలా చేస్తాయి.
రామగిరి చరిత్ర వెలుగులోకి వచ్చిన విధం...
రామగిరి చరిత్రను వెలుగులోకి తీసుకరావడానికి పలు వురు రచయితలు ఎంతో వ్యయ ప్రయాసలుకోర్చి రామ గిరి చరిత్రను పుస్తకరూపంలో ప్రచురించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేటకు చెందిన యరబాటి బాబురావు, కమాన్‌పూర్ మండలానికి చెందిన మాధవ రావు, బలరాందాస్‌లు ‘రామగిరి మహత్యం’ పేరుతో ఓ గ్రంథాన్ని రాశారు. వీరికంటే ముందు రామగిరి చరి త్రను వెలికితీసిన ఘనత ఆర్.బాలప్రసాద్‌కే దక్కుతుం దంటారు.
‘కళ’ తప్పుతోందా..?

ఖిల్లాకు వెళ్లాలంటే...
కరీంనగర్ జిల్లాకేంద్రం నుంచి తూర్పు దిశగా... మం థని, కాళేశ్వరం వెళ్లే రహదారిలో 58 కిలోమీటర్ల దూరం లో వుంది రామగిరి దుర్గం. కమాన్‌పూర్ మండలంలోని నాగెపల్లి (బేగంపేట అడ్డరోడ్డు) నుంచి బేగంపేట గ్రామం మీదుగా నడుచుకుంటూ వెళితే రామగిరిఖిల్లాకు చేరు కోవచ్చు. ఈ రామగిరి ఖిల్లా సాంతం చూడాలంటే కనీ సం 16 కిలోమీటర్లు కొండపైన నడవాల్సి ఉంటుంది. రైలు మార్గం ద్వారా వచ్చే పర్యాట కులు కాజీపేట - బల్లా ర్షా మార్గంలోని పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో దిగి బస్సు ద్వారా మంథని మార్గంలో బేగంపేటకు చేరుకోవచ్చు.
0 comments:
Post a Comment