ఎండలు మండిపోతున్నా సరే పిల్లలు వేసవిని ఎంతో ఇష్టపడతారు.. ఎందుకో తెలుసా వాళ్ళకు సెలవులు అపðడేగా వచ్చేది. ఎం చక్కా వేసవి సెలవులను బాగా ఎంజారు చేయవచ్చని, వేసవి సెలవులు ఎపðడెపðడు వస్తాయా అని ఎదురుచూస్తుంటారు.వేసవి సెలవుల్లో సరదాగా ప్రయాణాలు చేయొ చ్చు, అమ్మమ్మా, తాతయ్యలదగ్గరకెళ్ళవచ్చు, స్నేహి తులను కలవవచ్చు, సినిమాలకెళ్ళవచ్చు.. రోజంతా ఆడుకోవచ్చు.. ఇవీ నాటి పిల్లల ఆలోచనలు.కానీ నేటి పిల్లల ఆలోచనల్లో, దృక్ఫథాల్లో మార్పు వచ్చింది. అన్ని రంగాల్లో పోటీ తత్త్వం పెరి గింది. ఎలాగైనా నెంబర్‌వన్‌గా ఉండాలని తపన పడుతున్నారు.సెలవులు దొరికితే వాటిని ఎలా సద్వి నియోగం చేసుకోవాలా అని పిల్లలూ, వారితోబాటు తల్లిదండ్రులూ ఆలోచిస్తున్నారు. పేరెంట్స్ కూడా పిల్లల భవితను బంగారుమయం చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. ఇదీ ఈ కాలపు పిల్లల దృక్ఫథం.నేటి తరం పిల్లలు ఒకవైపు సెలవులను ఎంజారు చేస్తూనే లైఫ్‌ను సీరియస్‌గా తీసుకుంటు న్నారు. అందరిలో తాము ప్రత్యేకంగా కనపడాలని భావిస్తున్నారు. వారి ఆలోచనలకు పరిగణనలోకి తీసుకొని తల్లిదండ్రులు సెలవుల్లో తమ పిల్లలకు ఏమి నేర్పించాలి.. ఏమి నేర్పిస్తే వాళ్ళ భవితకు దోహదపడుతుంది, ఈ వేసవి సెలవులను ఎలా సద్వినియోగపర్చాలి అని ఆలోచిస్తున్నారు.పరీక్షలు మొదలవుతాయనగానే ప్రైవేట్‌స్కూళ్ల హంగామా మొదలవుతుంది. మా స్కూల్లో చదివిన విద్యార్థి టాపర్ అంటే మా స్కూలో చదివిన విద్యార్థి ఇన్ని మార్కులు సాధించాడు' అని ఫోటోలతో సహా హౌర్డింగులపై ప్రకటనలు గుప్పిస్తున్నారు. దీంతో తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్పించాలో తెలి యక, తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. వేసవి సెలవులు ఇంకా మొదలవకముందే విద్యార్థు లను ఇట్టే ఆకర్షిస్తున్నారు. ఎక్కడ సీట్లు అయిపోతాయోవెూనని తల్లిదండ్రులు ముందు ముందుగానే తమపిల్లలకు సీట్ల రిజర్వేషన్‌లో పోటీలుపడుతున్నారు.ఇలాంటి టెన్షన్ల న్నింటినీ పక్కన పెట్టి తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ప్రశాంతంగా ఆలోచిం చాలి. వేసవి సెలవు లను పిల్లలు ఏంజారు చేసే విధంగా వారి పెద్దలు ప్లాన్ చేయాలి.చిన్నారుల్లో ఉత్సాహాన్ని నిం పేందుకు, వారి ఆసక్తులను బట్టి, ఏదో ఒక కొత్త విష యాన్ని నేర్పించేం దుకు ఇదే అనువైన సమయం అని గ్రహించాలి తల్లి దండ్రులు.తమ పిల్లలకు ఏయే అంశాలలో ఆసక్తి ఉందో గమనించి, ఆయా రంగా లలో శిక్షణ ఇప్పించేందుకు వారు ప్రయత్నించాలి.ముఖ్యంగా వేసవి సెలవుల్లో వారికి యోగా, ధ్యానం లాంటివి నేర్పించడం వల్ల వాళ్ళల్లో ఉన్న మానసిక అందోళన ఇట్టే ఎగిరి పోతుంది. యోగా చేయటం వల్ల కలిగే ఉపయో గాలను తల్లిదండ్రులు తమ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. తమ వయసు పిల్లలతో కలిసి యోగా, ధ్యానం శిక్షణా తరగతులకు పంపించాలి. ఇలా చేయడం వల్ల చిన్న తనం నుంచే వారికి ఒత్తి డిని ఎదుర్కొనే శక్తి అల వడుతుంది. అంతేగాక యోగా, ధ్యానం చేయటం వల్ల పిల్లలు ఆరోగ్య వంతంగా తయారవడమే కాక వారి మొహంలో తేజస్సు కూడా వస్తుంది.వేసవి సెలవులు వస్తున్నాయంటే చాలు.. సమ్మర్ క్యాంపులు మొదలవుతాయి. ఇంటికి దగ్గరనో, స్నేహితులు ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్ అనో ఎక్కడపడితే అక్కడ పిల్లలను చేర్పించకుండా... వారికి ఏయే విష యాల్లోఆసక్తిఉందో గమనించి, వాటిల్లో చేర్పించ డం ఉత్త మం. ఇలా పిల్లలకు ఆసక్తి ఉన్న రం గాల్లో శిక్షణనిప్పించడం వల్ల వారు నేర్చుకునే విష యాన్ని కష్టంగా కాక ఇష్టంగా నేర్చుకుంటారు.ఇక సెలవుల్లో ప్రస్తుతం నెలకొని ఉన్న పోటీ దృష్ట్యా పిల్లలను చదువుకోమంటూ ఒత్తిడి తేరాదు. ఎదురింటబ్బాయికి అన్ని మార్కు లొచ్చాయి, పక్కింటి వాడికి ఇన్ని మార్కులొచ్చాయి అని పదే పదే మీ పిల్లలను దెప్పి పొడవడం, ఉదాహరణలు చెప్పడం వల్ల వాళ్లల్లో ఆత్మన్యూనతా భావం నెలకొనవచ్చు. తామెందుకూ పనికిరామన్న భావన వాళ్లల్లో ఏర్ప డవచ్చు. అందుకని వాళ్ళు చిన్న చిన్న తపðలు చేసినా, వాటిని సరిదిద్దుతూ ప్రోత్స హించడం వల్ల వారిలో ఆసక్తిని, ధైర్యాన్ని కల్గించవచ్చు.ప్రస్తుత పోటీ ప్రపం చంలో మార్కుల సాధనే లక్ష్యంగా చదువుతూన్న చిన్నారులపై తీవ్రంగా పెరు గుతోన్న ఒత్తి డిని నివా రించేం దుకు, సెల వుల్లో వారిని సర దాగా ఏ ఊరికో, బంధు వుల ఇళ్లకో తీసుకెళ్ళాలి. ఏడాదంతా చదు వు సంధ్యా, హౌమ్ వర్క్, యూనిట్ టెస్ట్‌లంటూ టెన్షన్స్‌తో గడిపిన పిల్లలకు వేసవి సెలవుల్లో కాస్త విశ్రాంతి కల్పించేలా తల్లిదండ్రులు వేసవి సెలవులల్లో కనీసం కొన్ని రోజులైనా చక్కగా ప్లాన్ చేస్తే పిల్లల్లో టెన్షన్లు మటుమాయమై మానసిక ప్రశాంతత, విశ్రాంతి లభిస్తుంది.అలాగని సెలవులన్నింటినీ ఇలా గడిపేయమని కాదు, ప్రస్తుత పోటీ యుగంలో అన్నీ ముఖ్యమే కాబట్టి, ఒకవైపు ఎంజారు చేస్తూనే వాళ్లను ఏదో విధంగా తీర్చిదిద్దాలంటే వేసవి సెలవులను కూడా సద్వినియోగం చేసుకోవాలి.ఉదాహరణకు:మీ అబ్బాయికి క్రికెట్ అంటే ఇష్టమనుకోండి. సెలవుల్లో మంచి కోచ్‌ను మాట్లాడి శిక్షణ నిప్పించ వచ్చు. అలాగే చిత్రలేఖనం, కంప్యూటర్ కోర్సులు, నాట్యం వంటివి కూడా ఎంచుకోవచ్చు.ఇలా సెలవుల్లో కొన్నిరోజులను మినహాయిస్తే, మిగిలిన సెలవులను వారి ఆసక్తి, అభిరుచుల కనుగుణంగా సమ్మర్ క్యాంపులలో చేర్చి వారిని తీర్చిదిద్దవచ్చు.
0 comments:
Post a Comment