How To Create a Website

Mana Manthani web site కు విచ్చేస్తున్న Manthanites కి స్వాగతం సుస్వాగతం మరియు మరియు శుభాకాంక్షలు .. , No. 9246575261

ఇది మల్లెల వేళయనీ....


నడిరేయి పూసి, సువాసనలు వీచి, మగువ మనసును దోచి, అందాలన్ని కొప్పున దాచి పుష్పరాణిగా విరాజిల్లే గుణం ఒక్క మల్లెకే దక్కింది. 

కొన్ని రకాల పుష్పాలు కేవలం ఆకట్టుకోగలవు. మరికొన్ని రకాల పూలు తమ సువాసనలతో మనసు దోచుకోగలవు. కానీ మనిషి మనసుకు ప్రశాంతతను చేకూర్చడంతో పాటు తాజాదనాన్ని కలుగజేసే అద్భుతమైన సువాసన మాత్రం మల్లెకే సొంతం. అందుకే మల్లెను ‘పుష్పాల రాణి’గా పరిగణిస్తారు. ఈ పుష్పాన్ని ‘బెల్లె ఆఫ్ ఇండియా’ లేదా ‘సువాసనల రాణి’ అని కూడా సంభోదిస్తుంటారు.
మల్లెలు వేసవికాలంలోనే విరివిగా పూస్తుంటాయి. వేసవికాలం వచ్చిందంటే ఎక్కడ చూసినా మల్లెలు కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తుంటాయి. రాత్రిపూట మొగ్గలను తెంపి అల్లుకుని తడి గుడ్డలో కట్టి పెడితే మరునాడు ఉదయానికి మల్లెలు విచ్చుకుని సువాసనలు వెదజల్లుతాయి. 

malle1‘జాస్మిన్’ అనే పేరు ‘యాస్మిన్’ అనే ‘పర్షియన్’ పదం నుండి వచ్చింది. యాస్మిన్ అంటే ‘దేవుని బహుమతి’ (గిఫ్ట్ ఆఫ్ గాడ్) అని అర్థం. ఈ మొక్క ఎలాంటి ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోనప్పటికీ ప్రపంచంలోని అన్ని రకాల ప్రాంతాల్లోనూ, ఉష్ణోక్షిగతల్లోనూ పెరిగే లక్షణం కలిగి ఉంది. ఎవరైనా, ఎక్కడైనా పెంచుకోవడానికి అనుకూలమైన మొక్కలలో మల్లెమొక్క ముఖ్యమైంది. మరే ఇతర మొక్కలు కూడా తట్టుకోలేని అన్ని రకాల అవాంతరాలను తట్టుకుని నిలబడగలిగే మొక్క ఇది. అతి తక్కువ ధర పలికే అతి సువాసన భరితమైన పూలు కూడా ఇవే. వివిధ రకాల పండుగలు, శుభ సందర్భాల్లో మల్లెపూలను విరివిగా వినియోగిస్తారు. తెల్లని కాంతివంతమైన రంగుతో, చూడగానే ఆకట్టుకునే రూపంతో విరబూసే మల్లెపూలను ఇష్టపడని వారంటూ ఉండరు!

మల్లెపూలలో రెండు రకాలున్నాయి. ఒకటి సంవత్సరం పొడవునా పూసేవి. రెండవది రుతువును అనుసరించి పూలు పూసేవి. ఈ రెండు రకాల మొక్కలు కూడా తొందరగా విస్తరించడంతో పాటు సాదాసీదాగా పెరిగే మొక్కలే. 

malle3మల్లెపువ్వు అనగానే తెలుపు రంగు మాత్రమే గుర్తుకు వస్తుంది. అయితే కొన్ని రకాల మల్లెల్లో తెలుపుతో పాటు పసుపు, కొన్ని పూలల్లో ఎరుపు వర్ణం కూడా కనిపిస్తుంది. సాధారణంగా మల్లెపూలు ఒక్కో కొమ్మకు మూడు నుండి ఐదు పువ్వుల వరకు పూస్తాయి. కొన్ని రకాల మల్లెలు మాత్రం కొమ్మ చివరన పూస్తాయి. మల్లెపువ్వుల్లో ఉన్న రకాలను అనుసరించి కొన్ని పువ్వులకు నాలుగు లేదా ఐదు పూ రెమ్మలుంటాయి. మరికొన్ని రకాల్లో నాలుగు నుండి తొమ్మిది రెమ్మలు కనిపిస్తాయి. కొన్ని రకాల మల్లెచెట్లకు కాయలు కూడా కాస్తాయి. అవి చిన్నగా బెర్రీల్లాగా ఉండి నల్లగా ఉంటాయి.
మల్లెచెట్లు మన దేశంలోనే కాక ఇతర దేశాల్లోనూ పెంచుతున్నారు. యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోనూ మల్లెచెట్లు కనిపిస్తాయి. ఆయా దేశాల్లో వివిధ రకాల పేర్లతో పిలిచినప్పటికీ వాటికి ఇంగ్లీష్ పేర్లు కలిపి ‘అరేబియన్ జాస్మిన్’, ‘స్పానీష్ జాస్మిన్’ ఇలా పిలుస్తుంటారు. బ్రెజిల్, ఫ్లోరిడా తదితర దేశాల్లోని కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో మల్లెచెట్లు పెంచుతున్నారు.

మల్లె పూలు అలంకరణ కోసం ఉపయోగించే పుష్పాలు. వివిధ సందర్భాల్లో ఈ పుష్పాలు ఎంతో ఆకర్షణీయంగా కనిపించడానికి దోహదపడుతాయి. విందులు, శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, ఇతర సందర్భాల్లోనూ ఇంటిని అలంకరించడానికి ఇవి ఎంతో ఉపయోగితం. ఈ పూలు ఉదయం పూట ముడుచుకుని ఉండి రాత్రిపూట వికసిస్తాయి. కొన్ని రకాల మల్లెలు మాత్రం తెల్లవారు జామున పూస్తాయి. ఉదయం పూట గట్టిగా ఉండే మల్లెమొగ్గలు సూర్యుడు ఆస్తమిస్తున్న కొద్దీ విచ్చుకుంటాయి.

చైనాలోని కొన్ని ప్రాంతాల్లో ‘జాస్మిన్ టీ’ పేరుతో టీ తయారు చేస్తారు. ఇది ఒక రకమైన తీయని రుచితో పాటు పరిమళాన్ని ఇస్తుంది. అంతేకాక గ్రీన్ టీ తయారీలో కూడా దీన్ని వినియోగిస్తారు. మల్లె పువ్వు రెమ్మలను వేరు చేసి వాటిని కొంతకాలం పూర్తిగా ఎండబెట్టి ఎండిన పూ రెమ్మలను పొడిలా చేసి నిలువ చేస్తారు. దానితో గ్రీన్ టీ తయారు చేస్తారు. అంతేకాక జాస్మిన్ సిరప్ తయారీకి, వివిధ రకాల నూనెలు తయారు చేయడానికి వినియోగిస్తారు. అలాగే ఈ పూల రెమ్మలతో చేసిన పొడిని తలకు పట్టడం వల్ల జుట్టుకు మంచి ఆకర్షణ, ఒక విధమైన మెరుపు కూడా వస్తుంది. వివిధ రకాల సుగంధ ద్రవ్యాల తయారీలోనూ, దేవాలయాల్లో వినియోగించే ఆగరుఒత్తుల తయారీలోనూ మల్లె నూనెను ఉపయోగిస్తారు.
మల్లెలు భారతీయ సంస్కృతితో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లోనూ మనకు మల్లెతీగ కనిపిస్తుంది. 

malle2మల్లెపూలను దక్షిణాదిన దేవుడికి అలంకరించడానికి, ఇంటి అలంకరణకు, తలలో తురుముకునేందుకు ఎక్కువగా వినియోగిస్తారు. పెళ్లిళ్లు, శుభకార్యాల్లోనూ మల్లెపూలకు ప్రత్యేకత ఉంటుంది. తాజాగా ఉన్న పూలను సేకరించి విక్రయించడానికి ముందే వ్యాపారస్తులు పూలు తాజాగా ఉన్నాయా లేవా అనే విషయాన్ని గుర్తిస్తారు. మల్లెపూలు వివిధ సందర్భాల్లో బహుమతిగా ఇవ్వాల్సిన ప్రత్యేకతనూ కలిగి ఉన్నాయి.

మల్లెపూవును చాలా దేశాలు తమ జాతీయ పుష్పంగా గుర్తించాయి. హవాయి, ఇండోనేషియా, పాకిస్తాన్, ఫిలిఫ్పైన్స్ దేశాలకు మల్లెపువ్వే జాతీయ పుష్పం. ఆయా దేశాల్లో అతిథులకు మల్లెపూలు ఇచ్చి ఆహ్వానం పలుకుతారు. 
భాష ఏదైనా సువాసన ఒక్కటే...
ఎవరే పేరుతో పిలిచినప్పటికీ మల్లెల పరిమళం మాత్రం విరివిగా లభించే తరగని సిరిసంపద.
భారతదేశం వివిధ రకాల సంస్కృతులు, సంప్రదాయాలు, మతాలు, కులాలు, భాషలు, వేషధారణలు, ఆచార వ్యవహారాలకు నిలయం. అయినప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశం సొంతం. మల్లెలోనూ అదే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ పుష్పాన్ని విభిన్న రకాల పేర్లతో పిలుస్తుంటారు. మోగ్రా, మోతియా, చమేలి, మల్లిపూ, జాటి, మల్లిగే, జూహి. మోగ్రా లేదా పాద జాతి వృక్షాల్లో మూన్‌లైట్ అని ఒక్కో వూపాంతంలో ఒక్కో రకంగా పిలుస్తారు. పేర్లు ఎన్ని ఉన్నప్పటికీ సువాసన మాత్రం ఒక్కటే. మల్లెపూలలో మాత్రం దాదాపు 300 రకాలు ఉన్నట్లు అంచనా. 


మగువల మనసుదోచే - మల్లె...
మల్లెకు మగువకు విడదీయలేని అనుబంధం ఉంది. మగువ చిన్నతనం నుండే తన తల నిండుగా పూలు పెట్టుకోవాలని ఆత్రుత పడుతుందట. పెళ్లి విషయానికొస్తే చెప్పనక్కరలేదు. పెళ్లితంతు మొదలైందం మల్లెల వాసన గుభాళిస్తుంది. పెళ్లి చూపుల్లోనే తలనిండుగా మల్లెపూలు పెట్టుకుని సిగ్గుతో తలదించుకుని పెళ్లికుమారుడి ఎదురుగా కూర్చునే పడతి తనకు తెలియకుండానే మొదట తన తలమీది పూలనే చూపుతుంది. జడనిండుగా పెట్టుకున్న మల్లెదండలను జడతో పాటు భుజాలమీదుగా ముందుకు వేసి అబ్బాయి మనసు దోచే ప్రయత్నం చేస్తుంది. ఇద్దరూ ఒకరికొకరు నచ్చితే ఇక పెళ్లి కుదిరినట్లే. పెళ్లికి ముందు వరపూజ, పూలుపండ్లు అనే తతంగం ఉంటుంది.

ఈ రెండు సందర్భాల్లోనూ మల్లెపూల దండలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇక పెళ్లి రోజు వచ్చిందంటే పెళ్లికి హాజరయ్యే ప్రతి ఒక్క మహిళ తల నిండుగా మల్లెపూల దండలు ధరిస్తుంది. పెళ్ళికూతురు తల నిండుగా పూలతో నింపి పూల జడ వేస్తారు. దీనికోసం ఎక్కువగా మల్లెపూలనే వాడుతారు. వధూవరులిద్దరి మెడలోనూ మల్లెదండలే వేస్తారు. ఇక పెళ్లి మండపాన్ని సైతం మల్లెదండలతో అలంకరిస్తారు. పెళ్లి ఊరెగింపులో ఉపయోగించే వాహనాన్ని కూడా మల్లెదండలతో అలంకరిస్తారు. పెళ్ళి అయిన తరువాత ఏర్పాటు చేసే మొదటి రాత్రిలోనూ మల్లెపూలదే హవా. వధూవరులిద్దరూ నిద్రించే మంచాన్ని అందంగా మల్లపూలతో అలంకరిస్తారు. మంచం చుట్టూ మల్లెదండలతో అలంకరించడంతో పాటు మంచం మీదా మల్లెలు చల్లి సృష్టికార్యానికి సాగనంపుతారు. మల్లె పూల దండలతో చెండు తయారుచేసి వధూవరులిద్దరికీ ఇస్తారు. ఇరువురు ఒకరిపై ఒకరు మల్లె చెండు విసురుకుంటూ సరసాలాడుకుంటారు. వరసైన మరదళ్లు ఉంటే భావను ఆటపట్టిస్తుంటారు. పూబంతులతో సాగే ఈ ఆట వారిరువురికే కాకుండా చూస్తున్న వారికి సైతం ఒక మధురానుభూతిని మిగుల్చుతుంది.

మన దేశంలో 300 రకాల మల్లెలు ఉన్నప్పటికీ వాటిలో మనకు తెలిసిన రకాలు కొన్ని మాత్రమే.
మన వూపాంతంలో పిలిచే పేర్లతో పాటు ఆయా ప్రాంతాల పేర్లతో చెలామణిలో ఉన్న మల్లెపూలు కూడా మనకు కనిపిస్తాయి. మన వూపాంతంలో ప్రతి ఇంటిపై తీగలా పాకుతూ పూసే మల్లెను ‘తీగమల్లి’ అని పిలుస్తుంటాం. దాన్నే ‘మైసూర్ మల్లె’ అని కూడా అంటారు. ఇది దేశంలోనే అత్యంత ఆదరణ కలిగిన మల్లెరకం. మైసూరుతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విరివిగా పెరగడం వల్ల దీనికి ‘మైసూరు మల్లి’ అని పేరొచ్చింది. 
మైసూరు రాజ్య పాలకుడైన వొడెయార్ మైసూరు నగరాన్ని రాజ వూపాసాదాల నగరంగా మార్చేందుకు నగరానికి మల్లెలకు ఉన్న సాంగత్యమే కారణమంటారు. ప్రతి ఏడాది దసరా ఉత్సవాలతో సమానంగా ఈ మల్లె సువాసనలు ఆకట్టుకుంటాయి. ఈ రకం మల్లె వ్యవసాయ భూములు, ఇంటి ముందు భాగం, పెరడు ఇలా ఎక్కడైన విపరీతంగా పెరిగే రకం. మైసూరు దాని చుట్టుపక్కల ఉన్న నగరాల్లో ఈ మల్లె జాతికి విపరీతమైన ఆదరణ ఉంది. చిన్న, సన్నకారు రైతులు సాగు చేసేందుకు ఈ రకం చాలా అనుకూలమైంది. మార్కెట్లో వీటికి మంచి గిరాకీ కూడా ఉంది.

హగగలి మల్లిగె
ఈ మల్లె రకం ప్రత్యేకమైన అధిక సువాసన, దీర్ఘకాలిక తాజాదనం లాంటి ప్రత్యేక గుణాలతో ప్రసిద్ధి చెందింది. దీన్ని ‘సువాసన మల్లె’ అని కూడా పిలుస్తారు. కర్నాటకలోని బళ్లారి ప్రాంతంలో ఈ పూలు ఎక్కువగా పూస్తాయి.

ఉడిపి మల్లి
ఇది విరజాజి మల్లి రకం. ఉడిపి మల్లి సాగు ఇతర మల్లె రకాల సాగును పోలి ఉంటుంది. ఉడిపి జిల్లాలోని శంకరపురాలో 100 ఏళ్ల క్రితమే దీని పెంపకం ప్రారంభమైంది. భట్కల్, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ ప్రాంతాల్లో ఇది విస్తారంగా సాగు చేయబడుతుంది. మిగిలిన రెండు రకాలతో పోలిస్తే ఇది ఎక్కువ ఆర్థిక విలువ కలిగింది. తీర ప్రాంతాలతో పాటు ముంబయి వంటి ప్రాంతాల్లో ఈ పుష్పాలకు మంచి గిరాకీ ఉంది. ఈ ప్రాంతంలోని ప్రతి కుటుంబం కూడా మల్లె సాగుకోసం ఇంటి ముందు కనీసం ఎకరం విస్తీర్ణంలో సాగు భూమిని కలిగి ఉంటుంది.ఇవే కాక ఆంధ్రవూపదేశ్‌లోనూ పూసే పలు రకాలు కూడా మనకు కనిపిస్తాయి. అవేమిటో చూద్దాం... 

ఆకాశమల్లె
ఆంధ్రవూపదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో ఈ మొక్క పొడుగ్గా వృక్షంలా పెరుగుతుంది. ఈ పుష్పాలు ఎక్కువగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలలో పూస్తాయి. ఈ పూలు మంచి సువాసన కలిగి ఉంటాయి. వీటి ఆకులు ముదురాకు పచ్చ రంగులో ఉంటాయి. గుత్తులు, గుత్తులుగా పొడుగు కాడలున్న తెల్లని పూలు పూస్తాయి. ఈ పూలు చాలా అందంగా ఉంటాయి. వీటిని ‘పొన్నపూలు’ అని కూడా అంటారు. పొన్నను సంస్కృతంలో ‘పున్నాగ అంటారు. తెలుగులో పొన్న వేరు, పున్నాగ వేరు, పున్నాగ పూలను కొండమప్లూలు, కాగడమల్లి, పొన్నాయిపూలు, సన్నాయిపూలు, మొల్లపూలు, కాడమల్లి, ఆకాశమల్లి అని కూడాఅంటారు. ఈ చెట్టు పూలను నోట్లో పెట్టుకొని పీలిస్తే తేనే వస్తుంది. వీటిని పిల్లలు ఏరుకొని చక్కగా జడలు అల్లుకుంటారు.

సిరిమల్లె
మల్లె పూలలో ఉన్న వివిధ రకాలలో ‘సిరిమల్లి’ కూడా ఒకరకం. దీనినే ‘వనమల్లి’ అని కూడా పిలుస్తారు. ఇది మంచి సువాసన కలిగిన పుష్పం. కొన్ని ప్రాంతాలలో దీన్ని ‘అడవి మల్లి’ అని కూడా పిలుస్తారు. వాస్తవానికి ‘అడవిమల్లి’, ‘వనమల్లి’ వేరువేరు పుష్పాలు.

నాగమల్లె
పుష్పించే మొక్కలలో ఆస్టరేసి కుటుంబానికి చెందిన పూలమొక్క నాగమల్లి. దీన్ని వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. ఇవి చిన్న పొదలుగా భారతదేశమంతా విస్తరించాయి. దీని భాగాలు తామర వ్యాధికి, పాముకాటుకు వైద్యంలో ఉపయోగపడుతుంది. వీటితో పాటు మన ప్రాంతంలో సన్నజాజి, జాజి, బొడ్డుమల్లి, అడవిమల్లి, తీగమల్లి వంటి వాటికి కూడా మంచి డిమాండ్ ఉంది.

బొడ్డు మల్లె
బొడ్డుమల్లి పూలకు మంచి ఆదరణ ఉంది. వీటినే కొంతమంది ‘బొండు మల్లెలు’ అని, ‘గొండు మల్లెలు’ అని, మరి కొందరు ‘బొడ్డుమప్లూలు’ అనీ పిలుస్తుంటారు. ఈ మల్లె తెల్లని రంగులో గులాబి పువ్వును పోలినట్టు వికసిస్తుంది.

మల్లియలపై మధుర గీతాలు 
మల్లెపూలు అనగానే తెల్లని స్వచ్ఛమైన రంగే కాదు. వాటికి మనసు కూడా ఉందని కవులంటారు. అందుకే మల్లెపూలపై ఎన్నో పాటలు పుట్టుకొచ్చాయి. ఈ పాటలన్నీ కూడా ఆయా సందర్భాల్లో అన్ని వయస్సుల వారిని ఎంతగానో ఆకుట్టుకున్నవే.
‘మప్లూతీగకు పందిరివోలే-మసకచీకటిలో ఎన్నెలవోలె’ అంటూ చెల్లెకు అండగా ఉంటానని అన్న పాడితే, ‘మప్లూపందిరి నీడలోనా జాబిల్లీ-మంచమేసి ఉంచినాను రావోయి’ అంటూ ప్రియురాలు ప్రియున్ని పిలుస్తుంటుంది. ‘మల్లియలారా, మాలికలారా మౌనంగా ఉన్నారా మా కథలే విన్నారా’ అంటూ విరహవేదనను మరో వనిత వెలిబుచ్చుతుంది. ‘మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో’ అంటూ ఒక ఆడ మగా మధ్య ప్రేమ పుట్టుకకు సాక్షమవుతుంది. ‘మల్లెతీగ వాడి పోగ’ అంటూ చెదిరిన తమ ప్రేమకథను కన్నీటితో ఆవిష్కరిస్తుంది. ‘మప్లూతీగ వంటిది మగువ జీవితం... చల్లని పందిరి ఉంటే అల్లుకు పోయేను’ అంటూ ఆడజీవితానికి ఒక మగతోడు ఎలా అవసరమో తెలియజెప్పే పాటా ఉండనే ఉన్నది. అంతేకాక, తెలుగుతల్లిని కీర్తిస్తూ ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ- మాకన్న తల్లి కి మంగళారతులు’ అన్న పాటా ఉన్నది కదా! 

మల్లెపూలు - పలు ఉపయోగాలు
పూలు అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చే ఉపయోగం, ఆడవాళ్లు తలలో పెట్టుకోవడం. కానీ, మల్లెలకు మరెన్నో ఉపయోగాలున్నాయి... 
సాధారణంగా అందమైన పూలు ఏవి కనిపించిన వాటిని తెంపి తలలో పెట్టుకునే గుణం ఆడవారికి సహజంగానే వచ్చిందంటారు. ఎందుకంటే సగటు ఆడవారికి తమ కంటే అందంగా ఉండే దేన్ని చూసిన ఆసూయ కలుగుతుందట. పూలు కూడా అంతే. వారికంటే అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి కనుక వాటిని తెంపి తమ తలలో పెట్టుకుంటారట. ఇక మల్లెపూల గురించి చెప్పక్కర్లలేదు. సాయంత్రం పూట విరభూసే పూలు మొదలు మరునాడు వేకువజామున పూసే మల్లెలైన సరే వాటిని అల్లుకుని తమ తలలో పెట్టుకునే వరకు వదలరు.

ఇవే కాక దేవాలయాల్లోని దేవుళ్ల పూజకు అవసరమైన దండల తయారీ కోసం కూడా వీటిని వినియోగిస్తారు, ముఖ్యంగా పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాలకు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. పువ్వుల కోసం తోటల్లో విస్రృతంగా సాగుచేయడంతో పాటు మల్లె మొక్కలను ఇంటివద్ద కూడా పెంచుతుంటారు. మల్లెలను సాగుచేసే రైతులు వీటిని విదేశాలకు ఎగుమతి చేయడం వల్లే అధిక లాభాలను ఆర్జిస్తారు. 
ఆసియాలో పుట్టి ఎల్లలు దాటి...

మల్లె పరిమళం విశ్వవ్యాపం. అది సమువూదాలను సైతం దాటి అనేకుల మనసులను దోచుకుంటోంది.
మల్లె పుట్టింది మన ఆసియా ఖండంలోనే. ఆ తరువాత యూరప్‌కు ప్రయాణించి మధ్యధరా సముద్రం వెంబడి విస్తరించి ఆ తరువాత గ్రీస్, టర్కీలను జయించి స్పెయిన్ గుండా ప్రయాణించి పశ్చిమ యూరప్ చేరుకున్న తర్వాత ఫ్రాన్స్, ఇటలీలను కూడా తన సొంతం చేసుకుంది. 17వ శతాబ్దం చివరినాటికి ఇంగ్లాండుకు చేరుకుంది. ఇలా ప్రపంచమంతా కూడా మల్లె అంటే తెలియని వారుండరు. అంతటి ప్రాచుర్యం పొందిన మల్లెను కొన్ని దేశాల్లో జడలో ఆలంకరించుకుంటే మరికొన్ని దేశాల్లో సుగంధవూదవ్యాలు తయారు చేయడానికి వినియోగిస్తున్నారు.

0 comments:

Post a Comment

  • VIDEOS
  • PHOTOS
  • NEWS UPDATE