How To Create a Website

Mana Manthani web site కు విచ్చేస్తున్న Manthanites కి స్వాగతం సుస్వాగతం మరియు మరియు శుభాకాంక్షలు .. , No. 9246575261

వేసవి సెలవుల సద్వినియోగం ఎలా?వేసవి సెలవులు ప్రారంభం అయి ఇరవై రోజులు అయింది. సుమారుగా ఇంకో నెల రోజులు మిగిలి ఉన్నాయి. ఈ నెల రోజులను వినోదం, విశ్రాంతి అనే అంశాలకు మాత్రమే కేటాయించుకోకుండా, పాఠశాలల మేనేజ్‌మెంట్, ఉపాధ్యా యులు తమ వృత్తి నైపుణ్యాలను తప్పనిసరి చేసుకోవాలి. వృత్తి ధర్మాలను ప్రక్కన పెడుతూ పూర్తి వ్యాపార ధోరణిలో పాఠశాలలను నడిపించే స్కూల్ మేనేజ్‌మెంట్ల సంఖ్య, అదే విధంగా బెల్, బిల్ అనే తప్పుడు సూత్రాన్ని పాటిస్తూ వృత్తి కమిట్‌మెంట్ లేని ఉపాధ్యాయుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఫలితంగానే చాలా సంవత్సరాల క్రితం నెలకొల్పిన పాఠశాలలు కూడా మంచి ఫలితాలు సాధించలేక అభివృద్దిలో వెనకబడి పోతున్నాయి. అన్ని దానాలలోకెల్లా విద్యాదానం అతి విలువైనది అన్న ప్రాధమిక ధర్మాన్ని పాటించని మేనేజ్‌మెంట్ వర్గం, ఉపాధ్యాయ వర్గం ఈ వృత్తిలో ఉండడం వలన విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం పడుతున్నది.


- ప్రపంచంలో శరవేగంగా మారుతున్న రంగాలలో విద్యారంగం ప్రథమంగా నిలుస్తున్నది. ప్రతి రోజు వేల కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. టెక్నాలజీని ఉపయోగించి విద్యా బోధన చేసే పాఠశాలల సంఖ్య పెరుగుతున్నది. ఎప్పుడో చదివిన, డి.ఇ.డి, బి.ఇడి పాఠ్యాంశాలలోని, బోధనా పద్ధతులు ఇప్పుడు పాతబడిపోయాయి.

- విద్యాహక్కు చట్టం (2010) భారతదేశ విద్యారంగంలో సమూలమైన మార్పులకు దిశా నిర్దేశనం చేసింది. ఈ చట్టం ప్రకారం 8వ తరగతి వరకు పరీక్షలు నిర్వర్తించకుండా, విద్యార్థి సంవత్సరంలో వివిధ అంశాలలో సాధిస్తున్న ప్రగతిని నిరంతర సమగ్ర మూల్యాంకనం ద్వారా అంచనా వేయాలి. విద్యార్థి తన చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలించి అర్థం చేసుకొని, భవిష్యత్తులో వచ్చే, సవాళ్ళను అధిగమించేలా విద్యార్థి తయారు అయ్యేలా పాఠ్య ప్రణాళికలను మారుస్తూ వస్తున్నారు. ఇకపై ప్రశ్న- జవాబులు అనే మూస పద్ధతి పరీక్షలకు స్థానం తగ్గిపోనున్నది. ప్రణాళికా బద్దమైన ప్రాజెక్టులు, క్షేత్ర పర్యటనలు, ప్రయోగాలు మొదలైన అంశాలు విద్యార్థి ప్రగతిని అంచనా వేయడంలో కీలకమైన అంశాలుగా చేరుస్తూ 2010 కేంద్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని రూపొందించింది.
- ఈ గొప్ప చట్టం వలన రాబోయే సంవత్సరాలలో భారతదేశ ప్రాధమిక విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పు రానున్నది. ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం 1 నుండి7వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలను నిరంతర సమగ్ర మూల్యాంకనం (సిసిఇ) పద్ధతిలో మార్చింది. ఈ సంవత్సరం (8,9 పాఠ్యాంశాలను మారుస్తున్నది) ఈ కొత్త పద్ధతికి అనుగుణంగా విదార్థులను తీర్చిది ద్దాలంటే ఉపాధ్యాయులు, ఈ వేసవి సెలవు లను వృత్తి రీత్యా ప్రయోజనకరంగా తీర్చిది ద్దుకోవాలి.
ఉపాధ్యాయులు ఏం చేయాలి!
- నిరంతర సమగ్ర మూల్యాంకనం (సిసిఇ) అంటే ఏమిటో క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి.
- పాఠాలను వీలైనన్ని సార్లు చదివి పాఠ్య ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి.
- 2012-2013 సంవత్సరంలో జరి గిన, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, వార్షిక పరీక్షల ప్రశ్నాపత్రాలను విశ్లేషించుకోవాలి. అన్ని ప్రశ్నాపత్రాల మోడల్ ఒకటిగా లేదు. ప్రతి సారి, విభిన్న తరహా ప్రశ్నలు అడుగు తున్నారు. వీటితో పాటు ప్రభుత్వం (డిసి ఇబి) వారు లేదా ఆర్వీయం వారు ఇచ్చిన మెటీరియల్‌ను బాగా విశ్లేషించుకోవాలి.
- ఆయా తరగతులలోని పాఠ్యాంశాలకు సంబంధించి సిసిఇ మోడల్ ప్రశ్నలను తయారు చేసుకోవాలి.
- ప్రతి సబ్జెక్టుకు సంబంధించి వీలైనన్ని ప్రాజెక్టు పనులను సిద్ధం చేసుకోవాలి.
- సి.బి.యస్‌ఇ, ఇ.ఐ.సి.యస్.ఇ పుస్తకాలలోని మూల్యాంకనా నికి సంబంధించిన ప్రశ్నలను పరిశీలించి, వాటి ఆధారంగా మోడల్ ప్రశ్నలను సిద్ధం చేసుకోవాలి.
- ప్రతి తరగతికి సంబంధించి, సాంవత్సరిక ప్లాన్, మంత్లీప్లాన్, యూనిట్‌ప్లాన్‌ను తయారు చేసుకోవాలి.
- పిల్లల స్థాయిని దృష్టిలో ఉంచుకొని సంవత్సరం మొత్తం, ఏం బోధించాలి?
- ఏయే కీలక అంశాలను, ఏయే నెలల్లో ప్రవేశపెట్టాలో ముందే నిర్ణయించుకోవాలి.
- టీచింగ్‌లో ఎంత సీనియర్ అయినప్పటికి నిరంతరం పాఠ్యాంశాలను ప్రిపేర్ కావడం అనే విషయాన్ని మరిచిపోకూడదు.
- ప్రముఖ విద్యావేత్త శ్రీ చుక్కా రామయ్య వంటి విద్యావేత్తలు సయితం పాఠ్యాంశాలు ముందుగా ప్రిపేర్ కాకపోతే, ఆ రోజు క్లాస్ తీసుకునేవారు కారని చాలా సందర్భాలలో చెబుతుంటారు.
- సైన్స్ ఉపాధ్యాయులు చిన్న చిన్న ప్రయోగాత్మక పాఠ్యాంశాలను ఎలా బోధించాలో ప్రాక్టీస్ చేయాలి.
- ఉపాధ్యాయులందరూ, ప్రతిరోజు కనీసం రెండు గంటల పాటు, తన వృత్తి నైపుణ్యాలను పెంచుకోవటానికి ఉపయోగించుకోవాలి.
- అందరూ అవలంబిస్తున్న బోధనా పద్ధతులు కాకుండా కొత్త పద్ధతులను తయారు చేసుకోవాలి.
- మారుతున్న సమాజ అవసరాలకు తగినట్లుగా తన విద్యార్థులను సిద్ధం చేయాలన్న తపన పెంపొందించుకుంటే ఉపాధ్యాయుడు తన వృత్తికి న్యాయం చేయడం సులభం అవుతుంది.

విద్యార్థులెలావినియోగించుకోవాలి.....
సమ్మర్‌ను నైపుణ్యాలు పెంచు కునేలా విద్యార్థులు ఉపయోగించు కుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉదాహరణకు గణితం అంటే భయం ఉన్న ఏడో తరగతిలోపు విద్యార్థులు ‘అబాకస్’ నేర్చుకోవడం ద్వారా, గణి తంపై పట్టు లభిస్తుంది. ఎనిమిది నుంచి పదో తరగతి విద్యార్థు లకు ‘వేదిక్ మ్యాథ్స్’తో మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే సైన్స్ గ్రూప్‌లే లక్ష్యంగా ఉండే విద్యార్థులు డ్రాయింగ్ శిక్షణ ప్రయోజనకరంగా ఉంటుంది. 
- అన్ని తరగతుల విద్యార్థులకు చక్కటి చేతిరాత అవసరమే. వారందరికీ హ్యాండ్ రైటింగ్ శిక్షణ ప్రస్తుతం వేసవి శిబిరంలో అందుబాటులో ఉంటుంది. దీనితో ఎంతో ప్రయోజనం ఉంటుంది. 
- అకాడమిక్ చదువు ఇంకా పూర్తి కాని విద్యార్థులు అంటే... డిగ్రీ రెండో తొలి సంవత్సరం చేరాల్సిన విద్యార్థులతో పాటు, ఇంటర్, టెన్త్, ఇతర తరగతులకు వెళ్లాల్సిన విద్యార్థులు కేవలం స్ఫోకెన్ ఇంగ్లీష్ తరగతులకు హాజరయితే సరిపో తుంది. ఆయా తరగతుల్లో గ్రామర్ ఓరియెంటేషన్ ఉంటుం ది కాబట్టి అవన్నీ అకాడమిక్ ప్రయోజనాలకు కూడా సరిపోతుంది.
- డిగ్రీ రెండు లేదా మూడో సంవత్సరం, ఇంజినీరింగ్ మూడో ఏడాదిపైన చదవాల్సిన విద్యార్థులు ‘కమ్యూనికేషన్ స్కిల్స్’పైన దృష్టి సారించాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో ఈ విద్యార్థులు గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూలు ఎదుర్కొ వాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ఈ నైపుణ్యాలను నేర్పిస్తారు.
- చాలా ప్రాంతాల్లో సమ్మర్‌లో తక్కువ ఫీజు ఉంటుందని అనవసరంగా కంప్యూటర్ కోర్సులలో చేరుతూ ఉంటారు. అయితే అవసరాన్ని బట్టి చేరడం మంచిది. ఇంజినీరింగ్ సీటు ఆశిస్తున్న ఇంటర్ పూర్తి అయిన విద్యార్థులు సీ, సీ++, డాటా స్ట్రక్చర్స్ కోర్సులో చేరితే ప్రయోజనకరంగా ఉంటుం ది. ఇంజినీరింగ్ తొలి ఏడాది ఈ అంశాలపై తరగతులు ఉంటాయి. అదే విధంగా కామర్స్ వైపు వెళ్లాలనుకునే విద్యార్థులు ఎం-ఎస్ ఆఫీస్ కోర్సులో చేరితే మంచిది. ఇందులో ఎం-ఎస్ వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ తదితర కోర్సులను నేర్పిస్తారు. బి.కాం పూర్తి చేసి ఎంకాంకు వెళ్లాలనుకునే విద్యార్థులు లేదా బి.కాం చివరి సంవత్సరానికి వెళ్లాల్సిన విద్యార్థులు ట్యాలీ, ఫొకస్ తదితర అకౌంటెన్సీ కోర్సులను చేస్తే ప్రయోజనకరంగా ఉంటాయి.
- బీఏ, లేదా ఎంఏ, తదితర కోర్సుల విద్యార్థులు డిటీపీ, వెబ్‌డిజైనింగ్ కోర్సులవైపు దృష్టి సారించవచ్చు. ఇవి సృజనాత్మకతతో ముడిపడి ఉన్న కోర్సులు. ప్రస్తుతం అవకాశాలు కూడా మెరుగ్గా ఉన్నాయి. 
- కోర్సుల ఎంపికలో అవసరమే ప్రాతిపదిక కావాలి కాని..... తక్కువ ఫీజు ఉందన్న నెపంతో చేరితే సమయం, డబ్బు వృథాగా మారుతాయి. జాగ్రత్తగా కోర్సుల ఎంపిక చేసుకుంటే సమ్మర్ సద్వినియోగం అయినట్లే.


స్కూల్ మేనేజ్‌మెంట్స్ ఏం చేయాలి?
- సబ్జెక్టు ఎక్స్‌పర్ట్‌లచే టీచర్లకు నిరంతర సమగ్ర మూల్యాంకనం (సి.సి.ఇ) గురించి ఓరియెంటేషన్ తరగతులు నిర్వహించాలి. నిజానికి చాలా మంది ఉపాధ్యాయులకు పయివేట్ రంగంలో) ఈ కొత్త పద్ధతి గురించి పూర్తి అవగాహన రాలేదు. ఫలితంగా క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, వార్షిక పరీక్షలలో ప్రభుత్వం ప్రశ్నా పత్రాలకు సమాధా నాలు రాయడంలో విద్యార్థులు వెనుక బడుతున్నారు. మొదట ఉపాధ్యాయు లకు సిసిఇ విధానం పట్ల అవగాహన కల్పించడం చాలా అవసరం.
- గత సంవత్సరం ఫలితాలను, అనుభ వాలను విశ్లేషించుకోవాలి. ఆయాతర గతుల విద్యార్థులు వారి స్థాయికి తగినట్లుగా కనీసం చదవడం, రాయడం లో పాఠశాల ఏ స్థాయిలో ఉందో తెలుసుకొని, దానికి అనుగుణంగా మార్పులు చేసుకొవాలి.
- ప్రతి తరగతిలో టాపర్లు, యావరేజ్, బిలో యావరేజ్ స్థాయిలో ఎంత మంది విద్యార్థులున్నారో వీలైనంత కచ్చితంగా తెలుసుకొని బిలో యావరేజ్ విద్యార్థుల సంఖ్యను తగ్గించే విధంగా ఈ సంవత్సరం ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి.
- విద్యాహక్కు చట్టం 2010 ప్రకారం విద్యార్థులకు క్రీడలు తప్పనిసరి. క్రీడల కోసం ప్రత్యేకమైన టైం తయారు చేసుకోవాలి. క్రీడాస్థలం లేకపోతే కనీసం చెస్, క్యారమ్స్ వంటి క్రీడలను తప్పక పిల్లలు ఆడే విధంగా చూడాలి.
- పిల్లలలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగే విధంగా ప్రతీవారం విభిన్న కార్యక్రమా లను రూపొందించుకోవాలి. క్రమం తప్ప కుండా సంవత్సరం అంతా ఈ కార్య క్రమం నడిచే విధంగా చూడాలి.
- ప్రతి జాతీయ పండుగలను, వివిధ మతాలకు చెందిన పండుగలను ఖర్చు లేకుండా ప్రతి పాఠశాలలో జరిపే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలలో పిల్లలు, తల్లిదండ్రులు అందరూ పాల్గొనేలా చూడాలి.
- 8,9,10 తరగతుల విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో 10 తరగతి తర్వాత కెరియర్ గురించి, గైడెన్స్ ప్రొగ్రామ్స్ నిర్వహించుకునే ప్రణాళికను సిద్ధం చేసుకొవాలి.
- ప్రతి పాఠశాలలో అన్ని సబ్జెక్టులకు ల్యాబ్‌లు ఉండే విధంగా ఇప్పుడే ప్రణాళిక వేసుకొవాలి. లాంగ్వేజ్ ల్యాబ్‌లు తప్పుకుండా ప్రారంభించగలగాలి.
- పేరెంట్స్ తో ఎంత క్రీయాశీలకంగా సంబంధాలు కలిగి ఉన్నారో, పునర్విమర్శ చేసుకోవాలి. తదనుగుణంగా ఈ సంవత్సరం మరింత మంచి సంబంధాలు పెంచుకోవ డానికి ప్రణాళికను వేసుకోవాలి.
- పాఠశాలకు సంబంధించి పాఠశాల చిన్నదైనా పెద్దదైనా, విభిన్న విభాగాలను గుర్తించి వాటికి ఒక ఇంచార్జీని నియమించి వారిని సరిగా పర్యవేక్షించడం ఎలానో ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి.
- కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ క్లాస్‌లు ఎంత ఫలితాన్ని ఇస్తున్నా రెగ్యులర్‌గా సూపర్‌వైజ్ చేసే ప్రణాళికను వేసుకొవాలి.
- పాఠశాలను స్థానిక అవసరాలకు తగ్గట్లుగా చక్కగా తీర్చిదిద్దడానికి, ఇతర పాఠశాలల పోటీకి తట్టుకొని నిలబడేటట్లు పాఠశాలను సంవత్సరం అంతా నడిపేప్లాన్ సిద్ధం చేసుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటే మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి.

0 comments:

Post a Comment

  • VIDEOS
  • PHOTOS
  • NEWS UPDATE