How To Create a Website

Mana Manthani web site కు విచ్చేస్తున్న Manthanites కి స్వాగతం సుస్వాగతం మరియు మరియు శుభాకాంక్షలు .. , No. 9246575261

Job లో మార్పు మంచిదేనా ! :














How to prepare a resume for interview success
రెండు దశాబ్దాల క్రితం వరకూ ఉద్యోగులు తరచుగా సంస్థలు మారడం కనిపించేది కాదు. కానీ మారుతున్న కాలానికనుగుణంగా ఉద్యోగుల ఆలోచనా ధోరణి మారుతోంది. ఉద్యోగంలో చేరిన వ్యక్తి ఎంత కాలం స్థిరంగా పని చేస్తాడో అంచనావేయడం సంస్థలకు కష్ట సాధ్యమవుతోంది. ప్రతిభ, అనుభవం, నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు మెరుగైన వేతనం, ఉన్నత హోదా, ఇతర సౌకర్యాలు కల్పించడానికి ఎన్నో సంస్థలు పోటీపడుతుండడం, ప్రస్తుత సంస్థలో రాజకీయాలు, ప్రోత్సాహాలు/గుర్తింపులేకపోవడం, ఉన్నతాధికారుల భావనల్తో ఇమడలేకపోవడం మొదలైన కారణాల వల్లే ప్రతిభావంతులైన ఉద్యోగులు సంస్థల్ని వీడుతున్నారని తాజా సర్వేలు వెల్లడించాయి. ఏదిఏమైనా సంస్థ మారాల్సి వచ్చినపుడు అన్నికోణాల్లోనూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు అసలుకే ఎసరుపెట్టే అవకాశాల్ని కల్పిస్తాయని గుర్తుంచుకోవాలి. 

సంస్థ మారుతున్నారంటే కారణం!
ఉద్యోగులు తరచూ సంస్థలు మారడానికి ముఖ్యంగా మూడు కారణాలున్నాయి. మెదటిది వేతనం, రెండోది హోదా, మూడోది గుర్తింపు. ఈ మూడూ తన అభివృద్ధికి అత్యంత ముఖ్యమని ప్రతీ ఉద్యోగీ భావిస్తాడు. వేతన విషయంలో నిరాశ ఎదురైనప్పుడు వేరే సంస్థలో చేరేందుకు ఎక్కువమంది ఉద్యోగులు మొగ్గుచూపుతారు. సంస్థలు మారే ఉద్యోగుల్లో ఎక్కువశాతం ఇలాంటి వారే. ఉన్నతమైన హోదా కోసం (డిజిగ్నేషన్) సంస్థ మారాలని భావించేవారు కొందరు. ఇక మూడో కోవకి చెందిన వారు సంఖ్యాపరంగా చాలా తక్కువ. అయితే పైవారితో పోలిస్తే ఈ తరహా వ్యక్తులు బహుముఖ ప్రజ్ఞులు, అమోఘమైన ప్రతిభాపాటవాలు కలిగిన వారని కేవలం సరైన గుర్తింపు లేదు అనే భావనతోనే వీరు సంస్థల్ని వీడుతున్నారని డిఫ్యూజన్ ఆఫ్ ఇన్నోవేషన్ సిద్ధాంతం ఆధారంగా ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.

మార్పు మంచిదేనా ! :
ఉద్యోగ ప్రపంచంలో కొత్తగా అడుగుపెట్టినవారు సహజంగానే అసౌకర్యానికి గురౌతారు. పని వాతావరణంలో ఎదురయ్యే పరిస్థితులు వారి ఊహించిందానికి భిన్నంగా ఉండడం, సహచరుల ప్రభావం, సంస్థాగత రాజకీయాలు... ఇలా ఎన్నో కొత్త అంశాలు వారిపై ప్రభావం చూపుతాయి. దీనికారణంగానే కొత్తగా ఉద్యో గాల్లో చేరిన వారిలో దాదాపు 75 శాతం మంది మొదటి సంవత్సరంలోనే సంస్థ మారేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇదంతా ఏదో ఓ రంగానికే పరిమితమైన అంశం కాదు. ఏమాత్రం సంబంధం లేని రంగాల్లోనూ ఈ పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఐటీ, బీపీఓ, మార్కెటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా, ఇన్సూరెన్స్ సెక్టార్లో ఈ మార్పు గణనీయంగా ఉంది. 

అయితే అన్ని సమయాల్లోనూ ఇది సత్ఫలితాన్నివకపోవచ్చు. ముఖ్యంగా అనుభవం, నైపుణ్యం లేకపోవడం, వేరే ఉద్యోగం చూసుకోకుండా ప్రస్తుత ఉద్యోగానికి రాజీనామా చేయడం, మార్కెట్ పతనం అవుతున్నప్పుడు , కొత్త సంస్థకి - పాత సంస్థకి పెద్దగా తేడాలేదని భావించినప్పుడు.... ఇలా ఎన్నో సమయాల్లో మార్పు ప్రతికూల ఫలితాన్నిస్తుంది. నిర్ణయం తీసుకునే ముందు ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి.

ఎందుకీ ‘మార్పు’:
మార్పుకావాలని కోరుకోవడానికి కారణాలనేకం. అభివృద్ధి, హోదా, సౌకర్యాలు, స్వేచ్ఛ, ఆత్మాభిమానం... మొదలైనవి పొందడం లేదని ఉద్యోగి భావించడం, నైపుణ్యానికి గుర్తింపు లేకపోవడం, ప్రోత్సాహకాల కొరత, చేస్తున్న పనిపై అయిష్టత,.... ఇలా ఎన్నో. ఈ కారణాల వల్లే ఆయా ఉద్యోగులు కొత్తదనాన్ని అన్వేషిస్తారు. ప్రస్తుత స్థాయికంటే వేరే సంస్థలో ఉన్నత స్థాయి ఉద్యోగం దొరికిన పక్షంలో సంస్థ మారతారు కొందరు. సమాన స్థాయైనా వ్యక్తిగత కారణాల వల్ల సంస్థను విడిచిపెట్టేందుకు సిద్ధపడతారు మరికొందరు.
ఆత్మవిశ్వాసం:
ఓ సంస్థలో ఉద్యోగంలో చేరిన తర్వాత ఆక్కడి పని వాతావరణంలో పూర్తిగా ఇమిడిపోవడానికి కనీసం ఆరు మాసాల సమయం పడుతుంది. ఆ సమయంలో ఎదురయ్యే ఒడిదుడుకుల్ని ఉద్యోగి ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి. ఉద్యోగంలో కొన్నాళ్లు స్థిరంగా పనిచేసినపుడే అందులో కష్టనష్టాల్ని, అనుకూల ప్రతికూలతల్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. 

ఇతర సంస్థల నుంచి సిబ్బందిని ఆకర్షించడానికి (ముఖ్యంగా నిపుణుల్ని) పోటీ సంస్థలు ప్రత్యేక ప్యాకేజీలతో ఉద్యోగుల్ని సంప్రదిస్తాయి. అలాంటి సందర్భాల్లో ఉద్యోగులు ఆచితూచి వ్యవహరించాలి. చేరబోయే సంస్థలో మీ విధులు, పనివేళలు, మీకుండే సౌకర్యాలు, బాధ్యతలు, గౌరవం తదితర అంశాలపై క్షుణ్నంగా అవగాహన ఏర్పరచుకున్న తర్వాతే కొత్త కొలవులో చేరాలి.

చాలా సందర్భాల్లో కొలువిచ్చిన కొత్త సంస్థలు ఉద్యోగి నైపుణ్యాల ద్వారా వీలైనంత త్వరగా తమ పనులు పూర్తి చేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. మీవరకు వచ్చేసరికి ముఖ్యంగా సరైన ప్రోత్సాహకాలిచ్చే సమయంలో, మీకనుకూల నిర్ణయాలు తీసుకోవల్సి వచ్చినప్పుడు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తాయి. అందువల్ల కొలువు మారేముందే అన్ని విషయాలపై సమగ్ర అవగాహన ఏర్పరచుకోవాలి. ఏ విధమైన పరిస్థితుల్నైనా తట్టుకుని నిలబడగలిగే స్థాయిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలి. 

వయసు ప్రధానం:
ఉద్యోగులకు ముఖ్యమైంది వయసు. సానుకూల ప్రతికూల అంశాల కలబోత ఇది. ఎక్కువ అనుభవం ఉన్న ఉద్యోగుల వయసు సాధారణంగానే ఎక్కువగా ఉంటుంది. వీరికి కొత్త కొలవులో ఉత్తమ వేతనం లభించే అవకాశాలు అనుకూలాంశం అయితే బాధ్యతల బందీలో ఉన్న ఉద్యోగాన్ని వదలాల్సి రావడం ప్రతికూలాంశం. అందువల్లే వయో అంశం అనుభవజ్ఞులైన నిపుణుల నిర్ణయం పై ప్రభావం చూపుతుంది. 

పై వారితో పోలిస్తే తక్కువ వయసులో ఉన్న ఉద్యోగులు, యువకులు నిర్ణయం తీసుకోవడం సులభం. పెద్ద పెద్ద బాధ్యతలు లేకపోవడం, చురుకుదనం, నిర్ణయాలు తీసుకోవడంలో తెగువ, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం, అనుకోని అవాంతరాలు ఎదురైనా తట్టుకునే సామర్థ్యం... ఇవన్నీ వారికి అనుకూలించే అంశాలు. ఒక వేళ అనుకున్న కొలువు రాకపోయినా కొన్ని నెలలపాటు నిరుద్యోగిగా జీవించేందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకపోవడం వీరికి కలిసొచ్చేదే.

కొలువు మారదామనుకునేముందే మీకున్న అనుకూల ప్రతికూలాంశాలపై క్షుణ్నంగా ఓ అవగాహనకి రావాలి. అప్పుడే నిర్ణయం తీసుకోవాలి.

నిర్ణయం మీదే : ఏ వ్యక్తికావ్యక్తే ప్రత్యేకం, తీసుకునే నిర్ణయం దృఢమైందై ఉండాలి. చిన్న చిన్న విషయాల్ని భూతద్దంలో చూసి సంస్థ మారాలని నిర్ణయించుకోవడం లాభించదని గ్రహించండి.
మీ పనిని పరిపూర్ణంగా చేసేందుకు నిరంతరం శ్రమించండి. ప్రస్తుత సంస్థలో పొందుతున్న జీతభత్యాలు, ఇతర అలవెన్సులు వగైరా వగైరాలన్నీ మీపనిపైనే ఆధారపడి ఉంటాయని విశ్వసించండి. మీ వేతనం పెరగకపోవడానికి సహేతుకమైన కారణాలేమైనా ఉన్నాయేమో శోధించండి, మీవైపు లోపాలుంటే సరిదిద్దుకోండి. మీ పరిథిలో మీ విధుల్ని ఉత్తమంగా నిర్వర్తించండి. మీ పని వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకోండి. మీ సంస్థ అభివృద్ధికై కాంక్షించండి. మీపనిలో మీరు నిపుణులయ్యే స్థాయికి చేరుకోండి. మీపై నమ్మకాన్ని పెంచుకోండి. మీ ఆత్మాభిమానాన్ని కించపరిచే చర్యల్ని ఖండించండి.అప్పుడు కచ్ఛితంగా మీ సంస్థ మిమ్మల్ని గుర్తిస్తుంది. మీకివ్వాల్సిన గౌరవం అందిస్తుంది. నిపుణుడైన ఉద్యోగిని వదులుకునేందుకు ఏ సంస్థా ఇష్టపడదనే సత్యాన్ని గ్రహించండి. 

ఒకవేళ అప్పటికీ మీకనుకూల వాతావరణం కలగకపోతే మీ ఉద్యోగ జీవితాభివృద్ధికై మీకు నచ్చిన మీరు మెచ్చిన నిర్ణయం తీసుకోండి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మీరు తీసుకునే నిర్ణయం కచ్ఛితంగా మీ ఉన్నతికి దోహద పడుతుంది... మీ విజయాన్ని కాంక్షిస్తుంది.

How to prepare a resume for interview success

Do you want to get a great job in these competitive times?


  • Create a resume that employers will LOVE.
  • An HONEST resume that you can justify at interview
  • An interview strategy that stands up to pressure under questioning


It’s not about revving up your CV / Resume with wonderful power words and phrases that are not a true reflection of the core you.

As a recruitment consultant I meet quite a few people who’s CV / Resume is not an accurate reflection of their capabilities, many are considerably “overstated”.

And I can assure you this is not the route to take.

In fact much of this guide concentrates on identifying the behaviors, competencies and characteristics of people that all companies are looking to hire.

And then provide the tools to ensure you can honestly demonstrate those same behaviours, competencies and characteristics that are core to you.

Yes, we will use proven marketing techniques to ensure we make the most of your expertise and experience.

But the objective is to ensure you get interviews for roles you are ideally suited too.


The Insider Action Guide is 38 pages of great techniques and step by step instructions that WILL help you:-
  • Identify the critical skills and personality traits from any job advert or description.
  • Use great free on-line personality and motivational tests, to build, powerful, compelling personal statements for your resume.
  • Ensure your own skills and personality traits marry with those of your target role.
  • Use the fantastic STAR method for detailing your career experience, in language that employers cannot resist.
  • Use the Star method as basis for a fantastic question answering technique that cannot fail.

0 comments:

Post a Comment

  • VIDEOS
  • PHOTOS
  • NEWS UPDATE