How To Create a Website

Mana Manthani web site కు విచ్చేస్తున్న Manthanites కి స్వాగతం సుస్వాగతం మరియు మరియు శుభాకాంక్షలు .. , No. 9246575261

మన కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు

కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు

సరస్వతీ నది అంతర్వాహిని మాత్రమే అని శాస్త్రాలు చెబుతున్నాయి. తెలుగు నేలలో వ్యాసునిచే ప్రతిష్టితమైన సరస్వతీ దేవాలయం, త్రివేణి సంగమంలో సరస్వతీ నది రెండు కలిసిన, వెలిసిన పుణ్యక్షేత్రం 'కాళేశ్వరం'లో మాత్రమే ఉంది... దక్షిణ భారతంలో తొలి సరస్వతీ ఆలయం కాళేశ్వరంలో క్రీ.పూ. 550 సంవత్సర కాలంలో ప్రతిష్టించ బడింది.

జ్యోతిష్య, ఖగోళ శాస్త్రాల అనుసారంగా నవగ్రహాల గమనంలో బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించిన సంవత్సరం సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి. దీని ప్రకారం ఈ ఏడాది మే నెల 29వ తేదీ విజయనామ సంవత్సర వైశాఖ కృష్ణ పంచమి బుధవారం సాయంత్రం 6.41 నిమిషాలకు బృహస్పతి మిథున రాశిలో ప్రవేశిస్తాడు. సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ సరస్వతీ నది ఒకటి ఉన్నదా! ఉంటేనే కదా పుష్కరాలు. ఈ సందేహం చాలా మందిలో కలుగుతున్నది. ఆ సందేహాల నివృత్తిలో పుష్కర యాత్ర చేయించేందు కోసమే ఈ వ్యాసం.
'గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ / నర్మదా స్సింధ కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు'
నిత్యం ప్రతి హైందవుడు ప్రతి పూజకు ముందు కలశ వరుణ పూజలో చేసే ఆరాధన. అలహాబాదులో గంగ (భగీరథ) యమునా, సంగమంలో సరస్వతీ నది ప్రవహిస్తుందని ఉత్తర భారతదేశంలో ప్రచారం. కాళేశ్వరంలో కరీంనగర్ జిల్లాలో గోదావరి, ప్రాణహిత నదుల సంగమంలో మూడవ నదిగా సరస్వతీ నది అంతర్వాహినిగా గుప్తగామినిగా ప్రవహిస్తూ త్రివేణి సంగమమైంది. సారంగ పురాణంలో సనత్కుమార సంహితలో 'కాళేశ్వర ఖండం' పదహారో అధ్యాయంలో
'బ్రహ్మక మండల సంభూతే, పూర్ణచంద్ర నిభాననే' / 'ప్రణీతా యాశ్చ గౌతమ్యా మధ్యే సప్త సరస్వతీ' అని శ్లోకం ఉంది. అందుకు తార్కాణంగా వ్యాస మహర్షిచే స్థాపించబడిన సరస్వతీ మాత దేవాలయం ఉంది.
'గౌతమీ పార్వతీ రూపా ప్రణీతాతు రమయామమా/ సరస్వతీ శారదాంబాచా భవేయుః కామగా ఇవా' అని వివరణ ఉంది. ఇంకా లోతుకు వెళుతూ
'ప్రణీతా యమునా ప్రోక్తాగౌతమీ జాహ్నవీ తథా/ సరస్వతీ గుప్తగామీచ త్రినదీ సంగమాచ్ఛుభం' అంటూ సరస్వతీ ప్రాధాన్యత చెప్పబడింది. కాదు సరస్వతీ నది అసలే లేదు - కేవలం బద్రీనాథ్, కేదారీనాథ్ ప్రాంతంలో ఉండేదట అని కొందరు 'టూరి స్ట్' వ్యాపారుల వాదన. కృత్రిమ ఉపగ్రహాలు సేకరించిన ఛాయాచిత్రాలు మాత్రం కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు కొన్నివేల సంవత్సరాలు సరస్వతీ నది ప్రవహించి కాలగమనంలో లుప్తమైందని, అందుకు ఆనవాళ్ళున్నాయని చెబుతున్నాయి.

తర్వాతే, గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ వంటి నదులు వెలుగులోకొచ్చాయట. ఈ స్థితిలో సరస్వతీ నది ప్రాధాన్యత ఏమిటి, సరస్వతీ శబ్ద ప్రాముఖ్యత ఏమిటి కొంత చర్చ అవసరమే. ప్రస్తుతం ఏ త్రివేణీ సంగమంలోనూ సరస్వతీ నది కన్పి ంచదు. అది ఎల్లప్పుడు అంతర్వాహినియే. గుప్తకామినియే.
సరస్వతీ సూక్తం ప్రకారం : 'ప్రణోదేవీ సరస్వతీ - వాజేభిర్వాజినీ వతీ - ధీనామవిత్య్రవతు' అనగా వేగవంతములైన ప్రవాహములు గలదియగు సరస్వతి మా బుద్ధులను పరిపాలించునదియై, తన ప్రవాహ వేగములతో మమ్ము కాపాడును గాక. వైకుంఠంలో విష్ణుమూర్తి కొలువులో ఉన్న సరస్వతీ దేవి గంగమ్మతో వాదన చేసి ఓడింది. ఆమె శాపముతో మూడు కళలుగా చీలిపోయింది. ఒక రూపము నదులలో సవతిగా నదీ స్వరూపమైంది. సర్వ నదుల్లో ప్రవహించటంతో 'సర్వస్వాన్ వసతీ ఇతి - సరస్వతీ' అని పేరు పొందింది. ఇంకో కళ వాక్కుగా నరుల సర్వాంగాల్లో అధిష్టితమై 'వాణి'గా మారింది. మరోకళ బ్రహ్మదేవుని నాలుగు తలలో 'నాలు క'గా మారి వేదాలరూపంలో ఉంది. 'సారస్వత భారతి' అయింది. ఐదువేలేండ్లు తీర్థ స్వరూపిణిగా శాపం అనుభవించి తిరిగి విష్ణువు కొలువులో చేరుతుంది.
దేవీ పురాణంలో : 'సరాస్సరణ శీలత్యాత గేయాభ్యు: సప్త కీర్తితా / అది ప్రాపణ దానేవాతీన దేవీ సరస్వతీ' అని చెబుతుంది. బ్రహ్మవైవర్ణ, మత్స్య పురాణాలు సరస్వతీ నది ప్రాధాన్యత వర్ణిస్తాయి.
యాజ్ఞ వల్క్య స్మృతిలో : 'సర్వాత్మ్యా నాచ యాదేవీ సర్వభూతేషు సంస్థితా / గాయత్రీ మోక్ష హేతుర్వై మోక్ష స్థానమలక్షణం' అని సూచిస్తుంది. ఉదయం గాయత్రి, మధ్యాహ్నం సావిత్రీ, సాయంత్రం సరస్వతీ అని సంధ్యావందనంలో చెబుతారు.
ఈ విధంగా సరస్వతీ నది ప్రపంచమంతటా అంతర్వాహిని మాత్రమే అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ దశలో తెలుగు నేలలో వ్యాసునిచే ప్రతిష్టితమైన సరస్వతీ దేవాలయం, త్రివేణి సంగమంలో సరస్వతీ నది రెండు కలిసిన, వెలిసిన పుణ్యక్షేత్రం 'కాళేశ్వరం'లో మాత్రమే ఉంది. భారతదేశంలో మాతంగుని కొడుకు శాండిల్యుడు శారదా వనంలో హంస వాహినిగా దర్శనం పొందిన సరస్వతీ దేవి ఉత్తర కాశ్మీరులో ప్రౌథి సరస్వతిగా గుర్తింపు పొందింది. వేదవ్యాసునిచే బాసరలో జ్ఞాన సరస్వతీ, దక్షిణ భారతంలో తొలి సరస్వతీ ఆలయం కాళేశ్వరంలో క్రీ.పూ. 550 సంవత్సర కాలంలో ప్రతిష్టించ బడింది. ఈ నెల 30 నుంచి జూన్ 11 తేదీ వరకు జరిగే సరస్వతీ పుష్కరాలు ఘనంగా నిర్వహించేందుకు కాళేశ్వర క్షేత్రనిధి మాన్యులు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు 36 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి సన్నాహాలు చేయిస్తున్నారు. మూగవారికి మాటలు మొదలు విదేశీ యానం విద్యల వరకు అందించే ఈ సరస్వతీ నదిలో స్నానం, దర్శనం ఎంతో శ్రేష్టదాయకం. అందుకే క్రీ.శ.1535 నుంచి శృం గేరీ శంకరాచార్యులు ఇక్కడ 15 సార్లు సరస్వతీ నదిలో స్నానం చేసి సరస్వతీ మాతకు పూజలు జరిపించారు
 
 
 
 
 
 
 
 
 
 
 
 

0 comments:

Post a Comment

  • VIDEOS
  • PHOTOS
  • NEWS UPDATE