How To Create a Website

Mana Manthani web site కు విచ్చేస్తున్న Manthanites కి స్వాగతం సుస్వాగతం మరియు మరియు శుభాకాంక్షలు .. , No. 9246575261

మన బంగారి తెలంగాణ


















‘సమైక్య రాష్ట్రంలో జీవన విధ్వంసం జరిగింది. నష్టపోయాం... కష్టపడ్డాం. ఇరిగేషన్ సదుపాయాలు కల్పించలేదు. కరెంటు సౌకర్యం లేదు. వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
kcrgaruచేనేత కార్మికుల ఆకలిచావులు, ఆర్తనాదాలు విన్నం, చూసినం. అన్ని వర్గాల ప్రజలు చిరునవ్వుతో ఉండేలా తెలంగాణ ఉండాలి. భవనాలు కూల్చి కట్టడం పునఃనిర్మాణం కానేకాదు. గౌరవంగా, గర్వంగా, కాలర్ ఎగరేసుకునే విధంగా, అన్నార్థులు, దీనార్థులులేని, అసమానతలు లేని తెలగాణ కావాలి. పుష్కలమైన వనరులు ఉన్నాయి. అంతే స్థాయిలో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం’ అని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన మీట్ ది ప్రెస్‌లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. 

తెలంగాణ ఉద్యమ ప్రస్థానం... భవిష్యత్తు తెలంగాణను కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ మీట్‌ది ప్రెస్ నమస్తే తెలంగాణ ఎడిటర్, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ప్రపంచ సీఈఓల సంస్థ హైదరాబాద్ పెట్టుబడులకు ప్రపంచంలోనే అత్యంత అనువైన రెండో ప్రాంతంగా తమ నివేదికలో పొందుపరుచుకున్నదని చెప్పారు. హైదరాబాద్ వాతావరణం సమశీతోష్ణస్థితిలో ఉంటుందని, మూడు వందల సంవత్సరాల క్రితం నుంచే ఇది కాస్మో మెట్రోపాలిటన్ సిటీగా అభివృద్ధి చెందుతూ వచ్చిందని తెలిపారు. నిజాం రాజు కాలంలోనే 100కుపైగా భారీ పరిశ్రమలు తెలంగాణలో ఉండేవంటే ఎటువంటి పారిశ్రామిక సంస్కృతి ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు తోటల నుండి చెరుకును తెచ్చేందుకు రైల్‌పట్టాలు వేశారని, అలాంటి ఫ్యాక్టరీకి ఆంధ్రలో బ్రాంచులు పెట్టి విధ్వంసం చేశారని అన్నారు. వీటి పునఃనిర్మాణం, ప్రభుత్వం భాగ స్వామ్యంతో ఎలా ప్రారంభించాలనేదానిపై నిపుణులతో చర్చిస్తామన్నారు. 

sabakcr
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై ..‘ఇప్పటికే దిగ్విజయ్ సింగ్ చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు ప్రాసెస్ మొదలు పెట్టాం అని. రెండో మాట లేదు. నిర్దిష్ట కాలపరిమితిలో విభజన జరుగుతుందని చెప్పారు. మిగిలింది మాట్లాడుకోవడమే. మంచిచెడ్డా... పెన్‌వర్క్ మిగిలింది. 

నేను అనేక బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నపుడు కొన్ని పథకాల గురించి చెప్పినప్పుడు వారి కళ్ల ఆకాంక్షను చూసిన. తెలంగాణ రాష్ట్రం అంటే నాయకుల స్వార్థంకోసం కాదు. వారు కడుక్క తాగేందుకూ కాదు. తెలంగాణలో 85శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలున్నారు. వారందరి ముఖాల్లో చిరునవ్వులు చూడాలి. గౌరవంతో బతకాలి. కేవలం రాష్ట్ర సాధనతో ఆగొద్దు. పునఃనిర్మాణంలో కూడా ఇదే స్ఫూర్తితో సాగుదాం’ అన్నారు కొంత మంది ఆంధ్రప్రాంత మిత్రులకు తెలంగాణ అంటే ఇరిటేషన్, కేసీఆర్‌పై వారికున్న రాగద్వేషాలు వల్లే పునఃనిర్మాణం అంటే అన్ని కూలకొట్టి మళ్లీకడతారా అని ప్రశ్నిస్తుంటే వారి మీద జాలి వేస్తున్నదని అన్నారు. 

ప్రశ్న: తెలంగాణ వ్యవసాయ రంగం పూర్తిగా విద్యుత్‌పైనే ఆధారపడుతోంది. వినియోగం 7వేల మేగావాట్లు అవసరం ఉంటే కేవలం మూడువేల యూనిట్లు మాత్రమే తెలంగాణలో ఉత్పత్తి అవుతుంది..? ఈ కొరతను ఎలా నివారిస్తారు..? 
కేసీఆర్: విద్యుత్ రంగంపై రాసుకుంటే రామయణమంత కథ ఉంది. చాలా నష్టం జరిగింది. మణుగూరులో పెట్టాల్సిన థర్మల్ పవర్‌స్టేషన్‌ను విజయవాడలో పెట్టారు. తెలంగాణలోని పవర్ జనరేషన్ స్టేషన్ల నుండి 2280మెగావాట్ల వస్తోంది. కేటీపీఎస్ నుండి 1120మెగావాట్లు వస్తోంది. భూపలపల్లి స్టేషన్ నుండి 500మెగావాట్లు, రామగుండం థర్మల్ పవర్‌స్టేషన్ నుండి 60 మెగావాట్లు ఉత్పత్తి జరుగుతోంది. ఎన్టీపీసీ నుండి 1200మెగావాట్లు వస్తోంది. హైడల్ పవర్ ద్వారా 450నుండి 500మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. వినియోగం మాత్రం 7500నుండి 8వేల మెగావాట్ల వరకు ఉంది. అంటే లోటు 50శాతం వరకుంది. తెలంగాణ ఏర్పడిన ఐదేళ్లలో 10వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు ఉన్నాయి. మొత్తంగా 10వేల మెగావాట్ల ఉత్పత్తి చేస్తాం. వెయ్యి మెగావాట్ల జనరేటింగ్ స్టేషన్లు పెట్టాలని నిర్ణ యించాం. చత్తీస్‌ఘడ్ లోమిగులు కరెంటు ఉంది. ఈ మధ్యనే చత్తీస్‌ఘడ్‌కు మాజీ ఎంపీ వినోద్, రిటైర్డ్ ఐఏఎస్ గోయల్‌గారిని పంపాం. రాష్ట్రం ఏర్పడిన తరువాత అవసరమైన కరెంటు అందించాలంటే అంగీకరించారు. కల కంటున్నా...సాకారం అవుతుంది. ఒక్కొక్క వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జనరేటింగ్ స్టేషన్లలో 1500మందికి ఉద్యోగాలొస్తాయి. 

తెలంగాణలో ఖాయిలా పరిశ్రమలు ఎలా తెరిపిస్తారు..? 
కేసీఆర్: బోధన్ షుగర్ పరిక్షిశమను చాలా భయంకర విధ్వంసం చేశారు. ఇద్దరు సీ మాంధ్ర ముఖ్యమంవూతులే దీనికి కారణం. ఒకాయన అమ్మేశాడు. ఇంకొక్కాయన అసెంబ్లీ సభాసంఘం ఇచ్చిన రిపోర్టును కూడా తొక్కేశాడు. ఇప్పుడు చెరకు పంట వేయడం ఆపేశారు. మహారాష్ట్రలో చెరుకును ఎక రానికి 120నుండి 130టన్నులు పండిస్తున్నా రు. అక్కడ పరిశీలించేందుకు వెళ్లిన రైతులను మీరెన్ని టన్నులు పండిస్తారని అక్కడి రైతులు అడిగితే మనవారు 25-35టన్నులు పండిస్తామని అన్నారు. పంట పండించడం ఎందుకు కూలిపనిచేసుకోవచ్చు కదా అన్నారట. అక్కడి రైతు లు సహకార సంఘాలు పెట్టుకుని విత్తనాలను వృద్ధి చేసుకు న్నారు. ఆ పద్ధతులను పాటిద్దాం. ఖాయిలా పడ్డ పరిక్షిశమలనుతెరిపిద్దాం. గ్రానైట్ మీద వచ్చే ఆదాయాన్ని నాన్‌టాక్స్ రెవెన్యూ అంటాం. మొత్తం ఆంధ్రవూపదేశ్ రాష్ట్రలో రూ.2800కోట్లు వస్తే, కేవలం తెలంగాణ నుండే రూ.2000కోట్లు వస్తోంది. చికాగో నుండి మాంచెస్టర్ వరకు ఏర్పడ్డ పారిక్షిశామిక బెల్ట్‌లాగా, కాగజ్‌నగర్‌నుండి మణుగూరు వరకు పారిక్షిశామిక వాడను ఏర్పాటు చేసుకుందాం. 

విలీనం ప్రతిపాదన వస్తున్నందున పునఃనిర్మాణం ఎలా సాధ్యమవుతుంది...? 
కేసీఆర్: బిల్లు పాస్ అయ్యేంత వరకు విలీనంపై మాట్లాడను. ఇప్పటికే పార్లమెం ట్‌లో అనేక బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మహిళాబిల్లు, ఎస్సీ, ఎస్టీ ప్రమోషన్ల రిజర్వేషన్ బిల్లు పెండింగ్‌లో ఉన్నాయి. మన బిల్లుకు కూడా అటువంటి ప్రమాదం ఎదురుకా వచ్చు. బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితేనే స్పందిస్తా.

ఆంధ్రప్రాంత ఉద్యోగుల్లో భయాలను, అనుమానాలను ఎలా తీర్చుతారు..?
కేసీఆర్: నా మాటలు వక్రీకరించారు. నేను చెప్పిన దాన్ని వారికి ఎంత వరకు అవసరమో అంతే చెప్పారు కొంతమంది పుణ్యాత్ములు. వారిఉద్దేశ్యాలు ఏంటో నాకు అర్థం కావు. ప్రకటన వచ్చిన తరువాత టీఎన్జీవో ఉద్యోగులు నన్ను అభినందించడానికి వచ్చారు. ఈ సందర్భంలోనే ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు ఆంధ్రప్రభు త్వం లో పనిచేస్తారు. తెలంగాణ ఉద్యోగులు ఎవరైనా అక్కడ ఉంటే ఇక్కడికొచ్చి మన ప్రభుత్వంలో పనిచేస్తారు అన్నా. ఎవరో వారిని ఇక్కడి నుండి పంపే స్తారు అన్నట్లుగా చూపించారు. అసలామాటే నానోటి నుండి రాలేదు. మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు అవలంభించాల్సిన పద్ధతులే చెప్పిన. డీఓపీసీ ప్రకారం ఉద్యోగుల పంపకాలు, విధివిధానా లుంటాయి. నేను కక్షతో చెప్పింది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం, మంత్రులు, అధికారులు పనిచేసుకోవడానికి 24గంటల సమయం కూడా సరిపోదు.

చిల్లర కొట్లాట ఎవరు కొట్లాడుతరు. హైదరాబాద్‌లో మార్వాడీలు, గుజరాతీలు, బెంగాలీలు, ఒరిస్సా మిత్రులు అనేకం ఉన్నారు. విదేశాల నుండి అనేక మంది వచ్చి చదువుకుంటున్నారు. అందరికీ పొట్టపోసే నగరం హైదరాబాద్. మాకూ పెట్టుబడి దారుల అవసరం ఉంటుంది. వారికి రెడ్‌క్పాట్ పరుస్తాం. తెలుగు చలనచిత్ర పరిక్షిశమ ఇక్కడ సెటిల్ అయింది. వారిని ఇక్కడినుండి పొమ్మనం. కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని చేస్తున్నవే ఇవి. ఏ పాలకులు ప్రజలను శత్రువులుగా చూడరు. ప్రజలు ఎవరైనా ఒక్కటే. వానిది గుంజుకతినాలనే సంస్కారం తెలంగాణది కాదు. ఈ మధ్య నన్ను వేల తిట్లు తిడుతున్నారు.

బాధలేదు. తిట్టుడు, తిట్లపడటం అలవాటైంది. రాటుదేలినా. దేశంలో ఏ నాయకుడూ ఇన్ని తిట్లు పడలేదు. మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడటం వేరు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వేరు. ఇది ప్రత్యేకమైనది. ఎక్కడా లేని ముల్కీ రూల్స్ ఇక్కడ ఉన్నాయి. వాటిని పెద్దమనుషుల ఒప్పందంలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టుకు కూడా ఉండాలని చెప్పింది. జై ఆంధ్ర ఉద్యమం చేసి ఆ తరువాత పార్లమెంట్‌లో ముల్కీ లేకుండా చట్టం చేశారు. అక్రమంగా వచ్చిన వారు 83వేల మంది ఉద్యోగులు అని ఆంధ్ర ముఖ్యమంవూతులే అంగీకరించారు. వారిని పంపేందుకు జీవోలిచ్చిందీ ఆంధ్ర సీఎంలే. గిర్‌గ్లానీ కమిషన్ వేశారు. నాకున్న సమాచారం మేరకు మొత్తం రాష్ట్రంలో లక్షా 50వేల మంది అక్రమంగా ఉద్యోగాల్లో ఉన్నారు. అసలు టీఆర్‌ఎస్ ట్యాగ్‌లైనే ‘నీళ్లు, నిధులు, నియామకాలు’. ఆప్షన్లు అంటున్నారు. అప్షన్లు ఇస్తే ఇక్కడే ఉంటారు. మరి తెలంగాణ ఎందుకు. ఆంధ్రవూపదేశ్ సరి పోదా. చెయ్యికి సురుకు తగిలితేనే అబ్బా అంటం. పిల్లలు పెట్రోల్ పోసుకుని కాల బెట్టుకున్నారు. 

తెలంగాణ వట్టిగ వచ్చిందా. ఎన్నో దెబ్బలు తిన్నాం.జైళ్లకు పోయినం. ఒక్కొక విద్యార్థిని విడిపించేందుకు రూ.8లక్షల చొప్పున కట్టినం. ఒక కేసుల బెయిల్ వస్తే ఇంకో కేసుల అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వాచ్ డాగ్‌లా ఉంటాం. పంపకాల్లో పాత్ర పోషిస్తాం. ఢిల్లీ నుండి ఒకాయన వచ్చిండు. పంపకాలపై మాట్లాడుదామని, గడ్డపారపూక్క నేనొక్కడినే లేను. మేధావులున్నారు. ఇప్పుడేం మాట్లాడనని చెప్పిన. నన్ను అన్న మాటలకు ఇంకొక్కరైతే ఆత్మహత్య చేసుకునేటోళ్లు. బీజీ లేనప్పుడు వ్యవసాయం చేసుకుందాం అని పోతే ఫాం హౌస్‌కు పోయిండు అంటరు. మా నాయిన నాటినుండి వ్యవసాయం అంటే ఇష్టం. అక్కడ ట్రాక్టర్లు, డీజిల్ వాసన తప్ప మరేం లేదు. ఉద్య మం మొదలు పెట్టినప్పుడే ఆంధ్రా గోబ్యాక్ థర్డ్‌క్లాస్ నినాదం అన్నా. హైదరాబాద్‌లో ఉండాలనుకునే వారు కేసీఆర్ ఫొటోను చెప్పులతో కొడతారా? సీమాం ధ్ర మీడియాకు విజ్ఞప్తి. మనం వెయ్యి సంవత్సరాలు బతకం. భవిష్యత్తు తరాల్లో విషబీజాలు నాటొద్దు. తెలంగాణ అంశం ఏనుగు ఎల్లింది... తోక చిక్కిం ది. మేం 10 ఏళ్ల ఉమ్మడి రాజధానిని స్వాగతి స్తు న్నాం. మీ ఆందోళనలు సరైనవి కావు. 
తెలంగాణ జర్నలిస్టులను ఎలా చూస్తారు. 

ఉర్దూ కనుమరుగు అయ్యే స్థితికి వచ్చింది. దాన్నిఎలా రక్షిస్తారు..? 
కేసీఆర్: జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తీరు ఆమోఘం. ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసుల లాఠీదెబ్బలు తిన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత జిల్లా స్థాయిలోని జర్నలిస్టుల నుండి అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం. నాకు దేవుడు ఎంత శక్తి ఇస్తే అంత చేస్తా. నేను రవాణాశాఖ మంత్రిగా ఉన్నసమయంలోనే జర్నలిస్టులకు బస్‌పాస్ సౌకర్యం కల్పించిన. జర్నలిస్టులకు హెల్త్ స్కీంలు పెడతాం. ఉర్దూ పుట్టింది హైదరాబాద్‌లో. 13జిల్లాల్లో రెండో అధికార భాషగా ఉంది. మైనార్టీలకు కూడా 12శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. హుస్సేన్‌షావలి దర్గా భూములపై ఇప్పటికే కొట్లాడుతున్నా. వక్ఫ్ భూములను వీలైనంతగా వెనక్కి తీసుకుంటాం. తెలంగాణలోని ఐదు జిల్లాల్లో లక్షల కోట్ల విలువైన భూములున్నాయి. జ్యూడిషియల్ పవర్స్‌తో ఒక అటానమస్ బాడీని ఏర్పాటు చేస్తాం. ఆ భూములను రక్షిస్తాం. 

తెలంగాణ క్రెడిట్ ఎవరికి ఇస్తారు..?
కేసీఆర్: తెలంగాణ ఇవ్వాలనేది అనివార్యం. కేంద్రానికి అర్థమయ్యే నిర్ణయం తీసుకుంది. ఇక తెలంగాణ క్రెడిట్ అది ఎవరికి ఇవ్వాలో ప్రజలకే తెలుసు. 

హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటున్నారు. తెలంగాణ పునఃనిర్మాణంలో హైదరాబాద్ జిల్లాను ఎలా అభివృద్ధి చేస్తారు...?
కేసీఆర్ : హైదరాబాద్ చుట్టూ 100కిలోమీటర్ల దూరంలో శాటిలైట్ టౌన్‌షిప్స్ ఏర్పాటు చేస్తాం. నాలుగు వైపు నాలుగు రంగాలు అభివృద్ధి చెందుతాయి. నాలుగు, ఆరు లైన్ల రహదారులు ఏర్పాటు చేస్తాం. నల్గొండ నుండి హైదరాబాద్ రావడానికి 20నిమిషాలు పట్టేలా రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలి. హైదరాబాద్ ఒక హబ్‌గా ఉండాలి. మరో ఎయిర్‌పోర్టు రావాల్సి ఉంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఉండాలి.మహారాష్ట్రకు బొంబాయిలా, తెలంగాణకు హైదరాబాద్ బ్యాక్‌బోనులా ఉంటుంది. 

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగానీ, ఉమ్మడి రాజధానిగానీ చేయాలనే డిమాండ్‌ను సీమాంధ్రులు చేస్తున్నారు...? దీనిపై మీ వైఖరి ఏమిటీ..?
కేసీఆర్: తల తెగిపడ్డా వీటికి అంగీకరించం. కేసీఆర్ తల నరుక్కుంటాడుకానీ, తల వంచడు. ఎలాంటి అప్షన్లు ఇచ్చినా అంగీకరించేది లేదు. 10 జిల్లాల తెలంగాణకు హైదరాబాద్ రాజధానిగా ఉంటుంది. 10ఏళ్లు ఉమ్మడి రాజధానికి అంగీకరించినందున ఆంధ్ర ప్రజలు ఎంత మంది ఇక్కడ ఉన్నా ఓకే. వారికి అన్ని సౌకర్యాలు ఉంటాయి. హైదరాబాద్ ఆదాయం తెలంగాణకే ఉండాలి. 

జిల్లాల విభజన, వైద్యం, సంస్కృతి పరిరక్షణ ఎలాచేస్తారు...? 
కేసీఆర్: 10 జిల్లాలను24జిల్లాలకు పెంచుతాం. మంచిర్యాల, సిద్దిపేట ఎప్పటి నుం డో ఉన్న డిమాండ్లు. మహబూబ్‌నగర్లో మూడు జిల్లాలు అవుతాయి. భూపాలపల్లి జిల్లాకు జయ శంకర్ జిల్లాగా పేరు ఎప్పుడో పెట్టేవారు. వైద్యా న్ని మూడు విభాగాలుగామండలస్థాయిలో ఆస్పవూతులు,నియోజకవర్గస్థాయిలో, 24జిల్లాల్లో కార్పొరేట్ స్థాయి జిల్లా ఆస్పవూతులు ఏర్పాటు చేస్తాం. అన్ని జిల్లాల్లో నిమ్స్‌లు ఉంటాయి. ఇక భాష, కళలు, పండితులపై దాడి జరిగింది. కాపురాజయ్యకు పద్మశ్రీ ఇవ్వాలని 50మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసి పంపితే రాలేదు. కానీ కాపురాజయ్య కాళ్లకాడికి లేనోళ్లకు పద్మశ్రీలు వచ్చాయి. ప్రజల బాషనే అధికారిక భాషగా మార్చాలనే డిమాండ్ ఉంది. కల్చరల్ యూనివర్సిటీని గానీ, అకాడెమీనిగానీ ఏర్పాటు చేస్తాం. 

కృష్ణా, గోదావరి నదీ జలాలు, అక్రమ ప్రాజెక్టులపై వైఖరి ఎలా ఉంటుంది...?
కేసీఆర్ : కృష్ణా, గోదావరి బేసిన్‌లలో తెలంగాణకు 1300టీఎంసీలు కేటాయింపబ డ్డాయి. మహబూబ్‌నగర్‌లో నెట్టెంపాడు, ఆర్‌డీఎస్, జూరాల, కల్వకుర్తి, బీమా ప్రాజెక్టులకు 100టీఎంసీల నీటికేటాయింపులున్నాయి. కానీ 10 టీఎంసీలు వినియోగించ డం లేదు. ప్రపంచానికి వాటర్‌షెడ్‌లను చూపిందే తెలంగాణ. 1956 నాటికి తెలంగాణలో సాగునీటి పరివాహకం 20లక్షల ఎకరాలు. నీటి కేటాయింపులు కాగితాలపైనే చూపించారు. 20వేల కోట్లు ఖర్చుచేశాం అంటున్నారు. శ్రీకృష్ణ కమిటీకి కాకిపూక్కలిచ్చారు. ప్రస్తుతం కృష్ణా నదిపై ఉన్న ట్రిబ్యునల్ అవార్డు(తీర్పు) ఇవ్వబోతున్న తరుణంలో దాన్ని ఆపాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబోతున్నందు అది అయినంకా ఇవ్వాలని ఢిల్లీలో వినోద్‌తో పిటీషన్ వేయించబోతున్నాం. పాలమూరు ఎత్తిపోతల స్కీం అద్భుతమైనది. జూరాల నుండి షాద్‌నగర్‌లోని లక్ష్మిదేవపల్లి వరకు ఎత్తిపోతల స్కీం చేపడితే ఐదు జిల్లాలు సస్యశ్యామలం అవుతాయిపతి నీటిబొట్టను వాడుతాం. తెలంగాణ పచ్చబడాల్సిందే. దాష్టీకం అరికట్టాల్సిందే. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే సర్వరోగ నివారణి అన్నారు..? ఈ ప్రాజెక్టులు పూర్తికి నిధులు ఎక్కడి నుండి తెస్తారు..? ఇవి పూర్తికావడానికి ఎన్నేళ్లు పట్టొచ్చు....?

కేసీఆర్ : కేంద్రంలోని నీటిపారుదల శాఖ వద్ద కావాల్సినన్ని నిధులుంటాయి. అదే రీతిలో తెలంగాణ ప్రాజెక్టులకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్లాన్ బడ్జెట్ రూ.45-52వేల కోట్లు ఉంటుంది. ఫైనాన్స్ సెక్రెటరీగా పనిచేసిన బీపీఆర్ విఠల్ అనే ఐఏఎస్ ఇటీవల ఒక బుక్ రాశారు. తెలంగాణ ఇప్పటికే మిగులు బడ్జెట్‌లోనే ఉందని. 

ఆంధ్రా ఉద్యోగులు గో బ్యాక్ అన్నారు...? వారినెలా ఇక్కడ చూస్తారు...?
నేను ఎప్పుడూ ఆంధ్రా గో బ్యాక్ అనలేదు. ఆంధ్ర వారిని గౌరవిస్తాం. ఆంధ్రా మీడియానే వక్రీకరిస్తోంది. 
మావోయిస్టుల పట్ల మీ ధృక్పథం ఎలా ఉంటుంది. 

వెయ్యి మంది అమరవీరుల కుటుంబాలను ఎలా ఆదుకుంటారు. ?
కేసీఆర్ : ప్రతి అమరవీరుడి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగంతో పాటు 10లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకుంటాం. వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య సదుపాయాలు కల్పిస్తాం. మావోయిస్టులపై టీఆర్‌ఎస్ బహిరంగ సభల్లోనే చెప్పింది. వారితో చర్చలు జరుపుతాం. పత్రికా సంపాదకులు, సీఎం, మంత్రులు, మేధావులు చర్చలు జరుపుతారు. పల్లె జీవనం విధ్వంసం కాకుండా ఆర్బన్ డెవలప్‌మెంట్ చేస్తాం. 

భద్రాచలం భవితవ్యం ఏమిటీ..? 
కేసీఆర్ :రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎటు ఉండాలనేది అప్పుడు నిర్ణయిద్దాం. భద్రాచలం వాస్తవానికి తెలంగాణదే. తెలంగాణ ప్రజల డబ్బుతోనే రాముడిగుడి కట్టారు. భద్రాచలం పాల్వంచ రాజు కింద ఉండేది. అక్కడ ఒకాయన గెరిల్లాదళాన్ని ఏర్పాటు చేసుకుని పాల్వంచ రాజును చంపేందుకు ప్రయత్నం చేస్తాడు. బ్రిటీష్‌వారు ఆ గెరిల్లా నాయకుడిని చంపేశారు. అప్పుడు నిజాం నజరానాగా బ్రిటీష్‌వారికి ఇచ్చారు. దీనిపై ప్రజలు గొడవ చేస్తే టెంపుల్ వరకు నిజాం రాజు వెనక్కి తీసుకున్నాడు. భద్రాచలం ప్రజల ఉద్యమం మీదే దాని భవిష్యత్తు ఆధారపడి ఉంది. 

తెలంగాణలో భూ పంపిణీ ఏ విధంగా జరుగుతుంది...? 
కేసీఆర్ : ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమిని పంచుతాం. ఒక సంవత్సరం పెట్టుబడి కూడా ఇస్తాం. లంబాడ తండాలను పంచాయతీలుగా చేస్తాం. 12శాతం రిజర్వేషన్లు గిరిజనులు ఇస్తాం. 
ప్రతి ఒక్కొక్కరిపై రూ.20వేల అప్పు ఉంది. తెలంగాణపై అప్పులు, ఖర్చు చూపే పరిస్థితి ఉంది?
కేసీఆర్: తెలంగాణలో ఖర్చు పెట్టుంటే ఈ ఉద్యమమే రాదుకదా. అంశాల వారీగా అప్పును ఇస్తారు. ప్రాజెక్టుల వారీగా అప్పు తెస్తారు. అప్పులు ఎప్పుడు గంపగుత్తగా తీసుకురారు. వాటి గురించి ప్రజలు భయపడొద్దు. 

ఏ హోదాలో కేసీఆర్ ఈ హామీలు ఇస్తున్నారు? 
కొంత మంది సన్నానులు కేసీఆర్ ఏ హోదాలో చెబుతున్నాడు అంటున్నారు. నేను తెలంగాణలో పక్షిలెక్క తిరిగిన. దళితులు, గిరిజనుల ఇళ్లలో పడుకుని వారి జీవన విధానం చూసిన వారి జీవితంలో అనుభవించిన. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తే దళితుడే ముఖ్యమంత్రి అవుతాడు. నేను రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు స్టేట్ అడ్వయిజరీ కౌన్సిల్ దానికి చైర్మన్‌గా ఉంటా. ఈ హామీలను అమలు చేయిస్తా. పార్టీని విలీనం చేస్తేనే రాష్ట్రం ఇస్తాం అంటే విలీనానికి ముందు నా పథకాలు మొత్తం వారికిచ్చి అమలు చేయించాలని సూచిస్తా. వ్యతిరేకంగా పోతే ఇంకో జెండా ఎగరేస్తా. 

చరిత్రగతిని, తెలంగాణ దరిని చూపిననాయకుడు కేసీఆర్ : అల్లం నారాయణ
తెలంగాణ రాష్ట్ర సాధన తరుణంలో విభజన అనివార్యమైందని, ‘రాజ్యం అణచివేత సమయంలో ప్రతికూల పరిస్థితుల్లో ప్రజాస్వామ్య పద్ధతుల్లో రాజకీయ పార్టీ పెట్టి తెలంగాణ అవసరాన్ని కేసీఆర్ చెప్పారు. మాట్లాడలేని పరిస్థితుల్లో రాజకీయ పార్టీ పెట్టడం ద్వారా ఉద్యమ శక్తులు రాజకీయ వాతావరణం కల్పించారు. ‘కేసీఆర్‌కు తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అభినందనలు తెలుపుతోంది. విభజన అనివార్యం అని టీజెఎఫ్ నమ్ముతోంది. ఈ సందర్భంలో వచ్చిన తెలంగాణలో పునఃనిర్మాణం ఎలా జరగాలి..? ప్రజలేం కోరుకుంటున్నారు..? ఏం ఆశిస్తున్నారు..? తెలంగాణలోని సమస్యలను ఎలా అధిగమిస్తారు..? అనే అంశాలకు కేసీఆర్ నుండి తెలంగాణ సమాజం సమాధానాలు ఆశిస్తోందని అన్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్ కే.కేశవరావు. టీఆర్‌ఎస్‌ఎల్‌పీ నేత ఈటెల రాజేందర్, టీఆర్‌ఎస్ పోలిట్‌బ్యూరో సభ్యులు నాయిని నర్సింహ్మారెడ్డి, రమణాచారి, మాజీ ఎంపీ వినోద్, నిరంజన్‌రెడ్డి, కేసీఆర్ రాజకీయ కార్యదర్శి సుభాష్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు సుమన్, టీజెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి క్రాంతి, ఉపాధ్యక్షులు రమణ, పల్లె రవి, పీవీ శ్రీనివాసరావు, శైలేష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

0 comments:

Post a Comment

  • VIDEOS
  • PHOTOS
  • NEWS UPDATE