How To Create a Website

Mana Manthani web site కు విచ్చేస్తున్న Manthanites కి స్వాగతం సుస్వాగతం మరియు మరియు శుభాకాంక్షలు .. , No. 9246575261

METRO INDIA ( ENGLISH NEWS PAPER)




 
 

 

 



 

మెట్రో ఇండియా’ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి

తెలుగు గౌరవాన్ని చాటిచెపుతాం: మెట్రో ఇండియా చైర్మన్ సీఎల్ రాజం
పత్రిక విజయవంతం కావాలని ఆకాంక్షించిన వక్తలు 
-కొలాహలంగా ‘మెట్రో ఇండియా’ ప్రారంభోత్సవం
మీడియా తన విశ్వసనీయతను పెంచుకునేందుకు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌డ్డి పిలుపునిచ్చారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పోటీ తీవ్రతరమైన ప్రస్తుత తరుణంలో విశ్వసనీయతను పెంచుకుం మనుగడ ఉంటుందని తెలిపారు. ఆంగ్ల దినపవూతిక ‘మెట్రో ఇండియా’ను శనివారం ఆయన లాంచనంగా ప్రారంభించారు. బంజారాహిల్స్ రోడ్ నం ౨లోని హోటల్ పార్క్ హయత్‌లో కోలాహలంగా జరిగిన ‘మెట్రో ఇండియా’ ప్రారంభోత్సవ కార్యక్షికమంలో కిరణ్‌కుమార్‌డ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మెట్రో ఇండియా యాజమాన్యం గతంలో ఓ పత్రిక(నమస్తే తెలంగాణను ఉద్దేశిస్తూ)ను తప్పనిసరి పరిస్థితుల్లో ప్రారంభించిందని, ఇప్పుడు అభిరుచితో ‘మెట్రో ఇండియా’ను ప్రారంభిస్తున్నదని పేర్కొన్నారు. అభిరుచితో ప్రారంభిస్తున్న పత్రిక కాబట్టి ఇది విజయవంతమవుతుందని నమ్ముతున్నానని అన్నారు. ప్రతిరోజూ ఉదయం వాకింగ్‌కు వెళ్లడం, కాఫీ తాగడం మాదిరిగానే, మెట్రో ఇండియాను చదవడం కూడా ప్రజలకు ఒక అలవాటుగా మారాలని ఆకాంక్షించారు. యాజమాన్యం, సిబ్బంది శ్రమించాలని సూచించారు. నిర్ధిష్ట ప్రమాణాలు పాటించినపుడే పత్రికలు తమ ప్రతిష్ఠను నిలబెట్టుకుంటాయన్నారు. ప్రతి ఒక్కరూ రోజూ చదివే పత్రిక ‘మెట్రో ఇండియా’ కావాలని ఆకాక్షించారు. ప్రపంచం ఓ కుగ్రామంగా మారిపోయిన ప్రస్తుత తరుణంలో పత్రికలు వాస్తవాలను ప్రతిబింబించాలని, పాఠకులకు వాస్తవ సమాచారాన్ని అందజేయాలని ఆయన కోరారు. 


వార్తలు, అభివూపాయాలను మిళితం చేయొద్దు: వెంకయ్య నాయుడు
మన భాష, సంస్కృతిని కాపాడేందుకు, చారివూతక వారసత్వాన్ని కొనసాగించేందుకు పత్రికలు, మీడియా తోడ్పాటునందించాలని బీజేపీ జాతీయ నేత ఎం వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ‘మెట్రో ఇండియా’ దినపవూతిక ఆవిష్కరణ కార్యక్షికమానికి గౌరవ అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మెట్రో ఇండియా వెబ్ సంచికను ఆవిష్కరించారు. పత్రికలు, ప్రసార సాధనాలు సత్యానికి దగ్గరగా, సంచలనాలకు దూరంగా ఉన్పప్పుడే దేశానికి ఉపయోగకరమని పేర్కొన్నారు. విలువలు, సంప్రదాయాలు, వారసత్వాన్ని కొనసాగించేందుకు పత్రికలు ప్రయత్నించాలని సూచించారు. పత్రికలు వార్తలను, అభివూపాయాలను మిళితం చేయ్యొద్దని కోరారు. 



పత్రిక అభివృద్ధికి సహకరిస్తాం: అసదుద్దీన్ ఒవైసీ
మన దేశంలో భిన్న సంస్కృతులు, భిన్న మతాలు, భిన్న అభిరుచులు ఉన్న ప్రజలు ఉన్నారని, వీటన్నింటినీ మనసులో ఉంచుకొని పత్రికలు పని చేయాలని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సూచించారు. హైదరాబాద్ బ్రాండ్ పేరుతో వస్తున్న ‘మెట్రో ఇండియా’ దినపవూతిక విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ పత్రిక అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని అసదుద్దీన్ తెలిపారు. 
హైదరాబాద్ స్ఫూర్తిని ప్రతిబింబించాలి: జయవూపకాశ్ నారాయణ్
చారివూతక హైదరాబాద్ నగర స్ఫూర్తిని ప్రతిబించేంలా మెట్రో ఇండియా దినపవూతిక ఉండాలని లోక్‌సత్తా అధినేత జయవూపకాశ్ నారాయణ్ ఆకాక్షించారు. ఉత్తర దక్షిణాలను, తూర్పు పడమరలను, పాత కొత్తలను అనుసంధానించేలా, అద్భుతమైన హైదరాబాద్ నాగరికతకు అద్దం పట్టేలా ఈ పత్రిక ఉండాలన్నారు. 



తెలుగు గౌరవాన్ని చాటిచెబుతాం: ‘మెట్రో ఇండియా’ చైర్మన్ సీఎల్ రాజం
తెలుగు గౌరవాన్ని, ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పేలా ‘మెట్రో ఇండియా’ను తీర్చిదిద్దుతామని దినపవూతిక చైర్మన్ సీఎల్ రాజం స్పష్టం చేశారు. హైదరాబాద్ బ్రాండ్‌ను చాటి చెప్పేందుకు ఈ పత్రికను స్థాపిస్తూ ధైర్యంగా అడుగేస్తున్నామని, అందరూ సహకరించి, పత్రికను విజయవంతం చేయాలని కోరారు. ‘‘ఓ అభివృద్ధి ప్రాజెక్టును నిర్మించడం కంటే కూడా పత్రికను నిర్వహించడం కష్టతరమైన పని. అయినా, ధైర్యంగా ముందుకు అడుగేస్తున్నాం. సహకరించి, విజయవంతం చేయండి. జర్నలిజంలో కనీస నైతిక నియమాలను కాపాడేందుకు ప్రయత్నిస్తా’’ అని సీఎల్ రాజం స్పష్టం చేశారు. ‘‘ప్రస్తుతం మన రాష్ట్రంలో ఇన్ని పత్రికలు, ఎలక్షిక్టానిక్ మీడియా ఉండగా మరో పత్రిక అవసరమా? అంటూ ఇటీవలే నన్ను ఓ మిత్రుడు ప్రశ్నించాడు.



మరో పత్రిక తెచ్చి ఎక్స్‌ట్రా న్యూసెన్స్ ఎందుకు అని అడిగారు. ఇప్పుడు చెబుతున్నా. ఇప్పటికే ఉన్న ఎన్నో పత్రికల్లో ‘మెట్రో ఇండియా’ మరో పత్రిక కాబోదు. హైదరాబాద్ బ్రాండ్, తెలుగు గౌరవం, ప్రతిష్టను ఈ పత్రిక చాటి చెబుతుంది. హైదరాబాద్ సమక్షిగాభివృద్ధిలో పాలుపంచుకుంటుంది. మరో సింగపూర్, దుబై మాదిరిగా హైదరాబాద్‌ను అభివృద్ధి చెందేందుకు తోడ్పడుతుంది. మరీ ముఖ్యంగా ఆంధ్రవూపదేశ్, ముఖ్యంగా హైదరాబాద్ వార్తలను, ఇక్కడ జరుగుతున్న పరిణామాలను ‘మెట్రో ఇండియా’ ఢిల్లీ దర్బార్ ముంగిట్లో ఉంచుతుంది.’’ అని ఆయన ఉద్ధాటించారు. ఏ రాజకీయ నేతను, వ్యాపారవేత్తను వ్యక్తిగతంగా ఈ పత్రిక విమర్శించబోదని తెలిపారు. త్వరలోనే ఢిల్లీలో కూడా మరో ఎడిషన్‌ను ప్రారంభించనున్నట్లు సీఎల్ రాజం తెలిపారు. అలాగే విశాఖపట్టణం, తిరుపతి, విజయవాడ నగరాల్లో కూడా ఎడిషన్లను ప్రారంభించే ఆలోచన ఉందని ఆయన వివరించారు. 



సాటి లేని పత్రికగా ఆదరించండి: ఎండీ విజయరాజం
మానవత్వమే గుండె చప్పుడుగా ‘మెట్రో ఇండియా’ పత్రికను తమ బృందం తీర్చిదిద్దుతోందని పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ విజయ రాజం స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల్లో, అన్ని పత్రికల్లో సాటిలేని మేటి పత్రికగా ‘మెట్రో ఇండియా’ను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘నమస్తే తెలంగాణ పత్రికను ఆదిరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక మీదట మెట్రో ఇండియాను కూడా ఇదే మాదిరిగా ఆదరిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. విలువలను ప్రతిబించేలా ఈ పత్రిక ఉంటుందని, విలువైన సూచనలు, సలహాలు అందిస్తే పత్రికను మరింతగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌లో మెట్రో రైలు కంటే వేగంగా ఈ పత్రిక దూసుకెళుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. ‘ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని పత్రికలను చదవడం ఎందుకు? ఒక్క మెట్రో ఇండియా చదివితే చాలు. ఇండియా మొత్తం మీ చేతుల్లో ఉన్నట్లే’’ అని ఆమె పేర్కొన్నారు. 



సమాజానికి ప్రతిబింబంగా నిలుస్తాం: సీ సౌమ్య, డైరెక్టర్
సమాజానికి ప్రతిబింబంగా నిలిచేలా ‘మెట్రో ఇండియా’ను తీర్చిదిద్దుతామని దినపవూతిక డైరెక్టర్ సీ సౌమ్య తెలిపారు. సమాజంలో క్షేత్ర స్థాయి దాకా వెళ్లి, జరుగుతున్న మార్పులకు వారధిగా ఈ పత్రిక నిలుస్తుందన్నారు. పాఠకులకు వాస్తవాలను వెల్లడిస్తూ, జ్ఞానాన్ని పంచుతూ, అన్ని రంగాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించేలా ఈ పత్రికను తీర్చిదిద్దుతామని తెలిపారు.
ప్రజలపక్షం వహించాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ
‘మెట్రో ఇండియా’ నిష్పక్షపాతంగా ప్రజల పక్షం వహించి, వారి సమస్యలను ప్రతిబింబించేలా ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆకాంక్షించారు. అనారోగ్యం కారణంగా ఈ కార్యక్షికమానికి హాజరు కాలేకపోయిన ఆయన తన సందేశాన్ని పంపారు. ‘నమస్తే తెలంగాణ’ ఎడిటర్ అల్లం నారాయణ ఈ సందేశాన్ని చదివారు. 



‘మెట్రో ఇండియా’ కన్పించకుంటే వెలితి కన్పించాలి: సీపీఎం కార్యదర్శి బీవీ రాఘవులు
మెట్రో ఇండియా కన్పించకుంటే.. వెలితి కన్పించేలా ఈ పత్రికను రూపొందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. నగర దృష్టితో వస్తున్న ఈ పత్రికను చదవకుంటే.. పాఠకుడు లోటుగా భావించేలా ఉండాలని పేర్కొన్నారు. 



హైదరాబాద్ ఇమేజ్‌ను జాతీయ స్థాయిలో చూపించాలి: హరీశ్‌రావు
హైదరాబాద్ కేంద్రంగా వెలువడుతున్న ‘మెట్రో ఇండియా’ విజయవంతం కావాలని టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు ఆకాంక్షించారు. హైదరాబాద్ ఇమేజ్‌ను జాతీయ స్తాయికి పెంచేలా పత్రిక ముందుకు సాగాలని సూచించారు. సీఎల్ ‘నమస్తే తెలంగాణ’ దినపవూతికతో తెలంగాణపై జరుగుతున్న వివక్షతను, తెలంగాణ సంస్కృతిని ఎత్తిపట్టారని అన్నారు. తెలంగాణకోసం పత్రికను విజయవంతంగా నడిపారని, అలాంటి రాజంగారు ఇప్పుడు మెట్రో ఇండియాను కూడా హైదరాబాద్ కేంద్రంగా తీర్చిదిద్దుతారని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.



ప్రజల వాణిని విన్పించాలి: మంత్రి డీకే అరుణ
‘మెట్రో ఇండియా’ ప్రజల వాణిని విన్పించాలని రాష్ట్ర మంత్రి డీకే అరుణ కోరారు. ఇక్కడి విషయాలన్నీ ఢిల్లీలో తెలిసేలా చూడాలని సూచించారు. అందరి అంచనాలకు భిన్నంగా ‘నమస్తే తెలంగాణ’ను సీఎల్ రాజం అందరి పత్రికగా తీర్చిదిద్దారని ప్రశంసించారు.



‘మెట్రో ఇండియా’ను అందరి పత్రికగా తీర్చిదిద్దాలి: ఎర్రబెల్లి దయాకరరావు
నమస్తే తెలంగాణ మాదిరిగానే.. ‘మెట్రో ఇండియా’ను అందరి పత్రికగా తీర్చిదిద్దాలని టీటీడీపీ ఫోరం చైర్మన్ ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. 



సమగ్ర కథనాలను అందిస్తాం:
శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, మెట్రో ఇండియా
ఎలక్షిక్ట్రానిక్ మీడియా విస్తరించిన ప్రస్తుత తరుణంలో కూడా పత్రికల ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదని మెట్రోఇండియా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాసరావు అన్నారు. అన్ని రంగాలకు సంబంధించి సమగ్ర సమాచారం, వైవిధ్య కథనాలతో పాఠకులను ఆకట్టుకునేలా, ఆలోచింపజేసేలా ఈ పత్రిక ఉంటుంది. కార్యక్షికమంలో మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతాడ్డి, ఉత్తమ్‌కుమార్‌డ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిడ్డి రాజగోపాల్‌డ్డి, ఎంపీ కేవీపీ రామచందర్‌రావు సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అతిథులకు మెట్రో ఇండియా ఛైర్మన్ సీఎల్ రాజం, ఎండీ విజయరాజం, డైరెక్టర్లు శ్రీకాంత్, సౌమ్య, పత్రిక ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ శ్రీనివాసరావు, నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ, సీఈఓ కట్టా శేఖర్‌డ్డి స్వాగతం పలికారు.


0 comments:

Post a Comment

  • VIDEOS
  • PHOTOS
  • NEWS UPDATE