How To Create a Website

Mana Manthani web site కు విచ్చేస్తున్న Manthanites కి స్వాగతం సుస్వాగతం మరియు మరియు శుభాకాంక్షలు .. , No. 9246575261

Sri-Durmukhi-Nama-Samvastara Panchangam 2016 -17
Mana Manthani Panchangamu
👫మేషం👫
అశ్వని 1,2,3,4 పాదములు(చూ,చే,చో,లా) భరణి
1,2,3,4 పాదములు ( లీ, లూ, లే, లో) కృత్తిక 1వ
పాదం(ఆ) ఆదాయం -2, వ్యయం-8, పూజ్యిత -1, అవమానం-7
ఈ రాశి వారికి ఆగస్టు 11వ తేదీ వరకూ పంచమము నందు
బృహస్పతి, ఆ తదుపరి అంతా షష్టమము నందు 2017 జనవరి
25 వరకూ అష్టమము నందు, ఆ తదుపరి అంతా భాగ్యము నందు,
ఈ సంవత్సరం అంతా పంచమము నందు రాహువు, లాభము నందు కేతువు
సంచరిస్తారు. ఈ గోచారం పరిశీలించగా " నిరాశ మనిషిని
నిర్వీర్యుడిని చేస్తుంది". అన్నవాస్తవాన్ని గ్రహించి
మనోధైర్యంతో ముందుకుసాగి జయం పొందండి. మీ సంకల్పబలమే మీ
అభివృద్ధికి నాంది పలుకుతుందని గమనించగలరు. వ్యాపార
వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది.
విద్యార్థులు ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలో మెరుగైన
ఫలితాలను కనబరుస్తారు. దైవ దర్శనాలు, ఆధ్యాత్మిక
చింతనవైపు ధ్యాస మళ్లిన ఏకాగ్రత వహించలేరు. కొబ్బరి,
పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు ఆశాజనకం.
గృహమరమ్మత్తులు, నిర్మాణాలు అనుకూలిస్తాయి. కుటుంబీకులు,
బంధుమిత్రుల ధోరణి మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. నూతన
పెట్టుబడుల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించండి.
రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు బాగుగా అభివృద్ధి పొందుతారు.
వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి అనుకోని అభివృద్ధి
కానవస్తుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ
వ్యవహారాల్లో మెళకువ అవసరం. ఇచ్చిపుచ్చుకునే
వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకు అధికమవుతాయి.
దూరప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఫైనాన్స్, చిట్ ఫండ్
వ్యాపారస్తులు అపవాదులు, అపనిందలు ఎదుర్కొంటారు.
రుణవిముక్తికై చేయు యత్నాలు ఫలించవు. స్త్రీలు విలువైన
వస్తువులు వస్త్రాలు, ఆభరణాలు అమర్చుకుంటారు.
నిరుద్యోగులకు ఎటువంటి సదవకాశం లభించినా సద్వినియోగం
చేసుకోవడం మంచిది. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు
లభిస్తుంది. ఏదైనా స్థిరాస్తి అమ్మకం, కొనుగోలు విషయంలో
జాగ్రత్త వహించండి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, టెక్నికల్
రంగాల్లో వారికి ఆశాజనకంగా ఉంటుంది. వైద్య రంగాల్లో వారి సేవకు
తగిన గుర్తింపు, పురస్కారాలు పొందే అవకాశం ఉన్నది.
అవివాహితుల్లో నూతన ఉత్సాహం కానవస్తుంది. శుభవార్తలు
వింటారు. విదేశీయానం యత్నాలు ఫలిస్తాయి. మీ పాత
సమస్యలు పరిష్కార మార్గంలో నడుస్తాయి. భాగస్వాముల
మధ్య చిన్నచిన్న విభేదాలు తలెత్తవచ్చు జాగ్రత్త
వహించండి. మత్య్స, రొయ్యలు వ్యాపారస్తులకు ఒత్తిడి,
చికాకులు తలెత్తుతాయి. కోళ్ల, పాడి పరిశ్రమ రంగాల్లో వారికి
పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. రచయితలకు పత్రికా రంగాల్లో
వారికి, కళాకారులకు, అంతరిక్ష పరిశోధకులకు సత్కాలమనే
చెప్పవచ్చు. ఆడిటర్లు కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం
ఉన్నది. వాగ్దానాలు చేసి ఇబ్బందులకు గురికాకండి. క్రయ,
విక్రయ రంగాల్లో వారికి ఆశాజనకం. ముఖ్యులతో మీ సంబంధ
బాంధవ్యాలు ఈ సంవత్సరం అంతా అధిక శ్రమ పొందినప్పటికీ
సామాన్యమైన సంతృప్తి ఉండగలదు. ముఖ్యులకు వీడ్కోలు
పలుకుతారు. కీలకమైన విషయాల్లో అనాలోచితంగా వ్యవహరించడం
పట్ల కష్టనష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. రాజకీయాల్లో వారు
వ్యూహాలు పన్ని మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నిస్తారు.
వస్త్ర, బంగారం, వెండి, గృహోపకరణాల వ్యాపారులకు పురోభివృద్ధి.
ఇంజినీరింగ్, కంప్యూటర్ రంగాల వారికి సామాన్యం. గృహంలో మార్పులు
అనుకూలించవు. ప్రేమికుల మధ్య చికాకులు, పలు ఆలోచనలు
చోటుచేసుకుంటాయి. స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు వారి
పురోభివృద్ధికి సహకరించగలవు. మిత్రుల సహకారంతో ఒక జఠిల
సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. నిరుద్యోగులు
చేపట్టిన ఉపాధి పథకాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఇతరులకు
ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం.
అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఒకరికి
సలహా ఇచ్చి మరొకరి ఆగ్రహానికి గురయ్యే ఆస్కారం ఉంది.
ఆకస్మిక ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి.
విలువైన వస్తువులు, పత్రాలు, నగదు విషయంలో మెళకువ
వహించండి. ఉపాధ్యాయులకు, పత్రికా సంస్థలలో వారికి మార్పులు
అనుకూలిస్తాయి. రవాణా, ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకం. షేర్ల
క్రయవిక్రయాలు లాభసాటిగా ఉంటాయి. * ఈ రాశివారు నెలకు ఒక
శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయించి, 9 సార్లు నవగ్రహ
ప్రదక్షిణ చేసి, ఎర్రని పూలతో శనిని పూజించిన దోషాలు
తొలగిపోతాయి. అశ్వని నక్షత్రం వారు జీడిమామిడి, భరణి
నక్షత్రం వారు దేవదారు, కృత్తిక నక్షత్రం వారు అత్తి చెట్టును
నాటిన సర్వదోషాలు పోతాయి. అశ్వని నక్షత్రం వారు
కృష్ణవైఢూర్యం, భరణి నక్షత్రం వారు వజ్రం, కృత్తికా నక్షత్రం
వారు కెంపు ధరించిన శుభదాయకంగా ఉంటుంది
👫వృషభం👫
కృత్తిక 2,3,4 పాదములు (ఈ,ఊ,ఏ) రోహిణి
1,2,3,4 పాదములు (ఓ, వా, వీ, వూ) మృగశిర 1, 3
పా|| (వే,వో) ఆదాయం-11 వ్యయం -14 పూజ్యత-4
అవమానం-7 ఈ రాశివారికి ఆగస్టు 11వ తేదీ వరకు చతుర్థము
నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా పంచమము నందు, జనవరి
25వ తేదీ వరకు సప్తమము నందు శని, ఆ తదుపరి అంతా
అష్టమము నందు, ఈ సంవత్సరం అంతా చతుర్థము నందు రాహువు,
రాజ్యము నందు కేతువు సంచరిస్తారు. ఈ గోచారం పరీక్షించగా
''''''''బుద్ధి తపది తేజస్య'''''''' అన్నట్లుగా జ్ఞానవంతుడు,
యోగ్యుడు, సత్ప్రవర్తన శీలురు ఎల్లప్పుడు పురోభివృద్ధిని,
గుర్తింపును పొందుతారు. ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా
సమసిపోతాయి. ఈ సంవత్సరం మొదటి భాగం చాలా శుభప్రదంగా
ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆకస్మిక బదిలీ అయ్యే ఆస్కారం
ఉంది. నూతన వ్యాపారాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. సంఘంలో
కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. నూతన దంపతులకు
సంతానప్రాప్తి కలదు. నిరుద్యోగులయత్నాలు కొంతవరకు
ఫలిస్తాయి. మీ ఆలోచనలు కాని, హావభావాలు కాని బయటికి
వ్యక్తం చేయకండి. పుణ్యక్షేత్రాల పట్ల, తీర్థయాత్రల
పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాల్లో మెళకువ అవసరం.
ఆరోగ్యంలో అనుకున్నంత సంతృప్తి కానరాదు. వస్త్ర, బంగారం, వెండి
రంగాల్లో వారికి కలిసిరాగలదు. ఎదుటివారి ఆలోచనలను గ్రహించి
ఎత్తుకు పై ఎత్తు వేస్తారు. అనుబంధాల్లో మార్పు మీకెంతో
ఆశ్చర్యం కలిగిస్తుంది. కొంతమంది మిమ్మల్ని ధన సహాయం
అర్థిస్తారు. సైన్సు రంగాల్లో వారికి, వైద్య వృత్తుల్లో వారికి
ఒత్తిడి సమస్యలు అధికం అవుతాయి. కోర్టు వ్యవహారాలు
మీకు అనుకూల మార్గంలో నడుస్తాయి. ప్లీడర్ల వ్యవహార
ధోరణి మీ పట్ల సుముఖంగా ఉంటుంది. ముఖ్యులకు బహుమతులు
అందజేస్తారు. సంగీత, సాహిత్య, కళా రంగాల్లో వారికి గుర్తింపు,
రాణింపు లభిస్తుంది. ఐరన్, సిమెంట్, కలప, ఇటుక
వ్యాపారస్తులకు సత్ఫలితాలు ఉన్న పనివారితో సమస్యలు
తలెత్తుతాయి. వివాహ వ్యవహారాదుల్లో మెళకువ వహించండి.
విదేశాలు వెళ్ళాలనే మీ ఆలోచన క్రియారూపంలో పెట్టినట్లయితే
జయం చేకూరుతుంది. రాజకీయాల్లో వారికి ఒత్తిడి, సమస్యలు
అధికం అయినా తేలికగా పరిష్కరిస్తారు. మీడియా రంగాల్లో వారు
అనుకోని సమస్యలు ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్
వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. పాత
సమస్యలను తేలికగా పరిష్కరిస్తారు. ఇతరులకు వాహనం ఇచ్చి
ఇబ్బందులకు గురికాకండి. స్థిర, చరాస్తుల విషయంలో ఒక
నిర్ణయానికి వస్తారు. స్త్రీలకు ఔషధ సేవమాత్రం తప్పదు.
ముఖ్యుల్లో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. విద్యార్థుల్లో
ఏకాగ్రత లోపం అధికమవుతుంది. మనోనిబ్బరం తగ్గుతుంది.
జాగ్రత్త వహించండి. సినీ కళారంగాల్లో వారికి నూతన అవకాశాలు
లభిస్తాయి. పారిశ్రామిక రంగంలో వారికి సంకట కాలం అనే
చెప్పవచ్చు. ప్రభుత్వ రంగాల్లో వారికి స్వల్ప వివాదాలు
తలెత్తే ఆస్కారం. కుటుంబంలో చిన్న చిన్న చికాకులు తలెత్తినా
క్రమంగా సమసిపోగలవు. ఆదాయ వ్యయాల్లో మీ అంచనాలు,
ప్రణాళికలు తారుమారవుతాయి. మిత్రుల ద్వారా కొత్త విషయాలు
గ్రహిస్తారు. నూతన వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టులు
అనుకూలిస్తాయి. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం
క్షేమదాయకం. ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు
గుర్తిస్తారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల
ఆసక్తి నెలకొంటుంది. ఎప్పటినుంచో వాయిదా పడిన మొక్కులు
చెల్లించుకుంటారు. దైవ దర్శనాలు అనుకూలిస్తాయి. వృత్తిరీత్యా
కొత్త వ్యక్తులకు కలుసుకుంటారు. వాహనం నిదానంగా నడపటం
మంచిది. పత్రికా, వార్తా సంస్థల్లోని వారు ఎంత జాగ్రత్తగా
వ్యవహరించినా ఏదో ఒక పొరపాటు జరిగే ఆస్కారం ఉంది.
చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు అన్ని విధాల
కలిసిరాగలదు. ముఖ్యులను పట్ల ఆరాధన పెరుగుతుంది. *
కృత్తికానక్షత్రం వారు అత్తిచెట్టును, రోహిణి నక్షత్రం వారు
నేరేడు, మృగశిర నక్షత్రం వారు మారేడు దేవాలయాల్లో గాని,
విద్యా సంస్థల్లో గానీ, ఖాళీ ప్రదేశాల్లోగాని నాటి వాటి
పురోభివృద్ధికి తోడ్పడిన మీకు అభివృద్ధి కానవస్తుంది. కృత్తికా
నక్షత్రం వారు పుచ్చుకెంపు లేక స్టార్రూబి, రోహిణి నక్షత్రం వారు
స్పందనముత్యం లేక జాతి ముత్యం, మృగశిరనక్షత్రం వారు
జాతి పగడం ధరించిన శుభం కలుగుతుంది. ఈ రాశివారు
లక్ష్మీగణపతిని తెల్లనిపూలతో పూజించి, విద్యార్థులు
దక్షిణామూర్తిని ఎర్రని పూలతో పూజించడం వల్ల
విద్యాభివృద్ధి చేకూరుతుంది. 2017 జనవరి నుండి నెలకు ఒక
శనివారం నాడు 20 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసినట్లైతే
సర్వదోషాలు తొలగిపోతాయి.
👫మిథునం👫
మృగశిర 3, 4 పాదాలు (కా, కి), ఆరుద్ర 1, 2, 3, 4
పాదములు (కూ, ఖం, జ్ఞ, చ్ఛ), పునర్వుసు 1, 2, 3
పాదములు (కే, కో, హా) ఆదాయం - 14, వ్యయం - 11, పూజ్యత
- 7, అవమానం - 7. ఈ రాశివారికి ఆగస్టు 11 వరకు తృతీయము
నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా చతుర్థము నందు, ఈ
సంవత్సరం అంతా తృతీయము నందు రాహువు, భాగ్యము నందు కేతువు,
జనవరి 25వ తేదీ వరకు షష్టము నందు శని, ఆ తదుపరి అంతా
సప్తమము నందు సంచరిస్తారు. ఈ రాశివారి గోచారం పరిశీలించగా,
"అర్థాతురాణాం నగురుర్న బంధు" ధనం, వస్తువులపై అధిక ఆపేక్ష
వల్ల బంధు మిత్రులకు దూరం అయ్యే అవకాశం ఉంది జాగ్రత్త
వహించండి. కుటుంబీకులతో మాట పట్టింపులు, కలహాలు అధికం కావడం
వల్ల కుటుంబ సౌఖ్యం అనుకున్నంతగా ఉండదు. ఆథ్యాత్మిక,
ఆత్మనిగ్రహంతో మీరు అనుకున్నది సాధించగలుగుతారు.
విద్యార్థులు తమ తెలివితేటలు, చాకచక్యంతో అందరిమెప్పు
పొందుతారు. పట్టుదలతో అనుకున్న రంగాల్లో ముందుకు వెళతారు.
స్నేహితులకు, విలాసాలకు దూరంగా ఉండటం మంచిది. స్పెక్యులేషన్
లాభదాయకం. మీ కళత్ర మొండివైఖరి మీకెంతో ఆందోళన
కలిగిస్తుంది. నూతన వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
పెద్దమొత్తంలో పెట్టుబడికాకుండా అంచలెంచెలుగా వ్యాపారాన్ని
అభివృద్ధి చేస్తే యత్నాలు ప్రారంభించడం మంచిది.
నిరుద్యోగులకు సదావకాశం తలుపు తడుతుంది. స్త్రీలకు ప్రకృతి,
వైద్య ఆయుర్వేద రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యం
నిలకడా లేకపోవడం వల్ల మానసిక అశాంతి పొందుతారు. స్త్రీలకు,
ఇరుగు, పొరుగువారికి ప్రభావం అధికంగా ఉటుంది. భాగస్వామ్యుల
మధ్య నూతన ఆలోచనలు స్ఫురించగలవు. ఎదుటివారి ఆలోచనలు
గమనించి ముందుకు సాగండి. తీర్థయాత్రలు, దైవ, సేవా, సాంఘిక
కార్యక్రమాల్లో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
ప్రత్యర్థుల వ్యూహ, ప్రతివ్యూహాలతో రాజకీయాల్లో వారికి
సంక్షోభం తప్పదు. వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి పండ్ల,
పూల, కొబ్బరి వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం
ఉండగలదు. వాతావరణంలో మార్పు రైతులకు ఎంతో ఆందోళన
కలిగిస్తుంది. అవివాహితులు శుభవార్తలు వింటారు. చర్మానికి
సంబంధించిన చికాకులు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. మీ
పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఎలక్ట్రికల్,
ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి శ్రమాధిక్యత, చికాకు
తప్పదు. నూతన దంపతులకు సంతాన ప్రాప్తి, సంతాన అభివృద్ధి
శుభదాయకంగా ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమల్లో వారికి
పనివారితో ఒత్తిడి, చికాకులు తప్పవు. కాంట్రాక్టర్లకు
బిల్డర్లకు ఎటువంటి అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం
మంచిది. గృహంలో ఏదైనా వస్తువులు పోయే ఆస్కారం ఉంది.
జాగ్రత్త వహించండి. కొంతమంది మీ మీద అపవాదులు వేయడానికి
ప్రయత్నిస్తారు. మే నుంచి ఆగస్టు వరకు ఊహించని
సమస్యలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. వైద్య
రంగాల్లో వారికి గుర్తింపు లభించినా ఒత్తిడి అధికం అవుతుంది.
సర్జరీలతో మంచి గుర్తింపు లభించగలదు. మానసిక ఆవేదన
అధికం కాగలదు. కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. అంతరిక్ష
పరిశోధకులకు కళాకారులకు, రచయితలకు, పత్రికా, మీడియా
రంగాల్లో వారికి జ్యోతిష్యులకు, పండితులకు శ్రమాధిక్యత
అధికం అవుతుంది. ఎదుటివారిని తక్కువ అంచనావేసి సంభాషించడం
వల్ల అపనిందలు ఎదుర్కొంటారు. వస్త్ర, బంగారు, వెండి లోహ
వ్యాపారస్తులకు చేతిపనివారికి సామాన్యంగా ఉంటుంది. కోర్టు
వ్యవహారాల్లో ఉన్నవారికి తెలివి, ఓర్పు, ప్రదర్శించే విజయం
తప్పకుండా మీకు సొంతమవుతుంది. విదేశీ ప్రయాణ యత్నాలు
అనుకూలిస్తాయి. ఎల్ఐసీ వంటి మార్కెటింగ్ వ్యాపారులు శ్రమ
చేసిన కొద్ది లాభాలు అధికంగా అందుకుంటారు. గృహనిర్మాణాలు,
వాహనాలు మార్పు చేసే యత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి. షేర్
వ్యాపారస్తులకు ఓర్పుగా వ్యవహరిస్తే మంచి వ్యాపారం
చేయు అవకాశం ఉన్నది. రుణం కోసం చేసే ప్రయత్నాలు
అనుకూలిస్తాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు బాగుగా పెరుగును.
ప్రయాణాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ప్రేమానుబంధాలు
బలపడతాయి. మొత్తంమీద ఈ సంవత్సరం అంతా శ్రమతో కూడి
ఫలితాలు సానుకూలం అవుతాయి. మృగశిర నక్షత్రం వారు మారేడు
చెట్టు, ఆరుద్ర నక్షత్రం వారు చింత చెట్టును, పునర్వసు
నక్షత్రం వారు గన్నేరు చెట్టును దేవాలయాల్లో గానీ, విద్యా
సంస్థల్లోగానీ, ఖాళీ ప్రదేశాల్లో గానీ నాటి వాటివాటి
పురోభివృద్ధికి తోడ్పడిన మీకు అభివృద్ధి కానవస్తుంది. మృగశిర
నక్షత్రం వారు జాతి పగడం, ఆరుద్ర నక్షత్రం వారు
ఎర్రగోమేధికం, పునర్వుసు నక్షత్రం వారు కనకపుష్యరాగం లేక
వైక్రాంతమణి అనే రాయిని ధరించిన శుభం కలుగుతుంది.
కర్కాటకం👫
పునర్వసు 4వ పాదము (హి), పుష్యమి 1,2,3,4
పాదాలు (హు, హె, హో,డా). ఆశ్లేష 1,2,3,4 పాదాలు
(డీ, డు, డే, డో). ఆదాయం - 8, వ్యయం - 11, పూజ్యత - 3,
అవమానం - 3. ఈ రాశివారికి ఆగష్టు 11 వరకు ధనస్థానము
నందు బృహస్పతి ఆ తదుపరి అంతా తృతీయము నందు ఈ
సంవత్సరం అంతా ద్వితీయము నందు రాహువు, అష్టమము నందు
కేతువు, జనవరి 25 వరకు పంచమము నందు శని, ఆ తదుపరి అంతా
షష్ఠమము నందు సంచరిస్తారు. ఈ గోచారం పరిశీలించగా " పరానుకూలం
పరిహాస భాషిణిః" అన్నట్లుగా పరులకు అనుకూలంగాను, మీకు
వ్యతిరేకంగా ఉండే వారితో మెళకువ అవసరం. ఆర్థిక విషయాల్లో
కొంత ఒత్తిడి ఎదుర్కొన్నప్పటికి నెమ్మదిగా సమసిపోతాయి.
నూతన వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సహకార సంఘాల్లో
వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కలంకారీ
వ్యాపారస్తులకు, చేతి పనుల్లో వారికి సత్కాలమనే
చెప్పవచ్చు. ఋణం తీర్చటానికై చేయు యత్నాలు కొంతవరకు
ఫలిస్తాయి. కిరాణా, ఫ్యాన్సీ, పాన్, సుగంధ ద్రవ్య
వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది. ఇచ్చి పుచ్చుకునే
వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. అవివాహితులు శుభవార్తలు
వింటుంటారు. ప్రేమ వ్యవహారాలు వికటించే ఆస్కారం ఉంది. మీ
విషయాలు బయటికి చేరవేసేవారు మీ పక్కనే ఉన్నారని
గమనించండి. క్రయ, విక్రయ రంగాల్లో వారికి ఒత్తిడి, పనిభారం
పెరుగుతుంది. మీ కుటుంబీకుల కోసం మంచి, మంచి పథకాలు, ప్రణాళికలు
వేసి జయం పొందుతారు. మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి.
కాంట్రాక్టర్లకు పని చేజారిపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు.
కొత్త కొత్త పనుల పట్ల ఏకాగ్రత వహించండి. విద్యార్థుల్లో
కన్నా విద్యార్థినులలో పురోభివృద్ధి కానవస్తుంది. టెక్నికల్
విద్యార్థులు, వైద్యవిద్యార్థుల నిపుణతకు, తెలివితేటలకు
మంచి గుర్తింపు లభిస్తుంది. మార్పులు కోసం చేసే ప్రయత్నాలు
అనుకూలించకపోవచ్చు. అతిమొండివైఖరి అవలంభించి ఇబ్బందులకు
గురికాకండి. ఆడిటర్లకు, వృత్తుల్లో వారికి అశాంతి కానరాగలదు.
శుభకార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు. స్త్రీలకు, పొట్ట, కాళ్ళు,
నడుముకు సంబంధించిన చికాకులు అధికం అవుతాయి. ఆహార
వ్యవహారాల్లో, ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. కోర్టు
వ్యవహారాల్లో ఊహించని సమస్యలు తలెత్తగలవు. స్థిర,
చరాస్తుల విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏజెంట్లకు,
బ్రోకర్లకు, షేర్ వ్యాపారస్తులకు శుభం,జయం, చేకూరుతుంది.
ఉద్యోగస్తులు మార్పులకోసం చేసే ప్రయత్నాలు అనుకూలించక
పోవచ్చు. పత్తి, పొగాకు, మిర్చి, నూనె, వ్యాపారస్తులకు,
స్టాకిస్టులకు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల
సత్ఫలితాలు లభిస్తాయి. సినిమా, కళా, రంగాల పట్ల ఆసక్తి
పెరుగుతుంది. కోళ్ళ, మత్స్య, గొర్రెలు, పాడి పరిశ్రమ
రంగాల్లోవారికి శ్రమ అధికం. ఉత్తర ప్రత్యుత్తరాలు మీకెంతో
సంతృప్తినిస్తాయి. పత్రికా, మీడియా, రంగాల్లో వారికి గుర్తింపు
లభిస్తుంది. ఇంజనీరింగ్, టెక్నికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి
పురోభివృద్ధి కానరాగలదు. వైద్య రంగాల్లో వారు ఒత్తిడి
చికాకులకు లోనవుతారు. హోటల్, కేటరింగ్, బేకరి, తినుబండారాల
వ్యాపారస్తులకు కలిసిరాగలదు. విదేశీయాన యత్నాలు
ఫలించకపోవచ్చు. బంధుమిత్రులలో మంచి గుర్తింపు లభిస్తుంది.
వాతావరణంలో మార్పు వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి
ఆందోళన కలిగిస్తుంది. మందులు, రసాయన, సుగందద్రవ్య
వ్యాపారస్తులకు చిన్నతరహా పరిశ్రమల్లో వారికి పనిభారం
పెరుగుతుంది. ఉచిత సలహాలివ్వడం వల్ల సమస్యలు
ఎదుర్కొంటారు. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. పాత
వ్యవహారాలు జ్ఞప్తికి తెచ్చుకుని కాలం వ్యర్థం చేయటం
వల్ల మంచి అవకాశాలు చేజారి పోతాయి. ఎక్స్పోర్ట్ రంగాల్లో
వారికి ట్రాన్స్పోర్ట్ రంగాల్లో, మోటర్ఫీల్డ్ రంగాల్లో వారికి
ఒత్తిడి పెరుగుతుంది. పనివారితో సమస్యలు తలెత్తవచ్చు.
చిన్నచిన్న ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. జూలై, అక్టోబర్,
నవంబర్ నెలల్లోజాగ్రత్త వహించండి. మొత్తం మీద ఈ
సంవత్సరం అంతా శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుందనే
చెప్పవచ్చు. ఈ రాశివారు పంచముఖ ఆంజనేయస్వామిని,
స్థిరలక్ష్మిదేవిని తెల్లని పూలతో ఆరాధించడం వల్ల మనోవాంఛ
నెరవేరగలదు. విద్యార్థులకు, విద్యాభివృద్ధికి, స్థిరబుద్ధికి,
సంకల్పం నెరవేరేందుకు సరస్వతీ దేవిని పూజించడం వల్ల శుభం
కలుగగలదు. పునర్వసు నక్షత్రం వారు గన్నేరు చెట్టును,
పుష్యమి నక్షత్రం పిప్పలి చెట్టును, ఆశ్లేషనక్షత్రం వారు
బొప్పాయి చెట్టును దేవాలయాల్లో గాని, విద్యా సంస్థల్లోగాని,
ఖాళీ ప్రదేశాల్లోగాని నాటి వాటి పురోభివృద్ధికి తోడ్పడిన మీకు
అభివృద్థి కానవస్తుంది. పునర్వసు నక్షత్రం వారు
కనకపుష్యరాగం దరించిన శుభంకలుగుతుంది
👫సింహం👫
మఘ 1, 2, 3, 4 పాదములు (మా, మీ, మూ, మే),
పుబ్బ 1, 2, 3, 4 పాదాలు (మో, టా, టీ, టు)
ఉత్తర 1 పాదము (టే), ఆదాయం -11, వ్యయం -5, పూజ్యత
-6, అవమానం -3. 2016 సంవత్సరంలో సింహ రాశి వారికి ఆగస్టు
11వ తేదీ వరకు జన్మము నందు బృహస్పతి ఆ తదుపరి అంతా
ద్వితీయము నందు ఈ సంవత్సరం అంతా జన్మమము నందు రాహువు,
సప్తమము నందు కేతువు, జనవరి 25వ తేదీ వరకు చతుర్థము
నందు శని ఆ తదుపరి అంతా పంచమము నందు సంచరిస్తారు. ఈ
రాశివారి గోచారం గమనించగా ''''''''''''''''సంకల్పబలం ఎట్టిదో
కదా!'''''''''''''''' అన్నట్లుగా సంకల్పబలంతో ఒకడుగు ముందుకు
వేయండి. అదృష్టం మిమ్మల్నే వరిస్తుంది. అర్థాష్టమ
శనిదోషం ఉన్నప్పటికీ కూడా ఈ శని మీకు హానికారి కాజాలడు.
విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఒక అవకాశం లభిస్తుంది. మీకు
ఎటువంటి అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోండి. ఒక్కోసారి
వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నష్టపోయే ఆస్కారం
ఉన్నందువల్ల తొందరపాటు నిర్ణయాలు మంచిదికాదని
గమనించగలరు. మీ కుటుంబీకుల సహాయ, సహకారాలు మీకు మెండుగా
ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయం, వారితో సంభాషించేటప్పుడు
చాలా జాగ్రత్త అవసరం. కొంతమంది మిమ్మల్ని తప్పుదోవ
పట్టించవచ్చు. పదిమందికి దానధర్మాలు చేయటం వల్ల మంచి
గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్య విషయంలో మెళకువ అవసరం.
స్థిర చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ఏదైనా
అమర్చుకోవాలనే మీ ఆశయం, క్రియారూపంలో పెట్టినట్లైతే
సఫలీకృతులౌతారు. విద్యార్థులకు, వైజ్ఞానిక శాస్త్ర రంగాల
పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రైవేట్ రంగాల్లో వారికి ఒక ప్రకటన
ఎంతో ఆందోళన కలిగించగలదు. మార్పుల కోసం చేసే ప్రయత్నాలు
అనుకూలిస్తాయి. స్పెక్యులేషన్ రంగాల పట్ల ఆసక్తి
పెరుగుతుంది. విద్యాసంస్థల్లో వారికి అధికశ్రమ, ఒత్తిడి
తప్పదు. కొంతమంది మీ మీద అపవాదులు వేయటానికి
ప్రయత్నిస్తారు జాగ్రత్త వహించండి. రచయితలకు, కళాకారులకు
అనుకోని గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పారిశ్రామికరంగంలో వారికి
పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీల మనోవాంఛలు నెరవేరే సమయం
ఆసన్నమైందని గమనించగలరు. విలువైన వస్తువులు, ఆభరణాలు
అమర్చుకుంటారు. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికం
అవుతున్నారని గమనించండి. అవివాహితులు శుభవార్తలు వింటారు.
నూతనోత్సాహం నెలకొంటుంది. వైద్య రంగాల్లో వారికి గుర్తింపు, రాణింపు
లభిస్తుంది. పీచు, ఫోం, లెదర్ వ్యాపారస్తులకు, చిన్నతరహా
పరిశ్రమల్లో వారికి శ్రమాధిక్యత, చికాకు తప్పవు.
వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి వాతావరణంలో మార్పు ఎంతో
ఆందోళన కలిగిస్తుంది. మీ పెద్దల ఆరోగ్యం గురుంచి ఆందోళన
చెందుతారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, టెక్నికల్ రంగాల్లో వారికి
శ్రమకు తగిన పారితోషికం లభించగలదు. ప్రభుత్వ రంగ సంస్థల్లో
వారు మార్పులకోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రక్షణ
రంగాల్లో వారికి రక్షణ కరువవుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో
వారికి అచ్చుతప్పులు పడటం వల్ల మాట పడతారు. వస్త్ర,
బంగారు, వెండి, లోహ, ఆల్కహాల్ వ్యాపారస్తులకు వస్తువులు
పోయే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. ఏదైనా స్థిరాస్తులు
అమ్మకానికై చేయు యత్నాలు వాయిదా పడతాయి. చిన్నతరహా
పరిశ్రమల్లో వారికి విద్యుత్ లోపం అధికం కావడం వల్ల
ఆందోళనకు గురవుతారు. కోళ్ళ, మత్స్య, పాడి, పరిశ్రమ
వ్యాపారస్తులకు వారి వారి వ్యాపారాల పట్ల ఆందోళన
పెరుగుతుంది. నిత్యవసర వస్తు వ్యాపారస్తులకు,
స్టాకిస్టులకు, కలంకారీ వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం.
ఎండుమిర్చి, నూనె, కంది, మినుము, ధాన్య వ్యాపారస్తులకు,
స్టాకిస్టులకు అభివృద్ధి ఉన్నప్పటికీ టాక్స్ వంటి సమస్యలు
తలెత్తవచ్చు జాగ్రత్త అవసరం. ఐరన్ వ్యాపారస్తులకు
పురోభివృద్ధి. ట్రాన్స్పోర్ట్ రంగాల్లో వారికి చికాకులు వంటివి
ఉండగలవు. రాజకీయ నాయకులు ఎదుటివారిని గమనించి ముందుకు
సాగటం మంచిది. స్త్రీలతో సంభాషించేటప్పుడు జాగ్రత్త
వహించండి. దైవ కార్యక్రమాల్లోను, శుభకార్యక్రమాల్లోనూ
చురుగ్గా పాల్గొంటారు. ఒక ప్రకటన మీకెంతో ఆశ్చర్యం
కలిగిస్తుంది. భాగస్వామ్యుల మధ్య నూతన ఆలోచనలు
స్ఫురిస్తాయి. మీలో ఆరాధన అధికం అవుతుంది. కొనుగోలు,
అమ్మకం దార్లకు మిశ్రమ ఫలితంగా ఉండగలదు. పాత
వ్యక్తుల కలయిక మీకెంతో సంతృప్తినిస్తుంది. పాత విషయాలు
చర్చిచడం వల్ల ఒక్కోసారి మనోవేదనకు గురవుతారు. మీ
హావభావాలు, ఆలోచనలు నిగూఢంగా ఉంచడం మంచిది. కొంతమంది
మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. హామీలకు,
రుణాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ సంవత్సరం అంతా అనుకోని
అభివృద్ధి కానవచ్చిన ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. '
👫కన్య👫
ఉత్తర 2, 3, 4 పాదములు (టో, పా, పి), హస్త
1, 2, 3, 4, పాదములు (పూ, షం, ణ, ఢ), చిత్త 1
2, పాదములు (పే, పో), ఆదాయం-14, వ్యయం-11, పూజ్య-2,
అవమానం-6. 2016లో కన్యా రాశివారికి ఆగస్టు 11 వరకు
వ్యయం నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా జన్మమము నందు,
జనవరి 25వ తేదీ వరకు తృతీయము నందు శని, ఆ తదుపరి అంతా
అర్థాష్టమ శని, ఈ సంవత్సరం అంతా వ్యయం నుండి రాహువు,
షష్టమునందు కేతువు సంచరిస్తారు. ఈ రాశివారి గృహసంచారాన్ని
పరీక్షిస్తే "వాదుకు వచ్చినదే కీడు సుమి" ఇతరులతో వాదించడం
వల్ల అపవాదులు ఎదుర్కొనవలసి వస్తుంది. ప్రతి విషయంలోనూ,
ప్రతి పనిలోనూ ఓర్పు, నేర్పు, సహనం చాలా అవసరమని
గమనించండి. ఆర్థిక విషయాల్లో కొంత పురోభివృద్ధి కానవస్తుంది.
నూతన ఒడంబడికలకు, నూతన వ్యవహారాలకు అనుకూలమైన కాలం.
అధిక శ్రమానంతరం సత్ఫలితాలు పొందుతారు. నిత్యావర వస్తు
స్టాకిస్టులకు, కంది, మినుము, ఆవాలు, ధనియాలు, బొబ్బర్లు,
జొన్న వ్యాపారస్తులకు గణనీయమైన అభివృద్ధి కానవస్తుంది.
ఇతరులకు సహాయం చేసి మాటపడటం వల్ల మానసిక అశాంతికి
లోనవుతారు. విద్యార్థులకు విద్యావిషయాల్లో ఏకాగ్రత
తగ్గుతుంది. మీ పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అంతా సామాన్యంగా ఉన్నా
నెమ్మెదిగా పురోభివృద్ధి చెందుతారు. రియల్ ఎస్టేట్
వ్యాపారస్తులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ఫ్యాన్సీ,
మందులు, రసాయనిక సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు శుభం,
జయం పురోభివృద్ధి కానవస్తుంది. కోళ్ళ, మత్స్యు, గొర్రెల
వ్యాపారస్తులకు కొత్తకొత్త ఆనారోగ్యాలు చోటుచేసుకునే అవకాశం
ఉంది. జాగ్రత్త వహించండి. కొంతమంది మిమ్మల్ని
భాగస్వామ్యులుగా ఆహ్వానిస్తారు. భాగస్వామ్య వ్యాపారంలో
మీరు అనుకున్నంతగా రాణించలేరు. ఆధ్యాత్మిక, సేవా
కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. మీ కళత్ర
ఆరోగ్యం మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. వ్యవసాయ, తోటల
రంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ఏదైనా
అమ్ముదామన్న ఆలోచనలు అధికం అవుతాయి. తాత్కాలికంగా
విరమించడం మంచిది. రుణవిముక్తులవుతారు. ప్రైవేటు రంగాల్లో వారు
మార్పుల కోసంచేయు ప్రయత్నాలు అనుకూలించవు. విదేశీ వస్తువుల
పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ సోదరుడు, సోదరి ఆరోగ్యం గురించి
ఆందోళన చెందుతారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. ప్రేమికులకు
మధ్య నూతన ఆలోచనలు స్ఫురించగలవు. మీతోటివారికి
బహుమతులు ఇచ్చి ఆకర్షించే ప్రయత్నాలు చేస్తారు.
చిన్నతరహా పరిశ్రమల్లో వారికి ఒత్తిడి, చికాకులు అధికం
అయినా జయం మిమ్మల్నే వరిస్తుంది. రాజకీయాల్లో వారు
సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. కళాకారులకు, సినిమా రంగాల్లో వారికి,
రచయితలకు, పత్రికా రంగాల్లో వారికి శాస్త్రజ్ఞులకు ఇంటా,
బయటా గుర్తింపు లభిస్తుంది. రిప్రజెంటేటివ్లకు నిర్ధేశించబడిన
గమ్యానికి చేరలేకపోవడం వల్ల ఇబ్బందులకు లోనవుతారు.
క్రయ, విక్రయ రంగాల్లో వారికి అశ్రద్ధ వల్ల కొన్ని
సమస్యలు తలెత్తుతాయి. కలప, ఇటుక, ఇసుక రంగాల
వ్యాపారస్తులకు శుభదాయకంగా ఉండగలదు. పండ్ల, పూల, కొబ్బరి,
చల్లని పానీయ వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం
ఉంటుంది. కాంట్రాక్టర్లకు మంచిమంచి అవకాశాలు లభిస్తాయి. ఐరన్,
సిమెంట్ వ్యాపారస్తులకు పరిశ్రమల్లో వారికి ఆర్థికంగా ఒకడుగు
ముందుకెళతారు. పెద్దలను ప్రముఖులను సుముఖం చేసుకుంటారు. మే,
అక్టోబర్, డిసెంబర్ నెలల్లో ఆరోగ్యంలో సమస్యలు
తలెత్తుతాయి. నరాలకు సంబంధించిన చికాకులు అధికంగా ఎదుర్కొంటారు.
ఫైనాన్స్, చిట్ఫండ్ వ్యాపారస్తులకు మెళకువ అవసరం. క్రీడా
రంగాల్లో వారికి సంతృప్తి కానరాదు. కమ్యూనికేషన్ రంగాల్లో వారికి
మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఒక మంచి
అవకాశం తలుపుతడుతోంది. సంగీత కళాకారులకు, అంతరిక్ష
పరిశోధకులకు, పండితులకు వారివారి రంగాల్లో గుర్తింపు, రాణింపు
లభిస్తుంది. కొంతమంది దురుసుగా ప్రవర్తించడం వల్ల మీరు
ఆందోళనకు గురవుతారు. 2017 నుంచి అర్థాష్టమ శనిదోషం
ఏర్పడుతున్నందువల్ల నెలకు ఒక శనివారంనాడు 17సార్లు
నవగ్రహ ప్రదక్షణ చేసి చామంతి పూలతో పూజించిన దోషాలు
తొలగిపోతాయి. మొత్తంమీద ఈ సంవత్సరం అంతా కొంత ఒత్తిడి,
ఎదుర్కొన్నప్పటికీ సత్ఫలితాలను పొందుతారనే చెప్పవచ్చు. ఈ
రాశివారు 3 నెలలకు ఒక గురువారం నాడు రాహువు, కేతువులకు పూజ
చేయించి దుర్గాదేవిని ఆరాధించి, లక్ష్మీనారాయణ స్తోత్రం
చదవడం వల్ల లేక వినడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది.
విద్యార్థుల, విద్యాభివృద్ధికి, దక్షిణామూర్తిని ఆరాధించడం
వల్ల పురోభివృద్ధి 
👫తుల👫
చిత్త 3, 4 పాదములు (రా,రి,). స్వాతి 1, 2, 3, 4
పాదాలు (రూ, రే, రో, తా). విశాఖ 1, 2, 3 పాదాలు (తీ,
తూ, తే). ఆదాయం-11, వ్యయం -14, పూజ్యత -5, అవమానం
-6. 2016 తులా రాశివారికి ఆగస్టు 11వ తేదీ వరకు లాభము
నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా వ్యయం నందు, జనవరి 25వ
తేదీ వరకు ద్వితీయము నందు శని, ఆ తదుపరి అంతా తృతీయము
నందు, ఈ సంవత్సరం అంతా లాభము నందు రాహువు, పంచమము నందు
కేతువు సంచరిస్తారు. ఈ గ్రహ సంచారాన్ని పరీక్షించగా
"యదృశ్య భావనా యాత్ర సిద్ధిర్ భవతి తద్రిశీ''''''''
అన్నట్లుగా మనకు ఎటువంటి బుద్ధి పుడుతుందో అదే ఫలితాలు
మీరు పొందబోతున్నారు. ఎదుటివారిని సద్భావంతో అర్థంచేసుకునే
ప్రయత్నం చేయండి. తొందరపడి సంభాషించడం వల్ల సమస్యలు
ఎదుర్కొనక తప్పదు. సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి
పెరుగుతుంది. కొంతమంది ఆహ్వానాలు మీకెంతో సంతృప్తినిస్తాయి.
ఆకస్మికంగా మీలో వేదాంతధోరణి కానవస్తుంది. మీ కళత్ర
ఆరోగ్యంలోను, మీ ఆరోగ్యంలోను జాగ్రత్త అవసరం. మీ
కుటుంబీకుల గురించి మంచి మంచి పథకాలు వేస్తారు. స్థిరాస్తుల
పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి కానవచ్చినప్పటికీ
ఆదాయానికి మించి ఖర్చుకావడంతో ఒకింత ఆందోళన తప్పదు. మీ
అభివృద్ధికి మంచి మంచి అవకాసాలు లభించినా వాటిని
సద్వినియోగం చేసుకోవడం మీ వంతు అని గ్రహించండి. పాత
సమస్యలను చేధించి ధైర్య సాహసాలతో ముందుకు సాగడం వల్ల
వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి కానరాగలదు. ఏలినాటి
శనిదోషం జనవరితో తొలగిపోవడం వల్ల మీకు అనుకోని అభివృద్ధి,
గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలకు ఆరోగ్యంలో ఇబ్బందులు,
కొంతచికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యాపారాల పట్ల ఆసక్తి
పెరుగుతుంది. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికం కావడం, అధిక
శ్రమానంతరం గుర్తింపు లభిస్తుంది. మీ కళత్ర ధోరణి మీకెంతో
ఆందోళన కలిగిస్తుంది. కాంట్రాక్టర్లు నిర్మాణ పనుల్లో జాప్యం,
పనివారలతో సమస్యలు ఎదుర్కొంటారు. నిత్యావసర వస్తు
వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు గణనీయమైన పురోభివృద్ధి
కానవస్తుంది. బంగారం, వెండి వ్యాపారులు చోరుల వల్ల సమస్యలు
ఎదుర్కొంటారు. వ్యవసాయదారులకు వాతావరణం ఎంతో ఆందోళన
కలిగిస్తుంది. బ్యాంకింగ్, ఫైనాన్సు, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి,
పనిభారం అధికమవుతుంది. స్పెక్యులేషన్ రంగాల వారికి ఓర్పు,
లౌక్యం చాలా ముఖ్యం. పూల, పండ్ల, కొబ్బరి, పానీయ
వ్యాపారస్తులకు పురోభివృద్ధి. రసాయన, ఆల్కహాల్, సుగంధ
ద్రవ్య వ్యాపారులకు కలిసివచ్చే కాలం. స్టేషనరీ, ప్రింటింగ్
రంగాల వారికి మందకొడిగా ఉంటుంది. నూతన పెట్టుబడులు, లీజు,
ఏజెన్సీలకు సంబంధించిన వ్యవహారాల్లో పునరాలోచన అవసరం.
స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడివల్ల ఆందోళనలకు గురవుతారు.
ఆర్థికస్థితి ఆశించిన విధంగా మెరుగు పడకపోవడంతో ఒకింత
నిరుత్సాహం తప్పదు. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన
విషయాలు చర్చకు రాగలవు. ట్రాన్స్పోర్ట్, ఆటో మొబైల్,
మెకానికల్ రంగాల్లో వారికి ఆర్థికంగా ఒకడుగు ముందుకు వెళ్తారు.
మిర్చి, ప్రత్తి, నూనె, కంది, మినుము స్టాకిస్టులకు,
స్పెక్యులేషన్ చేయువారికి ఆశాజనకంగా ఉంటుంది. ఒక్కోసారి ధనం
ఏమాత్రం నిలపలేకపోతున్నామనే ఆవేదనకు గురవుతారు.
అవివాహితులు ఊహ లోకంలో విహరించక సత్కాలాన్ని సద్వినియోగం
చేసుకోండి. క్యాటరింగ్ రంగాల్లో వారికి, హోటల్, తినుబండ
వ్యాపారస్తులకు 2016 ఆగస్టు నుంచి యోగదాయకంగా
ఉండగలదు. ఫోటోగ్రఫీ, సినిమా, కళారంగాల్లో వారికి అనుకున్నంత
గుర్తింపు లభించకపోవచ్చు. పీచు, ఫోం, లెదర్, చిన్నతరహా
పరిశ్రమల్లో వారికి సత్కాలమనే చెప్పవచ్చు. వాహనం
కొనుగోలుకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉచితసలహా
ఇవ్వటం వల్ల సమస్యలు మీ తలకు చుట్టుకుంటాయి జాగ్రత్త
వహించండి. ముఖ్యుల ఆరోగ్యం మీకెంతో ఆందోళన కలిగిస్తుంది.
కంప్యూటర్ రంగాల్లో వారికి, టెక్నికల్ రంగాల్లో వారికి ప్రైవేట్
సంస్థల్లో వారికి మార్పులు అనుకూలించగలవు. వైద్యులు శస్త్ర
చికిత్సలు చేసేటప్పుడు మెళకువ అవసరం. కోర్టు వ్యవహారాలు
వాయిదా పడటం మంచిది. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు
సామాన్యంగా ఉంటుంది. ఆడిటర్లకు చేతినిండా పనిభారం పెరుగుతుంది.
విద్యారంగాల్లో వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ముఖ్యమైన
పత్రాలు చేజార్చుకునే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. రియల్
ఎస్టేట్ రంగాల్లో వారికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి.
మొత్తం మీద ఈ సంవత్సరం అంతా మిశ్రమ ఫలితంగానే ఉంటుందనే
చెప్పవచ్చు. ఈ సంవత్సరం రెండో భాగం నుండి బాగుగా అభివృద్ధి
చెందుతారు.
👫వృశ్చికం👫
విశాఖ 4వ పాదము(తో). అనూరాధ 1, 2, 3, 4
పాదాలు (నా,నీ,నూ, నే). జ్యేష్ఠ 1, 2, 3 పాదాలు
(నో, యా, యీ, యు). ఆదాయం-2, వ్యయం-8, పూజ్యత-1,
అవమానం-2. 2016 వృశ్చిక రాశివారికి ఆగస్టు 11వరకు
రాజ్యము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా లాభము నందు, ఈ
సంవత్సరము అంతా రాజ్యము నందు రాహువు, చతుర్థము నందు
కేతువు, జనవరి 25వ తేదీ వరకు జన్మము నందు శని, ఆ
తదుపరి అంతా ద్వితీయము నందు సంచరిస్తారు. ఈ గోచారం
పరీక్షించగా "సాహసంబు చేయు తగదెట్టి కార్యంబు" అన్నట్లుగా
తొందరపాటుతనం వల్ల సమస్యలు కొనితెచ్చుకునే ప్రమాదం ఉంది.
ప్రతి పనిలోనూ శారీరకశ్రమ, ఒత్తిడి ఎదుర్కొంటారు. ఆహార
వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. మీ కుటుంబీకుల ఆరోగ్యం
మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. ఎదుటివారి ధోరణి మీకెంతో
ఆశ్చర్యం కలిగించగలదు. గృహంలో మార్పుల కోసం చేసే
ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త కొత్త విషయాల పట్ల
ఆసక్తి పెరుగుతుంది. పెద్దలను, ప్రముఖులను, పండితులను
కలుసుకుంటారు. ముఖ్యులకు బహుమతులు అందచేస్తారు. నూతన
వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మార్పులు మీకు
అనుకూలిస్తాయి. ధనం ఎంత వచ్చినప్పటికిని ధనధ్యాస అధికం
అవటం వల్ల అపవాదులు ఎదుర్కొనవలసి వస్తుంది. వివాహ
యత్నాలలో సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు.
స్త్రీలకు ఆరోగ్య, ఆర్థికపరమైన సమస్యలు
అధికమవుతాయి. ఒక విషయంలో ఆప్తుల సలహా పాటించనందుకు
కించిత్ పశ్చాత్తాపం చెందుతారు. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో
ఆసక్తి కలిగిస్తుంది. భాగస్వామిక చర్చలలో కొత్త విషయాలు,
ఒప్పందాలు చోటుచేసుకుంటాయి. రహస్య విరోధులు అధికం కావడం
వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. ఎలక్ట్రికల్,
ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల వారికి సదవకాశాలు లభించగలవు.
కాంట్రాక్టర్లు చేపట్టిన పనులు కొంత ముందు వెనుకనైనా
సంతృప్తికరంగా పూర్తిచేస్తారు. ఆర్థిక అవసరాలు ఖర్చులు
పెరగడంతో అదనపు ఆదాయానికై శ్రమిస్తారు. విద్యార్థులు
నిర్లక్ష్యం, మతిమరుపు కారణంగా సమస్యలు ఎదుర్కొనవలసి
వస్తుంది. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది.
మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. మీ
ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా వ్యయం చేయడం
మంచిది కాదని గమనించండి. వస్త్ర, బంగారం, వెండి, లోహ,
గృహోపకరణాల వ్యాపారులకు పురోభివృద్ధి. వైద్య, ఇంజనీరింగ్
రంగాల వారికి చికాకులు తప్పవు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం
సందర్శిస్తారు. విద్యార్థులు క్రీడలు, ప్రేమ వ్యవహారాల
పట్ల ఆసక్తి కనబరచడం వల్ల ఒత్తిడి, మందలింపులు
ఎదుర్కోక తప్పదు. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి.
కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి
పెడుతుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి.
హోటల్, తినుబండారాలు, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు
2016 ఆగస్టు నుంచి పురోభివృద్ధి ఉండగలదు. రుణయత్నం
అనుకూలించడంతో కొంత ఊరట చెందుతారు. ప్రైవేట్ సంస్థల్లోని వారికి
ఓర్పు, అంకితభావంతో పనిచేయాల్సి ఉంటుంది. కళాకారులకు
రచయితలకు, పత్రికా రంగాల్లో వారికి వారివారి రంగాల్లో గుర్తింపు
లభిస్తుంది. రాజకీయాల్లోని వారికి సమస్యలు తలెత్తే ఆస్కారం
ఉంది. ట్రాన్స్పోర్ట్ రంగాల్లో వారికి, ఐరన్ వ్యాపారస్తులకు
ఊహించని సమస్యలు తలెత్తుతాయి. నిరుద్యోగులు ప్రభుత్వ
ఉద్యోగానికై చేయు యత్నాలు ఫలించగలవు. అప్పుడప్పుడు
కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. వాహనం
మార్పు మీకు అనుకూలిస్తుంది. ఇప్పటివరకు మిమ్మల్ని తక్కువ
అంచనావేసిన వారు మీ సహాయ, సహకారాలు ఆశిస్తారు. పండ్ల,
పూల, కొబ్బరి, పానీయ వ్యాపారస్తులకు, ఆల్కహాలు
వ్యాపారస్తులకు ఆశాజనకంగా ఉండగలదు. నిర్మాణ పథకాల్లో
పనివారితో జాగ్రత్త అవసరం. ధనస్థానం నందు జనవరి నుండి శని
సంచారం వల్ల కొంత ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొనవలసి వస్తుంది.
ప్రతి శనివారం 9సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి, ఎర్రని
పూలతో శనిని పూజించి, 7 ఒత్తులు ఏకం చేసి, నువ్వుల నూనెతో శనికి
దీపారాధన చేసినట్లైతే మీ సమస్యలు తొలగిపోతాయి. ఈ
సంవత్సరం అంతా కార్తీకేయుని ఎర్రనిపూలతో పూజించడం వల్ల
ఇష్టకామేశ్వరిదేవిని ఆరాధించడం వల్ల శుభం, జయం,
పురోభివృద్ధి పొందుతారు. * విశాఖనక్షత్రం వారు మొగలి మొక్కను,
అనురాధ నక్షత్రం వారు పొగడ మొక్కను, జ్యేష్ఠ నక్షత్రం వారు
కొబ్బరి మొక్కను, దేవాలయాల్లో గానీ, విద్యా సంస్థల్లో గానీ,
ఖాళీ ప్రదేశాల్లో గానీ నాటి దాని అభివృద్ధికి పాటుపడినట్లైతే
శుభం కలుగుతుంది.
👫ధనస్సు👫
మూల 1, 2, 3, 4 పాదములు (యే, యో, బా, బి),
పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు (భూ, ధ, భా, ఢ),
ఉత్తరాషాఢ 1వ పాదము (భే). ఆదాయం-5, వ్యయం -14,
పూజ్యత- 4, అవమానం -2. 2016 ధనుస్సు రాశివారికి ఆగస్టు
11వ తేదీ వరకు భాగ్యము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా
రాజ్యము నందు, ఈ సంవత్సరము అంతా తృతీయము నందు కేతువు,
భాగ్యము నందు రాహువు జనవరి 25వ తేదీ వరకు వ్యయము
నందు శని, ఆ తదుపరి అంతా జన్మమము నందు సంచరిస్తారు. ఈ
రాశివారి గోచారం పరీక్షించగా ''''''''క్రియసిద్ధిః సత్వేభవతి
మహాతం న ఉపకరణే'''''''' కార్యసాధకులు ఆత్మవిశ్వాసం
విడవకుండా శ్రద్ధాశక్తులతో కార్యసాధన చేయాలి. ఉత్సాహం
చాలా బలీయమైనది మీరు ఏకాగ్రత వహిస్తే సాధించలేనిదంటూ
ఏదీ ఉంటుంది. ప్రతిపనిలోనూ, ప్రతి విషయంలోనూ, ప్రతి
ఊహలోను, మీ ఆశయమే ధ్యేయంగా పెట్టుకోవాలి. ధనం ఎంత
ఖర్చు అయినా ధనం సమయానికి అందటం వల్ల ఇబ్బంది అంటూ
ఏదీ ఉండదు. కొంతమంది నిరుత్సాహపరిచి నిర్వీర్యులను
చేయడానికి ప్రయత్నిస్తారు. మీ హావభావాలు, ఆలోచనలు ఏవీ
బయటకు వ్యక్తం చేయకుండా ఉండటం మంచిది. క్రయ విక్రయ
రంగాల్లో వారికి మెళకువ అవసరం. నూతన వ్యాపారాల పట్ల
ఆసక్తి పెరుగుతుంది. సామూహిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ప్రైవేట్ సంస్థల్లో వారికి స్థిరబుద్ధి లేకపోవడం వల్ల
ఇబ్బందులు తప్పవు. ఫైనాన్సు, చిట్ఫండ్, బ్యాంకింగ్ రంగాల్లో
ఒత్తిడి, పనిభారం పెరుగుతుంది. రాజకీయాల్లో వారికి ప్రతికూల
వాతావరణం నెలకొని ఉండగలదు. ప్రత్యర్థుల నుంచి
సమస్యలు ఎదుర్కొంటారు. స్త్రీల ఓర్పు, నేర్పుకు పరీక్షా
సమయం అని చెప్పవచ్చు. కొంతమంది మాట, తీరు మీకు రుచించదు.
కుటుంబంలో అసౌఖ్యం మీకు అధికమవుతుంది. గణిత, సైన్స్,
టెక్నికల్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. సాంఘిక, సాంస్కృతిక
కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు తొందరపాటు
నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది.
స్నేహితులతో అతిగా ప్రవర్తించడం వల్ల మాటపడక తప్పదు.
ప్రతిరోజూ సరస్వతీదేవిని పూజించడం వల్ల స్థిరబుద్ధి,
విద్యాభివృద్ధి చేకూరుతుంది. వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి
నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్,
కంప్యూటర్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. కొబ్బరి,
పండ్ల, పానీయ, మిర్చి, నూనె వ్యాపారస్తులకు కలిసివచ్చేకాలం.
సినిమా, టీవీ కళాకారులకు, సాంకేతిక నిపుణులకు కలిసిరాగలదు. మీ
ప్రత్యర్థుల తీరును గమనించి ముందుకు సాగటం మంచిది. కోర్టు
వ్యవహారాలు మీ పాత సమస్యలు ఒక కొలిక్కిరాగలవు.
అవివాహిత యువకులకు నూతన ఆలోచనలు స్ఫూరిస్తాయి. షేర్ల
క్రయవిక్రయాలు సంతృప్తినిస్తాయి. నిర్మాణ పనులలో
పురోభివృద్ధి. సకాలంలో పూర్తి అయ్యే సూచనలు కానవస్తాయి.
ఒక స్థాయి వ్యక్తుల కలయిక ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు.
పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. ఏలినాటి
శనిదోషం అధికంగా అవుతున్నందువల్ల ఆహార, వ్యవహారాల్లో
జాగ్రత్త అవసరం. పారిశ్రామిక రంగంలో వారికి పనివారితో
సమస్యలు తలెత్తిన గురుబలం అధికంగా ఉన్నందువల్ల
తెలివితో పరిష్కరించగలుగుతారు. మీ కొత్త కొత్త ఆలోచనలు
క్రియారూపంలో పెట్టండి. నిరుద్యోగులకు ఒక అవకాశం
తలుపుతడుతుంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది.
ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మంచి మంచి
అవకాశాలు లభిస్తాయి. మార్పుల కోసం చేసే ప్రయత్నాలు
అనుకూలించగలవు. కోళ్ళ, మత్స్య, గొర్రెల వ్యాపారస్తులకు
వాతావరణంలో మార్పు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. చిన్నతరహా
పరిశ్రమల్లో వారికి, పాడి పరిశ్రమ రంగాల్లో వారికి ధనం ఎంత
వచ్చిన నిలబెట్టలేకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. పీచు,
ఫోం, లెదర్ వ్యాపారస్తులకు సదవకాశాలు లభిస్తాయి.
కాంట్రాక్టర్లకు ఒక అవకాశం చేతిదాకా వస్తుంది. ముఖ్యులలో
ఒకరికి వీడ్కోలు పలుకుతారు. ఐరన్, సిమెంట్, కలప
వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం. స్థిర, చరాస్తుల విషయంలో
ఒక నిర్ణయానికి వస్తారు. కిరణా, ఫ్యాన్సీ రంగాల్లో వారికి,
మందులు, రసాయనిక ద్రవ్య వ్యాపారస్తులకు సామాన్యంగా
ఉండగలదు. కంది, మినుము, నూనె వ్యాపారస్తులకు స్టాకిస్టులకు
సంతృప్తి, అభివృద్ధి కానవస్తుంది. భాగస్వామ్యుల మధ్య
నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ కళత్ర ఆరోగ్యం గురించి
ఆందోళన చెందుతారు. మీ కుటుంబీకుల సలహా, సహకారం బాగుగా
లభిస్తాయి. దైవకార్యాల్లో శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ
రాశివారు ప్రతి శనివారం 16సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేసి
తెల్లని పూలతో శనిని పూజించి, అర్చించినట్లైతే దోషాలు
తొలగిపోతాయి.
👫మకర0👫
ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు (భో,జా, జి),
శ్రవణం 1, 2, 3, 4 పాదములు (జూ,జె, జో, ఖ),
ధనిష్ఠ 1,2 పాదములు (గా,గి). ఆదాయం -8, వ్యయం-8,
పూజ్యత-7, అవమానం-2. 2016 సంవత్సరంలో మకర రాశివారికి
ఈ సంవత్సరం అంతా ద్వితీయము నందు కేతువు, అష్టమము నందు
రాహువు, ఆగష్టు 11 వరకు అష్టమము నందు బృహస్పతి, ఆ
తదుపరి అంతా భాగ్యము నందు, జనవరి 25 వరకు లాభము నందు
శని ఆ తదుపరి అంతా వ్యయము నందు సంచరిస్తారు.
''''''''అరక్షితం తిష్ఠతి దైవ రక్షితం'''''''' భగవంతుని కృప మీకు
ఉన్నందువల్ల ఎటువంటి సమస్యలు తలెత్తిన సునాయాసంగా
పరిష్కరించి తెలివితో ముందుకు సాగి మన్ననలు పొందగలుగుతారు.
ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించండి. ఆత్మీయులతో
కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగుల సమర్థతకు
మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. కొత్త వ్యాపారాల పట్ల
ఆసక్తి పెరుగుతుంది. అవివాహితులకు శుభదాయకం. స్త్రీలకు
మనోవాంఛలు నెరవేరిన ఏలినాటి శనిదోష ప్రభావం వల్ల
ఆరోగ్యంలో సమస్యలు తలెత్తవచ్చు మెళకువ అవసరం.
గృహంలో కొత్త సామగ్రి అమర్చుకుంటారు. వాహనం
నడుపుతున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
కాంట్రాక్టర్లు, బిల్డర్లు కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి.
ఆస్తి వ్యవహారాల్లో అవరోధాలు తొలగిపోతాయి. ప్లీడర్లకు
పురోభివృద్ధి, వైద్యులకు శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వంటి
చికాకులు తప్పవు. ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ
కార్యలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. రుణవిముక్తులు
కావటంతో పాటు కొత్త రుణాలకు మార్గం సుగమమవుతుంది. ఒక
వ్యవహారంలో సోదరుల మాటతీరు, నిర్లక్ష్యం ఆగ్రహం
కలిగిస్తాయి. వైద్య, ఇంజనీరింగ్, మెకానికల్ రంగాల వారికి
కలిసిరాగలదు. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి
పెరుగుతుంది. ప్రైవేట్ రంగాల్లో వారు ఒత్తిడి, ప్రలోభాలకు పోకుండా
ఏకాగ్రతతో వ్యవహరించవలసి ఉంటుంది. కోర్టు వ్యవహారాలు
వాయిదా పడటం మంచిది. స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు
చేస్తారు. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ
కళత్ర మొండివైఖరి మీకెంతో ఆందోళన కలిగిస్తుంది.
దూరప్రయాణాలకు సన్నాహాలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు
అనుకూలంగా ఉంటాయి. గృహంలో మార్పుల కోసం చేసే ప్రయత్నాలు
అనుకూలిస్తాయి. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు,
వ్యాపారులకు వేధింపులు అధికమవుతాయి. ఆడిట్, అక్కౌంట్స్ రంగాల
వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. ఉపాధ్యాయులకు బరువు
బాధ్యతలు అధికం అవుతాయి. మీ పట్టుదల, అంకితభావం
ఇతరులకు మార్గదర్శక మవుతుంది. వాతావరణంలో మార్పు వల్ల
ఆరోగ్యం మందగిస్తుంది. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్, చిరు
వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. శ్రీవారు, శ్రీమతి
గౌరవప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు చోటుచేసుకుంటాయి.
చిన్నతరహా పరిశ్రమల్లో వారికి కళాకారులకు, రచయితలకు
మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విలువైన వస్తు ఆభరణాలు
అమర్చుకుంటారు. సంగీత, సాహిత్య, కళా సదస్సులలో మంచి
గుర్తింపు లభిస్తుంది. ఇతరుల ప్రభావానికి లోనవుతారు.
అవివాహితులకు అనుకూలమైన కాలం. పండ్ల, పూల, కొబ్బరి, పానీయ
వ్యాపారస్తులకు సామాన్యమైన అభివృద్ధి ఉంటుంది. ఎదుటివారు
మిమ్మల్ని గుర్తించలేదన్న ఆరాటం అధికం అవుతుంది. కోళ్ళ,
మత్స్య వ్యాపారస్తులకు ఊహించని సమస్యలు
తలెత్తుతాయి. ఐరన్, సిమెంట్ వ్యాపారస్తులకు కలిసిరాగలదు.
ట్రాన్స్పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి ఒకడుగు
ముందుకువేస్తే పదడుగులు వెనకకు నెట్టబడతారు. కంప్యూటర్,
సాఫ్ట్వేర్ రంగాల్లో వారికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి.
మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలించగలవు. ప్రభుత్వ రంగ
సంస్థల్లో వారికి పనిభారం, ఒత్తిడి, పెరుగుతుంది. వ్యవసాయ,
తోటల రంగాల్లో వారికి నిరుత్సాహం అధికంగా ఉంటుంది. శ్రమకు తగిన
ప్రతిఫలం లేకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. స్టేషనరీ,
ప్రింటింగ్ రంగాల్లో వారికి మిశ్రమ ఫలితంగా ఉంటుంది.
శాస్త్రజ్ఞులకు, పరిశోధకులకు, పండితులకు వారివారి రంగాల్లో
గుర్తింపు పొందుతారు. రావలసిన ధనం సకాలంలో అందకపోవటం వల్ల
ఆందోళన తప్పదు. విదేశీ ప్రయాణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
భాగస్వామ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి.
విద్యాసంస్థల్లో వారికి ఒత్తిడి, పనిభారం పెరుగుతుంది.
ఉపాధ్యాయులు మార్పులకోసం చేసే ప్రయత్నాలు అనుకూలించవు.
2017 జనవరి నుంచి ఏలినాటి శనిదోషం ప్రారంభం అవటం వల్ల
ప్రతి శనివారం 19 సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేసి నీలపు
శంకుపూలతో శనిని పూజించి, అర్చించిన దోషాలు తొలగిపోతాయి.
👫కుంభం👫
ధనిష్ఠ 3, 4 పాదములు (గూ, గే), శతభిషం 1, 2, 3,

4 పాదములు (గో, సా, సీ, సూ), పూర్వాభాద్ర 1, 2, 3
పాదములు (సే, సో, దా), ఆదాయం - 8, వ్యయం - 8, పూజ్యత -
3, అవమానం - 5. ఈ రాశివారికి ఆగస్టు 11వ తేదీ వరకు
సప్తమము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా అష్టమము
నందు, జనవరి 25వ తేదీ వరకు రాజ్యము నందు శని, ఆ తదుపరి
అంతా లాభము నందు, ఈ సంవత్సరం అంతా జన్మమము నందు కేతువు,
సప్తమము నందు రాహువు సంచరిస్తారు. "సంకల్పం సగం బలం"
అన్నట్లుగా సంకల్పసిద్ధితో ముందుకు సాగి పాత సమస్యలను
పరిష్కరించండి. మీదికాని వస్తువును ఆశించడం వల్ల భంగపాటుకు
గురవుతారు. ఇతరులకు హామీలు, ధన సహాయ విషయంలో ఏకాగ్రత
వహించండి. వృత్తిపరంగా చికాకులు, సమస్యలు తలెత్తినా
ధైర్యంగా నిలదొక్కుకుంటారు. ఇప్పటివరకు మిమ్మల్ని
వ్యతిరేకించినవారు మీ సహాయ సహకారాలు అర్థిస్తారు.
ఆర్థిక వ్యవహారాల్లో పురోభివృద్ధి కానవచ్చిన ధనం ఏమాత్రం
నిల్వచేయలేక పోతారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, విశ్రాంతిలోపం
వంటి చికాకులు అధికమవుతాయి. వాణిజ్య ఒప్పందాలకు
అనుకూలమైన కాలం. సభలు సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో
పాల్గొంటారు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించగలవు.
చిన్నచిన్న విషయాలలో ఉద్రేకం మాని తెలివి తేటలతో
ముందుకుసాగి జయం పొందండి. స్థిరచరాస్తుల చర్చల విషయంలో
స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. చిన్నారుల విద్యా
విషయాల్లో శుభపరిణామాలు సంభవిస్తాయి. నూతన పెట్టుబడులు
ఆశించినంత సత్ఫలితాలను ఇవ్వవు. పాతమిత్రుల కలయికతో
మీలో కొత్త ఉత్సాహం, ఆలోచనలు స్ఫురిస్తాయి. స్త్రీలు
గృహసంబంధమైన, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రాజకీయ
నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. సోదరీసోదరుల
మధ్య విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత వహించండి.
ముఖ్యుల నుండి వార్తలు అందుకుంటారు. ఆనందకరమైన హృదయంతో
ఎలాంటి పనిలోనైనా విజయాన్ని సాధించవచ్చన్న వాస్తవాన్ని
గ్రహిస్తారు. రాబోయే కాలంలో ఖర్చులు, శ్రమ, ఒత్తిడికి
గురవుతారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. వైద్య రంగాల్లో
వారికి గుర్తింపు, ఆగస్టు నుండి అష్టమ గురుదోషం ఏర్పడుతున్న
మీ ఓర్పు, నేర్పు, సహనానికి పరీక్షా సమయం. కోర్టు
వ్యవహారాలలో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. మీ
జీవితభాగస్వామితో కలిసి సరదాగా విందు వినోదాలలో పాల్గొంటారు.
పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది.
కుటుంబ విషయాలపై దృష్టిసారిస్తారు. మిమ్మల్ని పొగిడేవారే
కానీ, సహకరించేవారు ఉండరు. మీ అభిరుచి ఆశయాలకు తగిన
వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు
అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు అధిక కృషి అవసరం. ఒక్కోసారి
మతిమరుపు పెరగడం వల్ల ఆందోళనకు గురవుతారు. పెద్దవారితోను,
పై అధికారులతోను సంభాషించేటపుడు జాగ్రత్త వహించండి. ఒక
అవసరానికి ఉంచిన ధన మరో ఖర్చుకు వినియోగించవలసి
వస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం
చేస్తున్నవాటిపైనే శ్రద్ధవహించండి. రాజకీయాలలో వారికి
గుర్తింపు, రాణింపు లభిస్తుంది. హోటలు, తినుబండ రంగాలలో వారికి
కలిసి రాగలదు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, మీడియా రంగాల్లో
వారికి, కళాకారులకు, రచయితలకు, జ్యోతిష్యులకు, పండితులకు
మంచి గుర్తింపు లభిస్తుంది. మార్పుల కోసం చేసే యత్నాలు
అనుకూలిస్తాయి. స్థిరాచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి
వస్తారు. పారిశ్రామిక రంగాల్లో వారికి పురోభివృద్ధి ఉంటుంది.
వాతావరణంలో మార్పు మీకెంతో చికాకు కలిగించగలదు. ఆహార
వ్యవహారాల్లో మెళకువ అవసరం. వైద్యులకు వృత్తుల పట్ల
ఆసక్తి అధికం అవుతుంది. ఆర్థిక విషయాల పట్ల అధిక
ఏకాగ్రత వహించడం వల్ల మాటపడవలసి వస్తుంది. ఏదైనా
అమ్మాలనే ఆలోచన క్రియారూపం దాల్చగలదు. స్త్రీలకు కాళ్ళు,
నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికం అవుతాయి. ఉచిత
సలహా ఇవ్వడం వల్ల మాటపడక తప్పదు. మందులు,
రసాయనిక, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు సంతృప్తి,
అభివృద్ధి కానవస్తుంది. టీచింగ్ రంగాల్లో వారికి గుర్తింపు, రాణింపు
లభిస్తుంది. ఇతరులు మీ ప్రభావానికి లోనవుతారు. ఇతరులు మీ
సహాయ సహకారాలు అర్థిస్తారు. వాహన చోదకులకు మెళకువ
అవసరం. పారిశ్రామిక రంగాల్లో వారికి ఆదాయపన్ను వంటి
సమస్యలు అధికం ఆవుతాయి. రియల్ ఎస్టేట్
వ్యాపారస్తులకు ఒత్తిడి, చికాకు తప్పదు. వస్త్ర, బంగారు, వెండి
లోహ వ్యాపారస్తులకు ఆశాజనకం. పండ్ల, పూల, కొబ్బరి
వ్యాపారస్తులకు అనుకున్నంత సంతృప్తి ఉండజాలదు. పౌరోహితులకు
వృత్తుల్లో వారికి ఆగస్టు నుంచి శుభదాయకంగా ఉంటుంద.      


👫మీనం👫
పూర్వాభద్ర 4 పాదం (ట), ఉత్తరాభద్ర 1, 2, 3
4 పాదం (దూ, ఞ, ఝ, థా), రేవతి 1, 2, 3 4 పాదం
(దే, దో, చా, చి). ఆదాయం - 5, వ్యయం -14, పూజ్యత - 6,
అవమానం - 5. 2016 మీనరాశి వారికి ఆగస్టు 11 వరకు
షష్టమము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా సప్తమము
నందు, ఈ సంవత్సరం అంతా షష్టమము నందు రాహువు, వ్యయము
నందు కేతువు. జనవరి 25వ తేదీ వరకు భాగ్యము నందు శని, ఆ
తదుపరి అంతా రాజ్యము నందు సంచరిస్తారు. "తలదేవ లభతే
భద్రే కర్తా కర్మజ మాత్మనః" పుణ్య అయినా పాపం
అయినా మీ ఏ కర్మ చేస్తారో దాన్ని ఫలితాన్ని తప్పకుండా
పొందవలసి ఉంటుంది. మీ భావనలు, ఆలోచనలు సద్బుద్ధితో క్రియా
రూపంలో పెట్టి జయం పొందండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా
వేసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు నిరుత్సాహ పరుచుకుంటున్నారు.
మీలో ఒక అతీత శక్తి, దైవబలం ఉన్నదని గమనించి
ముందుకుసాగిపోండి. అప్పుడప్పుడు ఆరోగ్యంలో సమస్యలు
తలెత్తిన గురుబలం వల్ల అవి తప్పిపోతాయి. మీ మంచిమాట
తీరువల్ల బంధుమిత్రుల ఆదరాభిమానాలు పొందగలుగుతారు.
ఉద్యోగస్తులు అధికారుల నుంచి ఊహించని ఒత్తిడి, చికాకులు
ఎదుర్కొంటారు. ఏకాంతంగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు.
క్రయ, విక్రయదార్లకు అనుకూలంగా ఉండును. రచయితలకు
పత్రికా రంగంలోని వారికి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.
పారిశ్రామిక రంగంలోనివారికి అనువైన పరిస్థితులు ఏర్పడగలవు.
నూతన పరిచయాలు విస్తరిస్తాయి. మిత్రుల కారణంగా మీ
కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన
పెరుగును. విదేశాలు వెళ్లే ప్రయత్నాలు ఫలిస్తాయి. పీచు, ఫోమ్,
లెదర్, చిన్నతరహా పరిశ్రమల వారికి పురోభివృద్ధి. బ్యాంకింగ్,
చిట్స్ ఫైనాన్స్ రంగాల వారికి బకాయిల వసూలు విషయంలో
సమస్యలు తప్పవు. స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ
ఆలోచన కొంతకాలం వాయిదా వేయడం మంచిది. కూర, పండ్లు, పూల
వ్యాపారస్తులకు జయం చేకూరగలదు. ప్రయాణాలలో వస్తువుల
జారవిడుచుకునే ఆస్కారం ఉంది. ప్లీడరు, ప్లీడరు గుమస్తాలకు
ప్రోత్సాహం కానరాగలదు. గృహోపకరణాలు, నూనె, ఎండుమిర్చి,
పసువు, చింతపండు, పచ్చళ్ళవ్యాపారులకు పురోభివృద్ధి. సంఘంలో
పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. మీ సంతానం భవిష్యత్ కోసం
కొత్తకొత్త పథకాలు రూపొందిస్తారు. కోర్టు వ్యవహారాలు, పాత
సమస్యలు నిరుత్సాహపరుస్తాయి. కీలకమైన వ్యవహారాల్లో
పెద్దల సలహా పాటించడం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతాల
నుండి సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలు, టీవీ, ఛానల్స్
కార్యక్రమాలలో రాణిస్తారు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా
పడతాయి. ఖర్చులు, రాబడికి మించి అధికంగా ఉంటాయి. వస్త్ర
వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం
శ్రేయస్కరం. మీ కుటుంబీకులు చెప్పకుండా కొన్ని రహస్యాలు
దాచినందుకు కలహాలు తప్పవు. మీరు అభిమానించే వ్యక్తులను
కలుసుకుంటారు. స్పెక్యులేషన్ లాభదాయకం. మిర్చి, నూనె, కంది,
మినుము స్టాకిస్టులకు పురోభివృద్ధి ఉంటుంది. వైద్య రంగాల్లో
వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కొంతమంది మీమీద అపవాదులు
వేయడానికి ప్రయత్నిస్తారు జాగ్రత్త వహించండి. ఆడిటర్లకు
ఆశాజనకంగా ఉంటుంది. బ్యూటీపార్లర్, మందులు, రసాయన, సుగంధ
ద్రవ్య వ్యాపారస్తులకు సామాన్యమైన అభివృద్ధి ఉంటుంది.
మిమ్మల్ని మీరు చూసి అసూయపడే వారు అధికం అవుతున్నారని
గమనించండి. వస్త్ర వ్యాపారస్తులకు చోరుల వల్ల
సమస్యలు తలెత్తుతాయి. బంగారం, వెండి, లోహ
వ్యాపారస్తులకు సామాన్యంగా ఉండగలదు. ఏజెంట్లకు,
బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు నెమ్మెదిగా
పురోభివృద్ధి కానవస్తుంది. రాజకీయాల్లో వారికి గుర్తింపు, రాణింపు
లభిస్తుంది. సభలు, సమావేశాలు, దైవకార్యక్రమాల్లో చురుగ్గా
పాల్గొంటారు. ఈ సంవత్సరం ద్వితీయ భాగం నుంచి సత్కాల అని
చెప్పవొచ్చు. ఇతరుల ఆంతరంగిత విషయాల్లో తలదూర్చి
సమస్యలకు గురికాకండి. విద్యార్థులలో నూతనోత్తేజం
కానవస్తుంది. విద్యార్థినులు తొందరపాటు నిర్ణయాల వల్ల
సమస్యలు ఎదుర్కొంటారు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త
వహించండి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి యోగదాయకం.
ముఖ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఇచ్చిపుచ్చుకునే
వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. పరిశోధకులకు, పండితులకు,
శాస్త్రజ్ఞులకు, జ్యోతిష్కులకు, పౌరోహితులకు వారివారి రంగాల్లో
వారి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ కళత్ర
మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. గృహంలో సందడి
కానరాగలదు. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు

0 comments:

Post a Comment

  • VIDEOS
  • PHOTOS
  • NEWS UPDATE