How To Create a Website

Mana Manthani web site కు విచ్చేస్తున్న Manthanites కి స్వాగతం సుస్వాగతం మరియు మరియు శుభాకాంక్షలు .. , No. 9246575261

వరలక్ష్మీ వ్రతకల్పము


 













వరలక్ష్మీ వ్రతకల్పము

పూజా సామగ్రి:


పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, తమలపాకులు, అగరువత్తులు, వక్కలు, కర్పూరం, గంధం, అక్షింతలు, కొబ్బరికాయలు, కలశము, కలశ వస్త్రము (రవికల గుడ్డ).


అమ్మవారి ప్రతిమ లేక విగ్రహము


పంచామృతములు: ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవునెయ్యి, తేనె, పంచదార


తోరము: తొమ్మిది ముడులు వేసిన తోరము. దారానికి పసుపు రాసి ఒక్కొక్క పూవు పెట్టి ఒక్కొక్క ముడి వేయవలెను. తొమ్మిది తోరములు కావాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి మీకు, మిగతావి ముత్తయిదువలకు.


పసుపు ముద్దతో వినాయకుడిని చేయవలెను. ఒక పీటమీద కొద్దిగా బియ్యము పరచి, పూర్ణకుంభంలో (వెండి/ఇత్తడి/రాగి/కంచు చెంబులో) కొత్త బియ్యము వేసి, మర్రియిగుళ్ళు గాని, మామిడి ఆకులు గాని, అవి దొరకకపోతే తమలపాకులు గానీ వేసి, ఆ కుంభం మీద కొత్త రవికల గుడ్డ చుట్టిన కొబ్బరికాయ ఉంచి దానిని పీట మీద మధ్యగా ఉంచి, పూజకు సిద్ధం చేయాలి.


పూజావిధానం:


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే!!


దీపము వెలిగించాలి.


ఆచమ్య:


కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోరాయనమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః..


శ్లో!! ఉత్తిష్ఠిన్తు భూతపిశాచాః యేతేభూమి భారకాః!

ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే!!


(అని అక్షతలు వాసన చూచి తమ యెడమప్రక్కన పడవేయవలెను.)

 మమ ఉపాత్త దురితయక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరీ ముద్దిశ్య శ్రీ పరమేశ్వరీ ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగాగోదావర్యోర్మధ్య ప్రదేశే...సమస దేవతా బ్రాహ్మణ హరిహ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన .......సంవత్సరే ....ఆయనే.....ఋతౌ...మాసే.....పక్షే....తిథౌ.....వాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిధ్యార్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్ధం, సత్సంతాన సౌభాగ్య శుభఫలావాప్త్యర్థం శ్రీ వరలక్ష్మీ ముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ ప్రీత్యర్థం యావచ్ఛక్తి, ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే! తదంగత్వేన కలశపూజాం కరిష్యే!


అని సంకల్పము చేసి కలశమునకు గంధాక్షతలు పెట్టి, పుష్పమును కలశములో నుంచి, చేతితో కలశమును మూసి ఈ క్రింది శ్లోకమును చదువవలెను.


శ్లో!!కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః

మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణాః స్మృతాః!!

కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా!

ఋగ్వేదోధయజుర్వేదః, సామవేదోహ్యధర్వణః!

అజ్గైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః!

ఆయాంతు శ్రీ వరలక్ష్మీ పూజార్థం దురితక్షయకారకాః

గంగేచ, యమునేచైవ గోదావరి సరస్వతీ!

నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు!!

 కలశోదకేన దేవమాత్మానాం, పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య!!


(కలశములోని ఉదకమును పుష్పముతో దేవునిపైన, తమ పైన, పూజాద్రవ్యములపైన చల్లవలెను.)


కళ్యాణీ కమలనిలయే కామితార్థ ప్రదాయినీ!

యావత్త్వాం పూజయిష్యామి శుభదే సుస్థిరోభవ!!


(అని ప్రార్థిమ్చి దేవునిపై పుష్పము నుంచవలెను)


అథ ధ్యానమ్:


పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే!

నారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవ సర్వదా!!

క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే!

సుస్థిరో భవమే గేహే సురాసుర నమస్కృతే!!

లక్ష్మీంక్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం!

దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం!

శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం!

త్వామ్ త్రైలోక్య కుటుంబినీం సరసిజామ్ వందే ముకుంద ప్రియామ్!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ధ్యాయామి!


ఆవాహనం:


సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయే!

ఆవాహయామి దేవీత్వామ్ సుప్రీతా భవసర్వదా!!

శ్రీ వరలక్ష్మీ  దేవతాయై నమః, ఆవాహయామి!


ఆసనమ్:


సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే!

సింహాసనమిదం దేవీ గృహ్యతాం సురపూజితే!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, రత్నఖచిత సింహాసనం సమర్పయామి.


పాద్యమ్:


సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవమ్!

పాద్యం గృహాణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, పాదయోః పాద్యం సమర్పయామి!


అర్ఘ్యమ్:


శుద్ధోదకమ్ చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితమ్!

అర్ఘ్యం దాస్యామి తే దేవీ గృహాణ సురపూజితే!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః,హస్తయోః అర్ఘ్యం సమర్పయామి!


ఆచమనీయం:


సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతమ్!

గృహానాచమనం దేవీ మయాదత్తం శుభప్రదే!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ముఖే ఆచమనీయం సమర్పయామి


పంచామృత స్నానం:


పయోదధి ఘృతోపేతం శర్కరా మధుసంయుతమ్!

పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః,  పంచామృత స్నానం సమర్పయామి


శుద్ధోదక స్నానం:


గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితమ్!

శుద్ధోదక స్నానమిదం గృహాన హరివల్లభే!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, శుద్ధోదక స్నానం సమర్పయామి


వస్త్రం:


సురార్చితాంఘ్రి యుగళేదుకూల వసనప్రియే!

వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాన భువనేశ్వరీ!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, వస్త్రయుగ్మం సమర్పయామి


యజ్ఞోపవీతం:


తప్తహేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితమ్!

ఉపవీతమిదం దేవీ గృహాణ త్వం శుభంకరీ!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, యజ్ఞోపవీతం సమర్పయామి


గంధం:


కర్పూరాగరు కస్తూరీ రోచనాదిభిరన్వితమ్!

గంధం దాస్యామ్యహం దేవీ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, గంధం విలేపయామి


అక్షతలు:


అక్షతాన్ ధవళాన్ దేవీ శాలీయాన్ తండులాన్ శుభాన్!

హరిద్రాకుంకుమోపేతం గృహ్యతామబ్ధిపుత్రికే!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, అక్షతాన్ సమర్పయామి


ఆభరణం:


కేయూర కంకణే దివ్యే హారనూపుర మేఖలాః!

విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషిపూజితే!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ఆభరణాని సమర్పయామి


పుష్పం:


మల్లికాజాజి కుసుమైః చంపకైర్వకుళైస్తథా!

శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, పుష్పైః పూజయామి


అథాంగపూజా!

ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి

ఓం చపలాయై నమః జానునీ పూజయామి

ఓం పీతాంబదధరాయై నమః ఊరుం పూజయామి

ఓం కమలవసిన్యై నమః కటిం పూజయామి

ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి

ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి

ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి

ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి

ఓం సునాసికాయై నమః నాసికాం పూజయామి

ఓం సుముఖ్యై నమః ముఖం పూజయామి

ఓం శ్రియై నమః ఓష్ఠౌ పూజయామి

ఓం సునేత్రే నమః నేత్రం పూజయామి

ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి

ఓం కమలాయై నమః శిరః పూజయామి

ఓం వరలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి

శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్థం అష్టోత్తర శతనామ పూజాం కరిష్యే

అని సంకల్పము చేసి అష్టోత్తర నామపూజ పసుపు కుంకుమలతో గాని, పుష్పములతో గానీ చేయవలెను.


శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః


ఓం ప్రకృత్యై నమః

ఓం వికృత్యై నమః

ఓం విద్యాయై నమః

ఓం సర్వభూతహితప్రదాయై నమః

ఓం శ్రద్ధాయై నమః

ఓం విభూత్యై నమః

ఓం సురభ్యై నమః

ఓం పరమాత్మికాయై నమః

ఓం వాచే నమః

ఓం పద్మాలయాయై నమః (10)


ఓం పద్మాయై నమః

ఓం శుచ్యై నమః

ఓం స్వాహాయై నమః

ఓం స్వధాయై నమః

ఓం సుధాయై నమః

ఓం ధన్యాయై నమః

ఓం హిరణ్మయ్యై నమః

ఓం లక్ష్మ్యై నమః

ఓం నిత్యపుష్టాయై నమః

ఓం విభావర్యై నమః (20)


ఓం అదిత్యై నమః

ఓం దిత్యై నమః

ఓం దీప్తాయై నమః

ఓం వసుధాయై నమః

ఓం వసుధారిణ్యై నమః

ఓం కమలాయై నమః

ఓం కాంతాయై నమః

ఓం కామాక్ష్యై నమః

ఓం క్రోధసంభవాయై నమః

ఓం అనుగ్రహపరాయై నమః (30)


ఓం ఋద్ధయే నమః

ఓం అనఘాయై నమః

ఓం హరివల్లభాయై నమః

ఓం అశోకాయై నమః

ఓం అమృతాయై నమః

ఓం దీప్తాయై నమః

ఓం లోకశోక వినాశిన్యై నమః

ఓం ధర్మనిలయాయై నమః

ఓం కరుణాయై నమః

ఓం లోకమాత్రే నమః (40)


ఓం పద్మప్రియాయై నమః

ఓం పద్మహస్తాయై నమః

ఓం పద్మాక్ష్యై నమః

ఓం పద్మసుందర్యై నమః

ఓం పద్మోద్భవాయై నమః

ఓం పద్మముఖ్యై నమః

ఓం పద్మనాభప్రియాయై నమః

ఓం రమాయై నమః

ఓం పద్మమాలాధరాయై నమః

ఓం దేవ్యై నమః (50)


ఓం పద్మిన్యై నమః

ఓం పద్మగంథిన్యై నమః

ఓం పుణ్యగంధాయై నమః

ఓం సుప్రసన్నాయై నమః

ఓం ప్రసాదాభిముఖ్యై నమః

ఓం ప్రభాయై నమః

ఓం చంద్రవదనాయై నమః

ఓం చంద్రాయై నమః

ఓం చంద్రసహోదర్యై నమః

ఓం చతుర్భుజాయై నమః (60)


ఓం చంద్రరూపాయై నమః

ఓం ఇందిరాయై నమః

ఓం ఇందుశీతులాయై నమః

ఓం ఆహ్లోదజనన్యై నమః

ఓం పుష్ట్యై నమః

ఓం శివాయై నమః

ఓం శివకర్యై నమః

ఓం సత్యై నమః

ఓం విమలాయై నమః

ఓం విశ్వజనన్యై నమః (70)


ఓం తుష్ట్యై నమః

ఓం దారిద్ర్య నాశిన్యై నమః

ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః

ఓం శాంతాయై నమః

ఓం శుక్లమాల్యాంబరాయై నమః

ఓం శ్రియై నమః

ఓం భాస్కర్యై నమః

ఓం బిల్వనిలయాయై నమః

ఓం వరారోహాయై నమః

ఓం యశస్విన్యై నమః (80)


ఓం వసుంధరాయై నమః

ఓం ఉదారాంగాయై నమః

ఓం హరిణ్యై నమః

ఓం హేమమాలిన్యై నమః

ఓం ధనధాన్య కర్యై నమః

ఓం సిద్ధయే నమః

ఓం స్త్రైణ సౌమ్యాయై నమః

ఓం శుభప్రదాయై నమః

ఓం నృపవేశ్మ గతానందాయై నమః

ఓం వరలక్ష్మ్యై నమః (90)


ఓం వసుప్రదాయై నమః

ఓం శుభాయై నమః

ఓం హిరణ్యప్రాకారాయై నమః

ఓం సముద్ర తనయాయై నమః

ఓం జయాయై నమః

ఓం మంగళాయై నమః

ఓం దేవ్యై నమః

ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః

ఓం విష్ణుపత్న్యై నమః

ఓం ప్రసన్నాక్ష్యై నమః (100)


ఓం నారాయణ సమాశ్రితాయై నమః

ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః

ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః

ఓం నవదుర్గాయై నమః

ఓం మహాకాళ్యై నమః

ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః

ఓం త్రికాల ఙ్ఞాన సంపన్నాయై నమః

ఓం భువనేశ్వర్యై నమః (108)


శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి


దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరమ్!

ధూపం దాస్యామి దేవేశీ గృహ్యతాం పుణ్యగంధినీ!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ధూపమాఘ్రాపయామి


అగరువత్తి వెలిగించి ధూపము చూపవలెను


ఘృతాక్తవర్తి సంయుక్తం అంధకార వినాశకమ్!

దీపం దాస్యామి తేదేవీ గృహాణ ముదితోభవ!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః,  దీపం దర్శయామి


(దీపము చూపవలెను)


నైవేద్యం షడ్రసోపేతం దధిమద్వాజ్య సంయుతం!

నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే!!


శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, నైవేద్యం సమర్పయామి


నివేదనము చేసి నీటిని వదలవలెను.


పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతమ్!

కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, తాంబూలం సమర్పయామి

నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితమ్!

తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహ్యతాం విష్ణువల్లభే!!


శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః,  అనందమంగళ నీరాజనం సందర్శయామి


నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి

పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే

నారాయణ ప్రియే దేవీ సుప్రీతో భవసర్వదా!!


శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః,మంత్రపుష్పాణి సమర్పయామి

పుష్పము అక్షతలు ఉంచవలెను


యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ!

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే!!


శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః,  ప్రదక్షిణం సమర్పయామి


పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ

త్రాహిమాం కృపయాదేవీ శరణాగత వత్సలే!!

అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమ్ మమ!

తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష జనార్దనీ!!

నమస్త్రైలోక్య జననీ నమస్తే విష్ణు వల్లభే

పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ నమోనమః!!


శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః,  నమస్కారాన్ సమర్పయామి


తోరగ్రంథి పూజా!


ఓం కమలాయై నమః  - ప్రథమ గ్రంథిం పూజయామి

రమాయై నమః - ద్వితీయ గ్రంథిం పూజయామి

లోకమాత్రే నమః - తృతీయ గ్రంథిం పూజయామి

విశ్వజనన్యై నమః - చతుర్థ గ్రంథిం పూజయామి

వరలక్ష్మీ నమః - పంచమ గ్రంథిం పూజయామి

క్షీరాబ్ధి తనయాయై నమః - షష్ఠమ గ్రంథిం పూజయామి

విశ్వసాక్షిణ్యై నమః - సప్తమ గ్రంథిం పూజయామి

చంద్ర సహోదర్యై నమః - అష్టమగ్రంథిం పూజయామి

వరలక్ష్మ్యై నమః - నవమ గ్రంథిం పూజయామి


ఈ క్రింది శ్లోకము చదువుతూ తోరము కట్టుకొనవలెను.


శ్లో!! బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం

పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే


వరలక్ష్మీ వ్రత కథ

సూత పౌరాణికుండు శౌనకుడు మొదలగు మహర్షులను జూచి యిట్లనియె – మునివర్యులారా! స్త్రీలకు సర్వ సౌభాగ్యములు గలుగునట్టి యొక వ్రతరాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి జెప్పె దానిం చెప్పెద వినుండు, కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిమయ ఖచితంబగు సింహాసనంబునందు పరమేశ్వరుడు కూర్చుండి యుండ పార్వతి పరమేశ్వరునకు నమస్కరించి దేవా! లోకమున స్త్రీలు యే వ్రతం బొనర్చిన సర్వ సౌభాగ్యంబులు, పుత్ర పౌత్రాదులం గలిగి సుఖంబుగ నుందురో అట్టి వ్రతం నా కానతీయవలయు” ననిన పరమేశ్వరుండిట్లనియె. ఓ మనోహరీ! స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులు గలుగంజేయం వరలక్ష్మీ వ్రతంబను నొక వ్రతంబు గలదు. ఆ వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగ వచ్చెడి శుక్రవారము నాడు జేయవలయుననిన పార్వతీదేవి యిట్లనియె. ఓ లోకారాధ్యా! నీ వానతిచ్చిన వరలక్ష్మీ వ్రతంబు నెట్లు చేయవలెను? ఆ వ్రతంబునకు విధియేమి? ఏ దేవతను పూజింపవలయును? పూర్వం బెవ్వరిచే నీ వ్రతంబాచరింపబడియె? దీనినెల్ల వివరంబుగా వివరింపవలయునని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి ఓ కాత్యాయనీ! వరలక్ష్మీ వ్రతమును సవిస్తరముగ జెప్పెద వినుము. మగధ దేశంబున కుండినంబను నొక పట్టణము గలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారముల తోడను, బంగారు గోడలు గల యిండ్లతోనూ గూడియుండెను. అట్టి పట్టణము నందు చారుమతి యనునొక బ్రాహ్మణ స్త్రీ గలదు. ఆ వనితామణి భర్తను దేవునితో సమానముగ దలచి ప్రతి దినంబును ఉదయంబున మేల్కాంచి స్నానంబుచేసి పుష్పంబులచే భర్తకు పూజచేసి పిదప అత్తమామలకు ననేక విధంబులైన యుపచారంబులను చేసియు ఇంటి పనులను జేసికొని మితముగా ప్రియముగాను భాషించుచుండెను. ఇట్లుండ అమ్మహా పతివ్రతయందు వరలక్ష్మికి అనుగ్రహము గలిగి యొకనాడు స్వప్నంబున ప్రసన్నమై “ఓ చారుమతీ, నేను వరలక్ష్మీ దేవిని. నీయందు నాకు అనుగ్రహము గలిగి ప్రత్యక్షమైతిని. –శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చెడి శుక్రవారమునాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబులు నిచ్చెదనని వచించిన చారుమతీ దేవి స్వప్నములోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి ‘నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే!

శరణ్యే త్రిజగద్వంద్వే విష్ణు వక్షస్థలాలయే!! అని అనేక విధంబుల స్తోత్రము చేసి ఓ జగజ్జననీ! నీ కటాక్షంబు కలిగెనేని జనులు ధన్యులుగను, విద్వాంసులుగను సకల సంపన్నులు గను నయ్యెదరు. నేను జన్మాంతరంబున జేసిన పుణ్య విశేషమున మీ పాదదర్శనము నాకు గలిగినదని జెప్పిన వరలక్ష్మీ సంతోషంబు జెంది, చారుమతికి ననేక వరములిచ్చి యంతర్థానంబు నొంద చారుమతి తక్షణంబున నిదుర మేల్కొని యింటికి నాలుగు ప్రక్కలం జూచి వరలక్ష్మీ దేవిని గానక ఓహో! మనము కలగంటిమని స్వప్న వృత్తాంతము భర్తకు మామగారికి మొదలయిన వాండ్రతో జెప్పగా వారు ఈ స్వప్నము మిగుల ఉత్తమమయినదని శ్రావణ మాసంబు వచ్చినతోడనే వరలక్ష్మీ వ్రతం బావశ్యంబుగ జేయవలసిందని జెప్పిరి.


చారుమతి స్వప్నంబు విన్న స్త్రీలును శ్రావణమాసం ఎప్పుడు వచ్చునాయని ఎదురు చూచుచుండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందు వచ్చెడి శుక్రవారము వచ్చెను. అంత చారుమతియు మొదలగు స్త్రీలందరును ఈ దినంబే గదా వరలక్ష్మీ దేవి చెప్పిన దినంబని యుదయంబుననే మేల్కాంచి స్నానాదుల జేసి చిత్ర వస్త్రంబులను గట్టుకొని చారుమతీదేవి గృహంబున నొక ప్రదేశమునందు గోమయంబుచే నలికి మంటపం బేర్పరచి యందొక ఆసనంబువైచి దానిపై కొత్తబియ్యం బోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచపల్లవంబులచేత కలశంబేర్పరచి యందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలంబున “పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే! నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవసర్వదా!!” అను శ్లోకముచే ధ్యానావాహనాది షోడశోపచార పూజలం చేసి తొమ్మిది సూత్రములు గల తోరంబును దక్షిణహస్తమునకు గట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను నివేదన జేసి ప్రదక్షిణము జేసిరి. ఇట్లొక ప్రదక్షిణము జేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు ఘల్లుఘల్లుమను నొక శబ్దము కలిగెను. అంత కాళ్ళకు జూచుకొనిన గజ్జెలు మొదలగు నాభరణములు కలిగియుండ చారుమతి మొదలగు స్త్రీలందరునూ ఓహో! వరలక్ష్మీదేవి కటాక్షం వలన గల్గినవని పరమానందంబు నొంది మరియొక్క ప్రదక్షిణంబు జేయగా హస్తములందు దగద్ధగాయమానంబుగా మెరయుచుండ నవరత్న ఖచితంబులైన నాభరణములుండుట గనిరి. ఇంక చెప్పనేల మూడవ ప్రదక్షిణంబు గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి. చారుమతి మొదలగు నా స్త్రీల గృహంబులెల్ల స్వర్ణమయంబులై రథ గజ తురగ వాహనములతో నిండియుండెను. అంత నా స్త్రీలను దోడ్కొని గృహంబులకు పోవుటకు వారి వారి యిండ్లనుండి గుర్రములు, ఏనుగులు, రథములు బండ్లును నా స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించి స్థలమునకు వచ్చి నిలిచియుండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్తప్రకారముగా పూజచేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి పండ్రెండు కుడుములు వాయన దానం ఇచ్చి దక్షిణ తాంబూలము లొసంగి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే నాశీర్వాదంబు నొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసి భక్ష్యాదులను బంధువులతో నెల్లరను భుజించి తమకొరకు వచ్చి కాచుకొని యుండు వాహనములపై యిండ్లకు బోవుచు ఒకరితో నొకరు ఓహో! చారుమతీదేవి భాగ్యంబేమని చెప్పవచ్చు. వరలక్ష్మీదేవి తనంతట స్వప్నములోకి వచ్చి ప్రత్యక్షం బాయెను. ఆ చారుమతీదేవి వలన కదా మనకిట్టి మహాభాగ్యం, సంపత్తులు గలిగెనని చారుమతీ దేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ యిండ్లకు బోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరంబును నీ వ్రతంబును చేయుచు పుత్రపౌత్రాభివృద్ధి గలిగి, ధనకనక వస్తు వాహనములతోడ గూడుకొని సుఖంబుగా నుండిరి. కావున ఓ పార్వతీ! యీ యుత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారును చేయవచ్చును. అట్లొనర్చిన సర్వ సౌభాగ్యంబులను గలిగి సుఖంబుగ నుందురు. ఈ కథను వినువారలకును, చదువు వారలకును వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును.


వాయన దానము:


శ్లో!! ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః!

దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హిద్విజాతయే!!


శ్లో!! ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరావై దదాతిచ

ఇందిరా తారకో బాభ్యాం ఇందిరాయై నమోనమః!!

0 comments:

Post a Comment

  • VIDEOS
  • PHOTOS
  • NEWS UPDATE