How To Create a Website

Mana Manthani web site కు విచ్చేస్తున్న Manthanites కి స్వాగతం సుస్వాగతం మరియు మరియు శుభాకాంక్షలు .. , No. 9246575261

మంథని చరిత్ర

 మంథని చరిత్ర (అవధానుల ప్రసాద్ )


శివ పురాణంలో ఓ కథనం ప్రకారం, ఒకానొకప్పుడు దండకారణ్యంలో నీటి ఎద్దడి ఏర్పడింది. సమీపంలోని ఋషిల కోరిక మేరకు గౌతమ మహర్షి వరుణుడిని ప్రసన్నున్ని చేసుకుని ఆయన అనుగ్రహంతో తన ఆశ్రమంవద్ద ఓ మడుగుని నిర్మింపజేశాడు. వరుణుడి కృపవలన ఆ మడుగులో ఎప్పుడూ నీళ్ళుండేవి. అప్పటికింకా గోదావరీ నది ఆవిర్భావం కాలేదు, గోదావరీ నదీ గర్భంలో ఈ శాఖ మడుగు నేటికీ చూడవచ్చు.కాలక్రమేణా నీటి కొరతలేని గౌతమ ఆశ్రమంలో ఎందరెందరో ఋషులు చేరడం మొదలైనది. ఓ సందర్భంలో మహర్షి శిష్యులలో ఒకరు గురువుగారి పూజార్థమై నీళ్ళు తేవడానికి వెళ్ళి మడుగులో ఋషిపత్నులు స్నానంచేస్తున్న కారణంగా నీళ్ళు తేలేకపోగా, గౌతమ మహర్షి భార్య అహల్యాదేవి స్వయంగా వెళ్ళి భర్త పూజకవసరమయ్యే నీళ్ళు తీసుకొచ్చింది. అయితే ఆమె అలా స్నానంచేస్తున్న ఋషి పత్నులను లెక్కచేయకుండా నీళ్ళు తీసుకోవడం కొందరు ఋషిపత్నులకి అవమానంగా తోచింది. వారి ఫిర్యాదు మేరకు కొందరు ఋషులు విఘ్నేశ్వరుడివద్దకి వెళ్ళి గౌతమ ఋషి ఆధిపత్యాన్ని సహించబోమని, ఆయనకెలాగైనా తెలిసివచ్చేలా చేయాలని అర్థింపసాగారు. గౌతముడి నిర్థోషిత్వాన్ని గురించి ఋషులకు సర్ది చెప్పడంలో విఫలుడయిన విఘ్నేశ్వరుడు ఋషులందరినీ శాంతపరచే ఉద్దేశ్యంతోనూ, లోకకళ్యాణార్థం ఒక చిన్న సంఘటన కల్పించాడు.విఘ్నేశ్వరుడు ఓ గోవురూపంలో గౌతముడి పంటచేలలో ప్రవేశించాడు, ఆ ఆవుని పొలమ్నుంచి బయటికి పంపే ఉద్దేశ్యంతో చేతికందిన గడ్డి పరకలు దానిపైకి విసిరి బెదిరించాడు, ఆ గడ్డి పరకలే శూలాలైనట్టు గోవు విలవిలాడి అక్కడే ప్రాణాలు విడుస్తుంది గోవు. గోహత్యా పాపం గౌతముడు చేశాడని ఆశ్రమం వదిలి వెళ్ళాల్సిందిగా ఋషులందరూ కోరతారు. గౌతముడు తన దివ్య దృష్టిద్వారా జరిగింది తెలుసుకుని, బ్రహ్మదేవుడు తన ద్వారా తలపెట్టిన "గోదావరీ ఆవిర్భావం"లో తన పాత్ర నిర్వహించడానికి ఆశ్రమం వీడి పశ్చిమంగా పయనించి "త్రయంబక" క్షేత్రంలో పరమశివుడిగురించి తపస్సు చేసి ఆయనను ప్రసన్నం చేసుకొని తనకంటిన గోహత్యాపాతకం నుంచి విముక్తి లభించేందుకని గంగని తనతో పంపమని, సదా తన ఆశ్రమంలో పూజలందుకొమ్మని వరాలడిగాడు. ఆయన కోరినట్లే శివుడు తన జటాజూటాల్లోనుంచి గంగను విడిచి గౌతముడి వెంట ఆయన కూతురు గౌతమిగా పంపాడు. గౌతముడు సాక్షాత్తు గంగాదేవిని తన కూతురు గౌతమిగా వెంటతీసుకురాగ అమె జలాల స్పర్షతోనే చచ్చిపోయిన గోవు మళ్ళీ బ్రతుకుతుంది. దాంతో గౌతముడి "గోహత్యా పాతకం" తొలగిపోతుంది. దానితోబాటే దండకారణ్య ప్రాంతంలోని జనులకు శాశ్వత జలస్రోతంగా "జీవనది" గోదావరి లభ్యమయ్యింది. ఆ మీదట గౌతముడికిచ్చిన వరాన్ని పూర్తిచేస్తూ శివుడుకూడా ఈ గోదావరీ తీరంలో "గౌతమేశ్వరుడుగా" వెలిశాడు. నేటికీ మంథనిలో గోదావరీ తీరంపై "గౌతమేశ్వర" ఆలయం ఉంది. ఈ గౌతమేశ్వరుడే నేటికీ కూడా ప్రథమారాధ్యుడై పూజింపబడుతున్నాడు.ఆది శంకరులవారి సంపూర్ణ భారత యాత్రలో భాగంగా ఆయన క్రీ.పూ. 6వ శతాబ్ధంలో "మంత్రకూటం" సందర్శించినట్లుగానూ అక్కడి వైదికుల సంస్కృతినీ, పాండిత్యాన్ని మెచ్చుకున్నట్లుగానూ ఆయన యాత్రావిశాషాలను గురించి ద్వారకాపీఠంలోనూ, పుష్పగిరిపీఠంలోనూ స్థాపించబడిన శిలాఫలకాలు తెలుపుతాయి. స్థానికుడైన "కాశె శివప్ప" క్రీ.పూ. 6వ శతాబ్ధంలో కందర్బపురం రాజైన సోమదేవర రాజుకు చెందిన పశువులు గోదావరీ తీరం వెంబడి భద్రాచలం నుంచి మంత్రకూటం వరకు మేతకు తీసుకుపోబడేవని పేర్కొన్నాడు.క్రీ.శ 1012 నుంచి 1044 వరకు దక్షిణ భారత ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజేంద్ర చోళుడి కాలంలో "మంత్రకూటం" ఉనికికి సంబంధించి పురాతత్వ సాక్ష్యాలున్నాయి.ఆంధ్రదేశానికి పశ్చిమ ప్రాంతమైన కర్నాటకను పరిపాలించిన చాళుక్య రాజు త్రిభువన మల్లుడి సామంతుడైన "గుండరాజు" మంత్రకూటమును పరిపాలించాడని, ఆయన కాకతీయులకు శత్రువని, కాకతీయ రాజైన రెండవ ప్రోలరాజు "తాండూరు" వద్ద జరిగిన యుద్దంలో గుండరాజును ఓడించడతో గుండరాజు కర్నాటకకు పారిపోయాడని కాకతీయుల శిలాశాశనాలున్నాయి. ఈ తాండురు యుద్ధంగురించి నేటికీ వినిపించే జానపథ పాటలున్నాయి.ప్రతాప చరిత్రలో ఓ కథనం ప్రకారం క్రీ.శ. 1260-1270 కాలంలో కాకతీయులకు చెందిన రాణీ రుద్రమదేవి, దేవగిరి రాజైన "మహాదేవ రాజు"తో యుద్దంచేస్తూ మంథని ప్రాంతంలో గోదావరీ నది దాటి వెళ్ళి మహదేవరాజును దేవగురికోటలో బంధించిందని చెప్పబడింది. మంథని ప్రాంతంలో నేటికీ కనిపించే కాకతీయశైలిలో కనిపించే శిల్పాల్లో యుద్ధ దృశ్యాలు ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్ష్యాన్నిస్తున్నాయి.గుంటూరు జిల్లాలోని మల్కాపురంలో లభించిన ఓ శిలాశాశనం ప్రకారం కాకతీయ ప్రభువైన గణపతి దేవరాయుడు కొన్ని బ్రాహ్మణాగ్రహారాలను తన గురువుకు దక్షిణగా సమర్పించాడు. అలా తనకు లభించిన అగ్రహారాలలో ఆ గురువు మంత్రకూటం, చండ్రవల్లి, కొమ్మూరు, ఉత్తర సోమశిల లాంటి అనేక ప్రాంతాల్లో ఎన్నెన్నో శివాలయాల్ని నిర్మింపజేశాడు.క్రీ.శ. 1323లో ప్రతాప రుద్రుడి ఓటమి, మరణం తరువాత మంథని ప్రాంతాన్ని డిల్లీ పాలకుడైన "మహమ్మద్ బిన్ తుగ్లక్" మరియు ఆయన అనుయాయులు ఆక్రమిచారు. అయితే డిల్లీ నుంచి చాలా దూరమయినందున స్థానికులైన ఎందరో రెడ్లూ, వెలమలు తమ తమ ప్రాంతాల్ని స్వతంత్ర ప్రాంతాలుగా ప్రకటించుకున్నారు. అంతవరకూ సమీప ప్రాంతాల్లోని సామంతరాజులకు నాయకుడిగా వ్యవహరించిన వెలమదొర "కాపయ కాయక" తన స్వతంత్రత ప్రకటించి "మంథని" ప్రాంతాన్ని క్రీ.శ. 1334 నుంచి క్రీ.శ. 1365 వరకు పాలించాడు. ఆయనను రేచర్లకు వెలమ రాజులు హత్యచేశారని ప్రతీతి.క్రీ.శ. 1433లో బహమనీ సుల్తాను అహ్మద్ షాహ్ ఈ ప్రాంతంపై అకస్మిక దాడి జరిపి సునాసయంగా విజయం సాధించాడు, ఆయన తరువాతి బహమనీ సుల్మానులు కులీ సుతుబ్‌షాహిను ఈ ప్రాంతానికి ప్రముఖుడిగా నియమించారు. అయితే క్రీ.శ. 1518లో కులీ కుతుబ్‌షాహి తన స్వతంత్రతని ప్రటించుకుని, సమీపంలోని రామగిరి, ఓరుగల్లు కోటలను స్వాధీనం చేసుకున్నాడు.క్రీ.శ 1626 నుండి క్రీ.శ. 1672 వరకూ ఈ ప్రాంతాన్ని అబ్ధుల్లా కుతుబ్‌షాహి పరిపాలించాడు, ఈయన తన కూతురిని డిల్లీ చక్రవర్తి ఔరంగజేబు కుమారుడికిచ్చి వివాహం చేశాడు. ఆ వివాహంలో రామగిరి కోటా, ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలు కూడా వరకట్నంగా డిల్లీ రాజకుమారిడివయ్యాయి. క్రీ.శ. 1687లో దక్కను, గోల్కొండ కోటపై డిల్లీ చక్రవర్తి ఆక్రమణలో రామగిరి కోట డిల్లీవారికి సైన్య శిభిరమైంది. తదనంతరం, మొగలు చక్రవర్తుల దక్కను సుబేదారు ఒకటవ ఆసఫ్ జాహీ క్రీ.శ. 1724లో స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుని తన స్వంత రాజ్యాన్ని స్థాపించాడు. దీంతో మంథని ప్రాంతం నిజాం పాలన్లోకిచ్చింది. ఆ తరువాత మంథని 13 సెప్టెంబర్ 1948న ఆనాటి హైదరాబాదు రాష్ట్రంలో భాగంగా భారతదేశంలో విలీనమైంది.1921-1941 జనాభా లెక్కల్లో మంథనిని "పురపాలక సంఘంగా" ప్రకటించారు, తదుపరి 1951 మరియు 1961లో జరిగిన జనాబాలెక్కల్లో మంథని వరుసగా "పట్టణసమితి" మరియు "పట్టణ పురపాలక సంఘం"గా ప్రకటించారు. "ప్రభుత్వ కార్యాలయాల చట్టం, 1964" ప్రకారం మంథనిని "పంచాయితీ"గా వర్గీకరించారు. ఆ తరువాత 1970లో "తాలుకా"గానూ, అప్పటి ముఖ్యమంత్రి శ్రీ యన్.టీ.రామారావు పరిపాలనలో ప్రవేశ పెట్టబడిన నూతన నామకరణతో 1985 నుంచి మంథని "రెవెన్యూ మండలం"గా మారింది.సాంఘిక-ఆర్థిక పరివర్తనల కారణంగా వైదిక వృత్తి ప్రోత్సాహన తగ్గటంతో వైదిక అధ్యయనా ధ్యేయంతో మంథని వచ్చేవారి సంఖ్య దాదాపు శూన్యమే అయిపోయింది. 20వ శతాబ్ధపు తొలిరోజుల్లో మంథని ప్రసిద్ధ వైదిక కేంద్రంగా ఉండేది. దురదృవశాత్తు, తరువాతి కాలంలో మంథనిలో గల "వేధ పాఠశాల" పూర్తి అనాధరణకు గురైంది, తత్ఫలితంగా కాశీ, ప్రయాగ క్షేత్రాలకి మంథని నుంచి వెళ్ళే వేద పండితుల సంఖ్య శూన్యమైపోయింది. అలాగే కాలక్రమేణా జీవనోపాధి మార్గాల్లో ఏర్పడిన మార్పులతో ఓ కాలంలో బొంబాయి, నాగ్‌పూర్, పూణా వంటి పారిశ్రామిక నగరాలకు వంటవాళ్ళుగా వేదపండితులు ప్రవాసంపోవడంకూడా బ్రాహ్మణులలో పూర్తిగా శూన్యమైంది, ఇలాంటి "అంతర్బహిర్బ్రవాసాలు" బ్రాహ్మణ కుటుంబాలవరకే పరిమితంగా ఉండేది.మంథణిలో బ్రాహ్మణేతర కులాల్లో వారివారి కుల వృత్తులే జీవనాధారాలై ఉండేవి. సామాన్యంగా ప్రాంతీయులు అనుసరించే వృత్తి, వ్యాపారాలు పాతకాలమ్నాటి హిందూ సంస్కృతి ననుసరించినవారి వారి కుల వృత్తులే అయిఉండేవి. వ్యవసాయ ప్రధానమైనవి మంథనిలో లాభసాటి వ్యవసాయానికిగానీ, ఇతర పారీశ్రమిక వృత్తి ఉద్యోగాలకిగాను తావెంతమాత్రం లేకపోవడంతో "మంథని" నాటికీ నేటికీ పెద్ద తేడా ఏమీ లేదని చెప్పవచ్చు."కూచిరాజు పల్లె" సూరయ్య పల్లె" గోదావరి వరదల తరువాత పుట్టిన "గంగాపురి" లాంటి చిన్నచిన్న పల్లెలు ఇప్పుడు మంథనిలో కలిసిపోయాయి.

0 comments:

Post a Comment

  • VIDEOS
  • PHOTOS
  • NEWS UPDATE