బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావ్ గారికి మంథనిలో పూర్ణ కుంభంతో ఘన స్వాగతంశ్రీ చాగంటి కోటేశ్వర రావ్ గారి దంపతులు .మన మంథని లోని అన్ని దేవాలయాలకు దర్శించుకొని చాల చాల ఆనందిచారు ఇక్కడికి రావటం నా పూర్వ జన్మ సుకృతమని అభివర్ణిoచారు .........
1st Day (7-06-2013)
బ్రహ్మాండ సృష్టి.. స్థితి.. లయకారకుడు పరమేశ్వరుడు
శివవైభవ తత్వంపై చాగంటి కోటేశ్వర్‌రావు ప్రవచనాలు
- అశేషంగా తరలివచ్చిన భక్తజనం
- నమస్తే తెలంగాణ డైరెక్టర్ విజయరాజం ఆధ్వర్యంలో నిర్వహణ
బ్రహ్మాండ సృష్టి, స్థితి, లయకారకుడు పరమేశ్వరుడేనని శారద జ్ఞానపుత్ర బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్‌రావు వివరించారు. శ్రీ నృసింహా శివకిరణ్ గార్డెన్‌లో చాగంటి కోటేశ్వర్‌రావుచే శివవైభవతత్వంపై ప్రవచన కార్యక్రమం ప్రారంభమైంది. మంథనికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, నమస్తే తెలంగాణ దినపత్రిక సీఎండీ సీఎల్ రాజం-విజయరాజం దంపతుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే ప్రవచన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తరలివచ్చిన అశేష భక్తజన వాహినికి శివ వైభవతత్వాన్ని ప్రవచనములతో బోధించారు. సృష్టికి పరబ్రహ్మ మూలపురుషుడైతే స్థితి కారకుడు విష్ణుమూర్తి అని లయకారకుడు శివుడని ఈ త్రిమూర్తుల పరమైకతత్వపు అంశ కలిగిన వాడే పరమశివుడన్నారు.
పాశుపత గుణం కలగిన వాడని.. ఆకాశమంతట పరివ్యాప్తమైనదే శివతత్వమని శివుడు లేనిది.. శివం కానిది ఏదీ లేదని.. జ్ఞానం ప్రసాదించువాడే పరమేశ్వరుడన్నారు. శూన్యానికి జవాబు లేదని, శూన్య సిద్ధాంతమే శివవైభవమని దానికి అంతం లేదని అంతటా నిండి యున్నదే శివ వైభవమని పరమ శివక్షేత్ర అంటే నీడలేని దీపాలు పెట్టడం. ఇది కేవలం తిరువనంతక్షేత్రంలో మాత్రమే ఉందన్నారు. ధ్యానానికి శివుడు పరాకాష్ఠ..అద్వైతం..అనుభూతి..అంతటా శివుడు ఉన్నాడు కానీ అది మన మననంలో ఉందన్నాడు. లేని ఊపిరి ఇచ్చి నేనున్నానని చెప్పేవాడు పరమశివుడని లోపలి చైతన్యం అనుభూతి కలిగిస్తూ బ్రహ్మాండమంతా నిండిన వాడన్నారు. శివం అంటే మంగళం..కళ్యాణం..శుభం.. లోకధర్మం కోసం క్రోధం నటించి ప్రజలను ధర్మం వైపు తిప్పుతాడు. ఎక్కడ శివున్ని ఆరాధిస్తే అక్కడ సదా సౌఖ్యం ఉంటుందన్నారు. ప్రజాధ్యానం కలిగినవాడు ధ్యానకారకుడు తరింపజేసే గుణం కలిగిన వాడు శివుడని..యుగం మారితే బ్రహ్మ లక్షణం మారుతుందన్నారు.
అందుకే మిగితా దేవతలకు లేని గొప్పతనం శివవైభవ తత్వానికి ఉందని తెలియజేశారు. అంతకుముందు ఉదయం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్ రావు మంథనికి చేరుకోగానే పూర్ణకుంభ స్వాగతంతో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వాగతం పలికారు. పట్టణంలోని ప్రాచీన చారిత్రక దేవాలయాలైన శ్రీ మహాలక్ష్మీ, శ్రీ శీలేశ్వర సిద్ధేశ్వర, శ్రీ లక్ష్మినారాయణ స్వామి, శ్రీ భిక్షమేశ్వర, శ్రీ ఓంకారేశ్వర, శ్రీ ఆంజనేయ, శ్రీ దత్తాలయ, గోదావరి తీరంలోని గౌతమేశ్వర ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్షికమంలో నమస్తే తెలంగాణ దినపవూతిక డైరెక్టర్ సీఎల్ విజయరాజం, సీఎండీ మాతృమూర్తి గోదమ్మలు, పట్టణంలోని భక్తులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తజనం ప్రవచనాలను ఆలకించి సమ్మోహితులైనారు.

![]() | ![]() |
మన మంథని లో జరిగే శ్రీ చాగంటి కోటేశ్వర రావ్ గారి ప్రవచనాలు ...
మన మంథని వెబ్ సైట్ లో ప్రత్యక్ష ప్రచారం చేయ బడును ---
LIVE PROGRAM....
0 comments:
Post a Comment