తెలంగాణా లో నేడు ప్రతిచోట ఆవిష్కరించబడుతున్న క్యాలెండర్ తెలంగాణా చరిత్రను సమగ్రంగా అధ్యయనం చేయడానికి పరిశోధన అధికారాలుగా పనికి వస్తాయని ప్రముఖ విద్యా వేత్త శ్రీ చుక్క రామయ్య గారు అన్నారు మన మంథని
క్యాలెండర్ ను పౌర సరఫరా శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు ,సీతారామ సేవ సదన్ వ్యవస్థాపకులు శ్రీ గట్టు నారాయణ గురూజీ తో కలిసి శ్రీ చుక్క రామయ్య గారు హైదరాబాద్ లోని మంత్రి స్వగృహం లో గురువారం సాయంత్రం ఆవిష్క రించారు
మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ మంథని పట్టణం ,నియోజక వర్గం ప్రత్యేకతను ప్రతిబింబించిన మన మంథని క్యాలెండర్ ద్వారా
భావితరాలను మంథని తో అనుసంధానం చేయడం సంతోషకరం అన్నారు
శ్రీ గట్టు నారాయణ గురూజీ గారు తన సందేశం లో క్యాలెండర్ లో మంథని వ్యక్తుల అనుబంధాలను సంకలనం చేసి మంథని ఆత్మను ,ఆత్మీయత ను, అభివృద్దిని భవిష్యత్తును సంక్షిప్తంగా నిక్షిప్తం చేయడం ప్రశంశనియం
అని అన్నారు .
ఈ క్యాలెండర్ లో మంథని బడి లో పెరిగి పెద్దవారు ఐ సమకాలిన ప్రపంచం లో వారి వారి రంగాలలో ఉన్నత శిఖరాలు అధిరోహించి మంథని సమాజానికి సేవ చేస్తున్న విశిష్ట వ్యక్తుల అనుభవాలు, అనుభూతులు భావితరాల కోసం అందించామని మన మంథని వెబ్ సైట్ నిర్వాహకులు అవధానుల నరసింహ ప్రసాద్ తెలిపారు.
సహకరించి ప్రోత్సహించిన అందరికి కృతజ్ఞతలు తెలియజేసారు.
ఈ కార్యక్రమం లో మన మంథని సంధాన కర్త శ్రీరంభట్ల కిషోర్ పాల్గొన్నారు.
0 comments:
Post a Comment