సుగుణకుమారి గారికి అభయహస్తం!
-దిగ్విజయ్‌ని కలిసిన సుగుణకుమారి
-రేపు కాంగ్రెస్‌లో చేరిక
-పెద్దపల్లి లోక్‌సభ టికెట్‌పై సుగుణకుమారికి హామీ
-అగ్రనేతలతో మంతనాలు
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాజకీ య సమీకరణాలు మారుతున్నాయి. పెద్దపల్లి మా జీ ఎంపీ సుగుణకుమారి, ఆదివారం ఢిల్లీలో కాంగ్రెస్ రా ష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌ను కలవడం, మంగళవారం ఆ పార్టీలో చేరనుండడం జిల్లాలో హాట్‌టాపిక్‌లా మారింది.
శ్రీధర్‌బాబుతో సుగుణకుమారి భేటీ
పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి 1998, 1999లో పోటీ చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీ. వెంకటస్వామిని ఓడించి సుగుణకుమారి సంచనలం సష్టించారు. 2004లో వెంటస్వామి చేతి లో ఓటమిపాలైన తర్వాత ఆమె రాజకీయాలకు దూరంగా ఉండి ఆస్ట్రేలియాలో డాక్టర్‌గా స్థిరపడ్డా రు. పెద్దపల్లి ఎంపీ వివేక్, కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరడంతో పెద్దపల్లి బరిలో దిగాలని సుగుణకుమారి నిర్ణయించుకున్నారు. ముం దుగా ఆమెను బీజేపీ ఆహ్వానించగా, తర్వాత అ నుచరులతో సమీక్షించిన సుగుణకుమారి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి శ్రీధర్‌బాబుతో సమావేశమై, తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఆదివారం ఢిల్లీలో దిగ్విజయ్‌సింగ్, కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌తో భేటీ అయ్యారు. సోనియాతో సమావేశం తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
0 comments:
Post a Comment