How To Create a Website

ALL INFORMATION IN our site. MEWLCOM TO WEB SITE మన మంథని information resource centre for entertainment (వినోదం), custom (సంప్రదాయ), cultural (సంస్కృతి), literary (సాహిత్య) and devotional (భక్తి) aspects of all Telugu people. Here you will find some information and devotional Songs. Also included is a separate Bhakti page with collection of all familiar stotras, slokas, pujas and vratas in audio and lyrics format.. JOIN THIS WEB SITE
Mana Manthani web site కు విచ్చేస్తున్న Manthanites కి స్వాగతం సుస్వాగతం మరియు మరియు శుభాకాంక్షలు .. , No. 9246575261

చిలుకు ద్వాదశి - తులసి పూజ @ Manthani



మన మంథని లో " చిలుకు  ద్వాదశి" చాల ఘనం గా జరుపుకుంటారు 
చరిత్ర కథలు :
కృతయుగం లో దేవతలు , రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన రోజు కనుకే " క్షీరాబ్ధి ద్వాదశి " అని పిలుస్తారు .
అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలికారు కనుక " చిలుకు  ద్వాదశి" అని ,
అమృతం కోసం సాగరాన్ని మధించారు గనుక "మధన ద్వాదశి" అని వాడుకలో ఉంది .
క్షీరసాగర మధనము లో జన్మించిన లక్ష్మీదేవిని శ్రీమహావిష్ణువు దేవ దానవ సమక్షములో వివాహమాడుతాడు . లక్ష్మీ కల్యాణము జరుపుతారు .
శ్రీమహావిష్ణువు లక్ష్మీ సమేతం గా బ్రహ్మ , ఇంద్రాది దేవతల తో కలసి బృందావనానికి వెళ్ళారు అంటారు ... అందుకే ఈ రోజుని " బృందావని ద్వాదశి" అని కుడా అంటారు .
బృందా విష్ణువుల వివాహము (గాంధర్వ వివాహము)జరిగి బృంద తులసి చెట్టు గాను , విష్ణువు సాలగ్రామం (శిలగా)గా ఒకరిని ఒకరు శపించుకున్న రోజు గనుక " బృంద ద్వాదశి " అంటారు .
దశావతారాల్లోని శ్రీకృష్ణావతారంలో తులసికీ శ్రీకృష్ణునికీ కార్తీక ద్వాదశినాడు వివాహం జరిగిందని పురాణ కథనం. తులసి కల్యాణానికి దేవ దీపావళి అనీ పేరు. దీపావళినాటిలాగా కార్తీక శుద్ధ ద్వాదశినాడు ఇంటినిండా దీపాలు ప్రమిదల్లో వెలిగిస్తారు.
చాతుర్మాస్యవ్రతం ఆచరించిన సాధకులు కార్తీకశుద్ధ ద్వాదశిరోజు వ్రతసమాప్తి చేయడం ఆచారంగా వస్తోంది.
చిలుకు ద్వాదశి - తులసి పూజ :
దేవుడు ఏ తప్పు చేసిన అది సమాజ శ్రేయస్సు కొరకే అని భావించే మన భారత సంస్కృతి లో తప్పులు చేసిన రోజులు కూడా పవిత్రదినాలే . . . పండగలే . కార్తీక శుద్ధ ద్వాదశిని చిలుకు ద్వాదశి అనీ వ్యవహరిస్తారు. గృహిణులు నేడు క్షీరాబ్ధిశయన వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రీ మహావిష్ణువు ద్వాదశిరోజు ''తులసి బృందావనానికి'' వస్తాడని ప్రతీతి. క్షీరాబ్ధిశయన వ్రతంలో తులసినీ, విష్ణువునూ పూజించి దీపారాధన చేస్తారు. సూర్యాస్తమయం అనంతరం స్త్రీలు తులసి బృందం పై శ్రీవిష్ణువు పటాన్నిగానీ, విగ్రహాన్నిగానీ ఉంచి ఆచరించే వ్రతం వల్ల ఐదోతనం ప్రాప్తించి సుఖసంపదలు కలుగుతాయని విశ్వసిస్తారు.

భారతీయ సంప్రదాయంలో తులసికి అధికప్రాధాన్యముంది. దేవతార్చనకు తులసి దళం అతిశ్రేష్ఠం. తులసి మొక్క శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైంది. నువ్వుల్లో నూనెలాగా, పెరుగులో వెన్నలా, ప్రవాహంలో నీటిలాగా, ఇంధనంలో అగ్నిలాగా శ్రీమహావిష్ణువు తులసి మొక్కలో నిగూఢంగా ఉంటాడని బ్రహ్మోపనిషత్తు తెలుపుతోంది. తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం. చిలుకు ద్వాదశి రోజు తులసికోట వద్ద కర్ర పాతి ఆకాశదీపం వెలిగించాలని శాస్త్రం తెలుపుతోంది. కార్తీక శుద్ధ ద్వాదశి శివునికి ఇష్టమైన సోమవారం ఉత్తరాభాద్ర నక్షత్రంతోనైనా, శనివారం రేవతి నక్షత్రంతోనైనా కలిసిరావడం మంచిదని అంటారు. సోమవారం ఉత్తరాభాద్రతో వచ్చిన కార్తీక ద్వాదశిని హరవాసరమనీ, శనివారం రేవతీ నక్షత్రయుక్తమైతే హరివాసరమని అంటారు. ఈ సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి హరవాసరమైరావడం శుభసూచకమని కృత్యసారస సంహితం తెలుపుతోంది. చాతుర్మాస్యవ్రతం ఆచరించిన సాధకులు కార్తీకశుద్ధ ద్వాదశిరోజు వ్రతసమాప్తి చేయడం ఆచారంగా వస్తోంది.

పారమార్థికంగానే కాక, మనిషి విధి విధానాల్లోనూ తులసికి మహత్తు ఉన్నదని భావిస్తారు. ఆరోగ్యదృష్ట్యా తులసి అత్యంత హితమైంది. ఈ మొక్క అతిపెద్దమానుగా ఎదగదు. మూడడుగులు ఎదిగే చిన్న పొద . పరిమళాలను వెదజల్లే ఈ మొక్కను ప్రతి గృహంలో పెంచడం వల్ల దుర్గంధాలు తొలగి దోమలతో పాటు క్రిమికీటకాలు నశిస్తాయి. తులసి ఆకులు, గింజలు, వేళ్లు, కొమ్మలు వైద్యపరంగా ఉపయుక్తమైనవే! రెండుకన్నా ఎక్కువ ఆకులు చేరివున్నవాటిని తులసి దళాలు అంటారు. వాటిని నీటిలో ఉంచి తీర్థంగానైనా, నేరుగానైనా వినియోగిస్తే- శరీరంలోని జలుబుకారక రుగ్మతలు తొలగి చర్మసౌందర్యం ఇనుమడిస్తుంది. వివిధ సాంక్రామిక వ్యాధులను తులసి వినియోగంతో నివారించవచ్చు. తులసి మొక్క నుంచి వచ్చే తావివల్ల పరిసరాలు శుభ్రంగా మారతాయి. అందుకే తులసి మొక్కను పవిత్రమైందిగా పరిగణిస్తారు. భారతీయ సంస్కృతిలో ప్రతి ఇంట్లోనూ తులసికోట నిర్మించడం ఆచారంగా వస్తోంది. చిలుక ద్వాదశిరోజు తులసిని దేవతగా భావించి పూజిస్తారు. స్మృతికౌస్తుభం ప్రకారం- కార్తీక శుద్ధ ద్వాదశి మొదలు, పౌర్ణమి వరకు తులసి కల్యాణం జరపాలని చెబుతారు. దశావతారాల్లోని శ్రీకృష్ణావతారంలో తులసికీ శ్రీకృష్ణునికీ కార్తీక ద్వాదశినాడు వివాహం జరిగిందని పురాణ కథనం. తులసి కల్యాణానికి దేవ దీపావళి అనీ పేరు. దీపావళినాటిలాగా కార్తీక శుద్ధ ద్వాదశినాడు ఇంటినిండా దీపాలు ప్రమిదల్లో వెలిగిస్తారు. శ్రీకృష్ణుడు సర్వదా తన సొత్తుగా భావిస్తూ గర్వపడిన సత్యభామతో నారదుడు ఆచరింపజేసిన వ్రతం తెలిసిందే. తులసి దళాల బరువుకు మాత్రమే శ్రీకృష్ణుడు తూగి సత్యభామకు గర్వభంగం కలిగిన రసవత్తరమైన కథ మరిచిపోలేనిది. కార్తీకశుద్ధ ద్వాదశిరోజు ఉసిరికాయలతో కూడిన కొమ్మను తులసితో కలిపి పూజించి దీపారాధన చేయడం మన రాష్ట్రంలో ఆచారంగా వస్తోంది.

0 comments:

Post a Comment

  • VIDEOS
  • PHOTOS
  • NEWS UPDATE