ముందుగా కుంకుమ బొట్టు పెట్టుకుని, నమస్కరించుకుని, ఈ విధంగా ప్రార్ధించుకోవాలి.
ప్రార్థన:
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ||
అయం ముహూర్తస్సుముహూర్తోస్తు ||
తదేవలగ్నం, సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ, లక్ష్మీపతే తేంఘ్రి యుగంస్మరామి ||
లాభస్తేషాం, జయస్తేషాం, కుతస్తేషాం పరాభవః
యేషామిందీవర శ్యామో హృదయస్తో జనార్దనః ||
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమా మ్యహం ||
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః,
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః,
వక్రతుండ శ్శూర్పకర్ణో, హేరంబః స్కంధ పూర్వజః
అష్టావష్టౌ చ నామాని యః పఠేచ్ఛృణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశ నిర్గమేతథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్యనజాయతే
అభీప్సితార్థ సిద్ధర్థ్యం , పూజితో యస్సురైరపి,
సర్వవిఘ్నచ్చి దేత స్మై గణాధిపతయే నమః ||
(నమస్కరించుకుని ఆచమనం చేయాలి. ఎడమచేతితో ఉద్దరిణ పట్టుకుని, నీటి పాత్ర నుంచి మూడుసార్లు నీటిని కుడి చేతిలో వేసుకుంటూ కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా అంటూ నీటిని తాగాలి. హస్తం ప్రక్షాళ్య అంటూ ఉద్దరిణతో నీటిని తీసుకుని చేతిని కడుక్కోవాలి.)
గోవిందాయనమః, విష్ణవేనమః, మధు సూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయనమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయనమః, పద్మనాభాయనమః, దామోదరాయనమః, సంకర్షణాయనమః, వాసుదేవాయనమః, ప్రద్యుమ్నాయనమః, అనిరుద్దాయనమః, పురుషోత్త మాయనమః, అధోక్షజాయనమః, నారసింహాయనమః, అచ్యుతాయనమః, జనార్దనాయనమః, ఉపేంద్రాయనమః, హరయేనమః, శ్రీకృష్ణాయనమః.
ఉత్తిష్ఠంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూర్భువస్సువః దైవీ గాయత్రీ ఛందః. ప్రాణాయామే వినియోగః |
(ప్రాణాయామం చేయాలి. నాసిక ఎడమ రంధ్రం నుంచి గాలి పీలుస్తూ, గాయత్రీ మంత్రాన్ని ఉచ్చరించాలి)
ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః ఓం తపః ఓగ్ మ్ సత్యం, ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్. ఓ మాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్.
(దీపారాధన వెలిగించి ఈ విధంగా సంకల్పము చెప్పుకోవాలి)
సంకల్పం :
ఓం || మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభేశోభనే ముహూర్తె అద్యబ్రహ్మణః ద్వితీయపరార్దే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే, అష్టావింశతి తమే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరత వర్షే, భరతఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య …. ప్రదేశే (శ్రీశైలానికి ఏ దిక్కులో వుంటే ఆ దిక్కు పేరు చెప్పు కోవాలి), అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ ప్లవ నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, భాద్రపదమాసే, శుక్ల పక్షే, చతుర్ధ్యాం తిధౌ, స్థిర వాసరే , శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం , శుభతిధౌ, శ్రీమాన్ … గోత్ర: … నామధేయః, శ్రీమతః …గోత్రస్య …నామధేయస్య (పూజ చేసే వారు గోత్రం, పేరు చెప్పుకోవాలి. పూజకు కూర్చున్న చిన్నారుల పేర్లు కూడా చెప్పాలి) ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థయిర్య విజయాయు రారోగ్యైశ్వర్యాభి వృద్ద్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిద్ధ్యర్థం, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, మనో వాంఛా ఫలసిద్ధ్యర్థం, సమస్త దురితోపశాంత్యర్థం, సమస్త మంగళా వాప్త్యర్థం, వర్షేవర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్దీ ముద్దిశ్య, శ్రీ వరసిద్ది వినాయకదేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే (అంటూ కుడిచేతి మధ్యవేలితో నీళ్ళు ముట్టుకోవాలి) ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం గణాధిపతి పూజాం కరిష్యే | తదంగ కలశపూజాం కరిష్యే ||
కలశపూజ: కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య | తస్యోపరి హస్తం నిధాయ |
(కలశంలో గంధం, పుష్పాలు, అక్షతలు వుంచి దానిని చేతితో తాకుతూ ఈ మంత్రం చదవాలి)
0 comments:
Post a Comment