How To Create a Website

Mana Manthani web site కు విచ్చేస్తున్న Manthanites కి స్వాగతం సుస్వాగతం మరియు మరియు శుభాకాంక్షలు .. , No. 9246575261

బ్రాహ్మణులు ఐక్యం కావాలి

పేద పిల్లలకు ఉచిత విద్య అందించాలి : మాజీ డీజీపీ అరవిందరావు
సేవా కార్యక్షికమాలు చేపట్టాలి: నమస్తే తెలంగాణ సీఎండీ లక్ష్మీరాజం

ఎనిమిది వేల సంవత్సరాల సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకునేందుకు బ్రాహ్మణులు ఉద్యుక్తులు కావల్సిన తరుణం వచ్చిందని రాష్ట్ర మాజీ డీజీపీ అరవిందరావు అన్నారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని ఇంటర్ కాంటినెంటల్‌లో బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ‘కార్తీక వన సమారాధన’ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్షికమంలో ఆయన ప్రసంగించారు. ఎంతో ఉన్నతమైన సంస్కృతీ సాంప్రదాయాలకు నిలయమైన భారతదేశంలో నేడు పిల్లలకు రామాయణం, భారతం తెలియని పరిస్థితి వచ్చిందన్నారు. పురాణాలు, వేదాలపై తీవ్రమైన వక్రీకరణలు జరిగి హిందూ మతానికి ఆదరణ కరువైందన్నారు. బ్రిటిష్ హయాంలో చెక్కుచెదరకుండా ఉన్న హిందూ మతం వారి నిష్క్రమణ తర్వాత స్వపరిపాలనలోనే కనుమరుగవుతున్నదని అన్నారు. మతం మార్పిడులు పెరిగి ముప్పు వస్తున్నదన్నారు.

ప్రపంచంలో అనేక మతాలు ఆయా దేశాల్లో ఇతర మతాలను నిర్మూలించడం ద్వారా మనుగడ సాగించాయని, దానికి భిన్నంగా హిందూ మతం అన్ని విశ్వాసాలు గౌరవిస్తూనే తన ఉనికి నిలుపుకున్నదని చెప్పారు. హిందూ మతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత బ్రాహ్మణులపై ఉందన్నారు. పాఠశాలలు నిర్వహించగల ఆర్థిక శక్తి ఉన్న బ్రాహ్మణులు హిందూ సంప్రదాయాలను నేర్పే పాఠశాలలు నెలకొల్పి పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉచిత విద్యా బోధన అందించాలని సూచించారు. నమస్తే తెలంగాణ సీఎండీ సీ లక్ష్మీరాజం మాట్లాడుతూ బ్రాహ్మణ సమాజంలో ఐక్యత సాధన కోసం బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్షికమాలు, సంప్రదాయ పరిరక్షణ కార్యక్షికమాలు చేపట్టాలన్నారు. సమాజ సేవ కోసం జిల్లాల్లో సభలు, సమావేశాలు నిర్వహించాలని సూచించారు. బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య మాట్లాడుతూ డిసెంబర్ 1న నాచారంలోని వీఎన్‌ఆర్ గార్డెన్ ఫంక్షన్‌లో నిర్వహించబోయే కార్తీక వన సమారాధన - బ్రాహ్మణ సమ్మేళనంలో బ్రాహ్మణులంతా పాల్గొనాలని కోరారు. ఈ సమ్మేళనంలో త్రిశక్తి పీఠాధిపతులు వది ్దపర్తి పద్మాకర్ ప్రవచనాలు ఉంటాయన్నారు.


నిమ్మకంటి శ్రీనివాస శర్మ బ్రహ్మత్వంలో లలిత సహవూసనామ స్తోత్ర పారాయణం, శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణము, మహాలింగార్చన, రుద్రాభిషేకం, సంగీత విభావరి, ఆటల పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్షికమంలో బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ప్రధాన కార్యదర్శి శుద్ధపల్లి శ్రీనివాస రావు, గౌరవ సభ్యులు సత్యనారాయణ మూర్తి, చెరువు రాంబాబు, శ్రీ చక్ర ఎండీ కపిలవాయి విజయ్‌కుమార్, ఎస్వీ రావు, చెరువు రాంబాబు, కే శ్రీనివాసరావు, రామకృష్ణ, నాగన్న తదితరులు పాల్గొన్నారు.

1 comments:

ముసలితనం
_____________అరుణ నారదభట్ల

రెండు పండు ప్రాణాలు
చెట్టుతో వున్న బంధాలను విడవలేక
రాలి పోలేక
భూమికీ ఆకాశనికి మధ్య
ఊగిసలాడుతున్నాయి!

ప్రతివేకువకూ కొత్తగా
స్వాగతం తెలుపుతూ
దారిన పోయే చుట్టాల
కళ్ళలో
తమ పిల్లల చూపులను
వెదుకుతూ....
తడబడుతున్న మాటలను
ప్రేమగా సవరిస్తూ
"మా వాళ్ళనుకున్నా" అంటూ
కాలాన్ని నిదుర పోనీకుండా
కాచుకుని కూర్చున్నాయి!

తల్లితండ్రి....
పిల్లల్ని ముద్దుగా పెంచుకుంటే
వీళ్ళు వాళ్ళనెందుకు పంచుకుంటారో!?!

ఒక్కరు నలుగురిని సాకగలరు గానీ
నలుగురు ఒక్కరిని భరించలేరెందుకో!!

ఇవి విన్నాయనుకుంట
ఆ నిండు హృదయాలు
దూరంగానైతేనేమి
చెట్టు నీడైతే ఉందని
మట్టిలో కలిసే వరకూ
అలా విడి విడిగానే....!!!

ఆ పండ్ల చుట్టూ చేరిన చిలకలను
తీయగా పలకరిస్తున్నాయి!
ప్రతి కాయ ఓనాటికి పండేనని
గుర్తించరెందుకో!

Post a Comment

  • VIDEOS
  • PHOTOS
  • NEWS UPDATE