How To Create a Website

Mana Manthani web site కు విచ్చేస్తున్న Manthanites కి స్వాగతం సుస్వాగతం మరియు మరియు శుభాకాంక్షలు .. , No. 9246575261

తగిన ఉద్యోగాన్ని ఎంచుకోవడం ఎలా?


job

ఏం చేయాలి?
-ముందుగా మన అభిరుచులు, జాబ్ పట్ల మన దృక్పథం ఏమిటన్న ప్రశ్నలేసుకొని స్పష్టత తెచ్చుకోవాలి.
-మనం ఏ జాబ్‌లో గంటల తరబడి, సంవత్సరాల పాటు ఎటువంటి అసంతృప్తి లేకుండా గడపగలమో నిజాయితీగా బేరీజు వేసుకోవాలి.
-ఆ తర్వాత మనముందున్న అవకాశాలను విశ్లేషించుకొని ఏది మనకు సరైనదో నిర్ణయం తీసుకోవాలి.
-ఒకటి కంటే ఎక్కువ అవకాశాలు మన అభిరుచికి తగ్గవి ఎదురయినప్పుడు ఆ ఉద్యోగంలోకి ప్రవేశించిన తర్వాత ప్రమోషన్ అవకాశాలు - మేనేజ్‌మెంట్ దృక్పథాన్ని పరిగణలోకి తీసుకోవాలి.
-ఇదే తరహా ఉద్యోగం చేస్తున్న వారి నెవరినైనా కలుసుకొని వృత్తిలోని సాధక బాధకాలు తెలుసుకోవడంలో తప్పు లేదు.
ప్రైవేట్ ఉద్యోగమంటే చాల మందికి ఏది దొరికితే దానిలో చేరిపోవడమే. మొదట ఏ ఉద్యోగంలో చేరితే ఇక ఆ తరహా జాబ్‌లోనే కొనసాగక తప్పని పరిస్థితి. ఇలా దశాబ్దాల తరబడి చేస్తుంటే ఒకే పని, ఆసక్తి లేని పనిలో నిస్సారంగా అన్పిస్తుంటుంది. కెరీర్‌లోనూ ఎదగలేరు. అందుకే ఉద్యోగ ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

jobదాదాపు పాతికేళ్ళ కిందటి మాట. ఆమెరికాకు చెందిన డాక్టర్ నాలి కొన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీలతో కలిపి ఒక సర్వే చేశాడు. మనిషి దీర్ఘకాలం బ్రతకటానికి ప్రధానకారకం ఏమిటి అన్నదే వారి సర్వే. మనిషికి సరైన ఉద్యోగం లభిస్తే పరిపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయువుగా ఉంటాడని నాలి తేల్చి చెప్పాడు. అలాగే ఇరవై ఏళ్ళ సర్వే కాలంలో 75,000 మందికి పైగా ఉద్యోగార్థులను ఇంటర్వ్యూ చేసిన పాల్ మియర్ అనే ఎంప్లాయిమెంట్ సూపర్ వైజర్‌ని ఒకసారి ఒక ప్రశ్న అడిగారు. ‘‘ఉద్యో గాల కోసం ప్రయత్నించేటప్పుడు యువతీ యువకులు చేసే పెద్ద పొరపాటు ఏమిటి?’’ అయన వెంటనే ఇలా సమాధాన మిచ్చాడు.‘‘తమకు తగిన ఉద్యోగం అన్వేషించ కుండా దొరికిన దాంట్లో చేరిపోవడం’’. వీరు ఇద్దరూ కూడా ఫీల్డు అనుభవాల నుంచే తమ అభిప్రాయలు పేర్కొన్నారు. వీటిన్నింటిని బట్టి మనిషి ఆరోగ్యాన్ని, ఆయుస్సుని, ఆనందమయ జీవితాన్ని ప్రధానంగా ప్రభావితం చేసేది ఉద్యోగం అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఇంత ప్రభావవంతమైన అంశం పట్ల యువతరంలో కనీస స్థాయి అవగాహన కూడా లేదన్నది బోధపడుతుంది. పాతికేళ్ళ క్రితం నాలి సర్వే ఫలితాలు ఈ రోజుకీ యథాతథంగా వాస్తవాలుగా ఉండటం ఇంకా విషాదకరం.
కోరుకున్న ఉద్యోగాన్ని, కెరీర్‌ని నిర్ణయించు కోవటం ఉద్యోగార్థికి ఎంతో కీలకమైన అంశం. మనకు నచ్చిన, సరిపడిన ఉద్యోగాన్ని ఎంచుకో వటం ప్రాధాన్యాన్ని పాల్‌మియర్ ఇలా వివరిస్తు న్నారు. ‘‘తలనొప్పిగా ఉందా? కడుపులో గడబిడగా ఉందా? మీకు కావలసినది మందు లు, పౌడర్లు, టాబ్లెట్లు అయ్యుండకపోవచ్చు జీవితంలో ఒక కొత్తమార్పు మీకు అవసరమై ఉండవచ్చు. మీరు తినే దాని వల్ల మీకు కడుపునొప్పి రాదు. మిమ్మల్ని తినే దాని నుంచే మీకు ఆ నొప్పి వస్తుంది అని ఒక పెద్ద మనిషి అంటుండేవాడు. తలనొప్పి వస్తే, గబుక్కున బిళ్ళ వేసుకోకుండా ఈ నొప్పి ఎందుకొ చ్చింది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఒత్తిడి, సంఘర్షణ, ఆభద్రతాభావం....మీలో ఈ సమస్యల్ని కలిగిస్తుండవచ్చు. దీనికి కారణం మీ వ్యక్తిగత అభిరుచులతో, అభిప్రాయాలతో, అవసరాలతో సంఘర్షించే ఉద్యోగాన్ని మీరు చేస్తుండ టమే కావచ్చు. మీ ఉద్యోగం, జీవనశైలి మీ వ్యక్తిత్వంతో విభేదిస్తుండవచ్చు. ఇలా ఐడెంటిటీ సమస్య ఏర్పడిన ప్పుడు మందులు, ద్రవాలు, పౌడర్లు ఉపశమనం కలిగించలేవు. సమస్యను పరిష్కరించుకోవాలని నిజంగా అనుకుంటే సమస్య మూలంలోకి వెళ్ళండి. మీకు నచ్చిన విధంగా చేయటం ప్రారంభించండి. మీకు నచ్చిన విధానాల్లో ప్రయత్నాలు చేయండి.

సాదాసీదాగా గడుస్తున్న జీవితానికి తెరదించి, మీ లక్ష్యాలను స్పష్టంగా మలచుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. మీ జీవితం పై పూర్తి అజమాయిషీని మీరే తీసుకోండి. ఈ రోజు నుంచే మీరు కోరుకున్నది చేయటం ప్రారంభించండి’’. చేస్తున్న పని పట్ల ఇష్టం లేనప్పుడు మనిషి జీవితం ఎంత నరకప్రాయమవుతుందో పాల్‌మియర్ పైన సవివరంగా పేర్కొన్నాడు. ఇంత ప్రాధాన్యం గలిగిన ఉద్యోగాన్ని, కెరీర్‌ని ఎంచుకోవటానికి ఎంత సమయాన్ని కేటాయించాలో, ఎంత సీరియస్‌గా చర్చించాలో ఒక్కసారి ఆలోచించండి. పైగా మీరు ఎంచుకున్న ఉద్యోగం మీకు నిజంగా నచ్చినదే అయితే ఉద్యోగ సాధన సమయంలోనే ఆ తేడా స్పష్టంగా కన్పిస్తుంది. ఎటువంటి బాధా లేకుండా రోజుకు 18గంటలు శ్రమించి, చిరునవ్వుతో ఇంటర్వ్యూని ఎదుర్కొని ఉద్యోగ పీఠాన్ని కైవసం చేసుకుంటారు. నచ్చిన పనిలో విజయం సాధించటం అంత హాయిగా, థ్రిల్లింగ్‌గా ఉంటుంది.

కెరీర్‌లో విఫలమైన వాళ్ళను, కెరీర్ పట్ల అసంతృప్తితో ఉన్నవాళ్ళను పరిశీలిస్తే మనకు అర్థమయ్యే దొక్కటే. వాళ్ళకు తమ లక్ష్యాల పట్ల సరైన అవగాహన ఉండదు. ఉద్యోగాన్వేషణకు బయలుదేరిన యువతీయువకులు ప్రాథమికదశలోనే జాగ్రత్త పడాల్సి అంశమిది. మీరు ఏ ఉద్యోగాన్ని కోరుకుంటున్నారో ముందుగా మీకు స్పష్టంగా తెలియాలి. ఆ తరువాత మీరు అనంతర ప్రిపరేషన్‌లోకి అడుగుపెట్టాలి. మీరు ఏ ఉద్యోగాన్ని కోరుకుంటున్నారో మీకు స్పష్టంగా అర్థం కావాలంటే మీ భావాల్ని, ఎంపికను ప్రభావితం చేసే వివిధ భౌతిక, మానసిక కారణాలను పరిశీలించటం అవసరం. అలాగే ఉద్యోగం విషయంలో అసలు ఏ అభిప్రాయం లేకపోతే ఎలా వ్యవహరించా లన్నది కూడా తెలుసుకోవటం అవసరం.

భారతదేశంలో కెరీర్‌ని ఎంచుకునే యువతరానికున్న పెద్ద సమస్య - కుటుంబపరమైన, సామాజికపరమైన ఒత్తిడులు, తల్లిదండ్రుల ఆశలు, సామాజిక కట్టుబాట్ల వలన గ్రాడ్యుయేట్ స్థాయి యువతీయువకులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. తన కెరీర్ ఆసక్తి ఏమిటో నిర్ణయించుకునేలోపే వారి కెరీర్ నిర్ణయం జరిగిపోతుంది. 
విచిత్రంగా, తాము కోరుకున్న దానికన్నా, తల్లిదండ్రులు, ఇతరులు తమ నుంచి కోరుకుంటున్న దానికే ప్రాధాన్యం ఇవ్వటానికి ఇష్టపడే యువతరమే ఈ దేశంలో ఎక్కువగా ఉంది. ఇలా పరాధీన నిర్ణయాల వల్ల ఎంచుకున్న కెరీర్ కోసం చేసే కృషిలో బాధ్యత లోపిస్తుంది. బాధ్యత లేని చోట అంకితభావం పూర్తిస్థాయిలో ఉండదు. 

ఈ లోపం వల్లే ఉద్యోగసాధనలో ఏ మాత్రం ఒత్తిడి పెరిగినా ఫలితాలు అడ్డం తిరుగుతుంటాయి. అన్నీ అనుకున్నట్టు సాఫీగా జరిగితే ఈ పరాధీన మనస్కులు ఉద్యోగాన్ని సాధిస్తారు. 
ఈ పోటీ ప్రపంచంలో అన్నీ సాఫీగా జరిగే అవకాశాలు దాదాపు ఉండవు. కాబట్టి ఎటువంటి వైరుధ్యాలు లేకుండా పూర్తి అంకితభావంతో ఉద్యోగ సాధన చేయటానికి వీలుగా మీకు నచ్చిన రంగాన్ని, అందులో ఉద్యోగాన్ని మీకు మీరుగా ఎన్నుకోండి. వారసత్వాలు, కట్నాలు అంటూ కక్కుర్తిపడితే మాత్రం మీ జీవితంలో ఒక కీలకమైన భాగస్వామిని కోల్పోయినట్టే. 
---------------------------------------------------------------------------------------
కంప్యూటర్ పరిజ్ఞానంపై పట్టు సాధించడం ఎలా?
ఐ.బి.పి.ఎస్. నిర్వహించే బ్యాంక్ క్లరికల్, ప్రొబేషనరీ ఎగ్జామ్స్‌లో కంప్యూటర్ నాలెడ్జ్ కీలక విభాగం. ఈ విభాగంపై క్లరికల్ ఎగ్జామ్‌లో 40 మార్కులకు, ప్రొబేషనరీ ఆఫీసర్స్‌లో 40 మార్కులకు ప్రశ్నలు వస్తున్నాయి. ఆధునిక యుగంలో కంప్యూటర్ వినియోగం సర్వత్రా పెరుగుతుండగా, బ్యాంకింగ్ రంగంలో కంప్యూటర్ లేని లావాదేవీలను ఊహిం చలేం. దీనిని దృష్టిలో ఉంచుకొని ఐబిపిఎస్ క్లరికల్ ఆఫీసర్ ఎగ్జామ్స్‌లో ఈ విభాగానికి సముచిత స్థానం కల్పించింది.కంప్యూటర్ పరిజ్ఞానం అంటే ఇప్పటి వరకు ఈ సబ్జెక్టు ‘టచ్’ లో లేనివారు ఆందోళన చెందుతారు. అయితే ఈ విభాగంలో కంప్యూటర్‌పై బేసిక్ ప్రశ్నలు మాత్రమే ఉంటాయి.విద్యార్థులు కంప్యూటర్స్‌కి సంబంధించి ఎక్కువగా ఆబ్జెక్టివ్ ప్రశ్నలపైనే దృష్టి పెడుతూ వస్తున్నారు. కానీ బ్యాంకింగ్ విభాగంలో కంప్యూటర్స్‌కి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. బ్యాంకింగ్ రంగంలో ప్రతి ఒక అంశం కంప్యూటర్స్‌తోనే ముడి పడి ఉంటుంది. ఇక ప్రిపరేషన్ అంశానికి వస్తే బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి కంప్యూటర్ బేసిక్స్, అప్లికేషన్స్ పై దృష్టి పెడితే మ్యాగ్జిమం మార్క్స్ సాధించవచ్చు. అది ఎలాగో చూద్దాం.ఐ.బి.పి.ఎస్ ప్రశ్నాపత్రం మనం గమనించినట్లయితే అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ విభాగాలలో ప్రశ్నల సరళి ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది. కానీ కంప్యూటర్ నాలెడ్జ్ ప్రశ్నాపత్రాన్ని మనం గమనించినట్లయితే ప్రశ్నలు ఎప్పుడూ ఒకే అంశంపై వస్తుంటాయి. కాకపోతే వాటి రూపాంతరం మాత్రం వేరుగా ఉంటుంది.
ibpsibps

ఉదాహరణకు ః
1. CPU is the abbreviation of? ( 2 )
1. Central Programing unit
2. Central Processing unit
3. Computer Processing unit
4. Control Protocol unit
(Allahabad Bank Po : 17-11-2011)
2. A microprocessor is the brain of the computer and is also called ? ( 1 )
1. Cpu 2. Macrochip
3. Cache Memory 4. Calculator
5. Software
(Allahabad Bank Po : 17-11-2011)
ఈ రెండు ప్రశ్నలు మనం గమనించినట్లయితే రెండు ప్రశ్నలు ఒకే అంశానికి సంబంధించినవి. కానీ విద్యార్థులు కేవలం అబ్జెక్టివ్ ప్రశ్నలను మాత్రమే చదవడం వలన ఇలాంటి సరళమైన ప్రశ్నలకు సమాధానం గుర్తించడంలో విఫలమవుతారు. దీనినీ పరిష్కరించడానికి ఒకే మార్గం కంప్యూటర్ విభాగాల పని తీరు గురించి పూర్తిగా అవగాహన పెంచుకోవటం, కంప్యూటర్స్ సబ్జెక్టుని ప్రశ్నల రూపంలో కాకుండా వాటి పని తీరుపై దృష్టిపెట్టి చదివినట్లయితే, ఎలాంటి ప్రశ్నలు ఇచ్చినా అభ్యర్థి వాటిని తేలికగా ఆన్సర్ చేయ్యగలరు.
కంప్యూటర్స్ ప్రశ్నాపత్రంలో ఎక్కువగా ప్రశ్నలు అడిగే అంశాలు.
1. Computers Introduction, its components
2. Hardware & software of Computers
3. Micro soft Applications
4. Internet Applications
5. Storage Devices
Computer Introduction, 
its components (CPU, Monitor, Key board, Mouse)
ఈ విభాగంలో అభ్యర్థులు కంప్యూటర్స్ పుట్టు పూర్వోత్త రాలు, వాటి విభాగాల గురించి అభ్యసించాలి.
ఉదా ః
4 కంప్యూటర్ అంటే ఏమిటి?
4 కంప్యూటర్లు ఎప్పుడు ఆవిర్భవించాయి?
4 కంప్యూటర్లలో ఎన్ని రకాలు ఉంటాయి?
4 కంప్యూటర్‌లో ఎన్ని విభాగాలు ఉంటాయి?
ఉదా ః
1. An electronic device, operating under the control of Information, that can accept data, process data, produce out put & store that result for future use........... ( 2 )
1. Input 2. Computer
3. Software 4. Hardware
5. None of these
(SBI Bank P.O. 3-6-2012)
పై ప్రశ్న కంప్యూటర్స్ ఇంట్రడక్షన్‌కి సంబంధించి అడిగినదే.
ఉదా ః
1. What is the function of CPU of a computer?
1. Creating invoice ( 2 )
2. Performs Calculations & Processing
3. Deletes Data
4. Computes the data
5. None of these
(SBI Bank P.O. 3-6-2012)
పై ప్రశ్న కంప్యూటర్ విభాగానికి సంబంధించినది.
Hard ware & software of Computers
హార్డ్‌వేర్ ః కంప్యూటర్ విభాగాలలో మనం స్పృశించ. గలిగే వాటిని హార్డ్‌వేర్ అంటారు.
ఉదా ః 
కంప్యూటర్ మొనిటర్, సి.పి.యు., మౌస్
సాప్ట్‌వేర్ ః కంప్యూటర్ ప్రొగ్రామ్‌లను సాప్ట్‌వేర్ అంటారు.
ఉదాః ఆపరేటింగ్ సిస్టమ్స్ (ఎమ్.ఎస్ ఆఫీస్)సాప్ట్‌వేర్‌ని మనం తాకలేం, వాటిని స్పృశించలేం, కానీ చూడగలం.
ఉదా ః
1. What type of device is a computer mouse ?
1. Storage 2. output (4)
3. Software 4. Input
5. Input / out put
(SBI. Clerks : 3-06-2011)
పై ప్రశ్నలో మౌస్ అనేది ఒక హార్డ్‌వేర్ కానీ, దాన్ని మనం ఇన్‌పుట్ ఇవ్వడానికి ఉపయోగిస్తాం. అందుకే మనం వాటి పనీతీరును కూడా అభ్యసించాలి.
1. The ability of an Os (Operating system) to run more than one application at a time is called..... ? (1)
1. Multitasking
2. object-Oriented Programming
3. Multi-user Computing
4. Time Sharing 5. None of these
(Allahabad Bank Clerk : 14-03-2010)
ఎమ్.ఎస్ ఆఫీస్ అప్లికేషన్స్
ప్రతి కంప్యూటర్‌లో ఉండే ముఖ్యమైన సాఫ్ట్‌వేర్ ఎమ్.ఎస్ ఆఫీస్. మనం కంప్యూటర్స్ లోని విండోస్ లో దీన్ని చూస్తుంటాం. మనం నిత్యం డేటా టైప్ చెయ్యటానికి, అకౌంట్స్ చెయ్యటానికి, ప్రాజెక్ట్స్ ప్రెజెంట్ చెయ్యడానికి ఎమ్.ఎస్ ఆఫీస్ అప్లికేషన్ ఉపయోగిస్తుంటాం. 
ఎమ్.ఎస్.ఆఫీస్‌లో ముఖ్యమైనవి ఎమ్.ఎస్. ఆఫీస్, ఎమ్.ఎస్. వర్డ్, ఎమ్.ఎస్ . ఎక్సెల్, ఎమ్.ఎస్ పవర్ పాయింట్, ఎమ్.ఎస్. ఆఫీస్ కి సంబంధించి పై పేర్కొన్న నాలుగు అంశాలపై ప్రశ్నలు ఎక్కువగా వస్తుంటాయి.
ఉదా ః
1. .......allows users to upload files to an online site. so they can be viewed & edited from another location ? (4)
1. General-Purpose applications
2. Microsoft out look
3. Web-hosted-technology
4. Office live
5. None of these
(IBPS PO : 17-06-2012)
2. In Excel.....the left default in a cell ? (1)
1. left aligned 2. right aligned
3. Centered 4. Justified
5. None of these
(Allahabad Bank Clerk : 31-08-2008)
3. Which power point view displays each slide of the presentation as a thumbnail & useful for rearranging slides ? (1)
1. Slide Sorter 2. Slide Show
3. Slide Master 4. Notes Page
5. Slide Design
(IBPS PO : 17-06-2012)
ఇంటర్నెట్ అప్లికేషన్
ప్రతి రంగంలో ఇంటర్నెట్ వ్యవస్థ అనేది కీలక పాత్ర పోషిస్తోంది. మనం నిత్యం ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యటానికి, ఈమెయిల్ చెయ్యటానికి, సమాచారం సేకరించటానికి కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోటానికి, ఆన్‌లైన్ షాపింగ్ ఇతర ముఖ్యమైన పనులకు ఇంటర్నెట్ సందర్శి స్తుంటాం. ఐ.బి.పి.ఎస్ ఎగ్జామ్స్‌లో తరుచూ ఇంటర్నెట్ అప్లికేషన్స్‌కి సంబంధించి రకరకాల ప్రశ్నలు అడుగుతుంటారు.
ఉదా ః
1. What is the storage area for email message called ? (2)
1. A folder 2. A Mail box
3. A directory 4. The hard disk
5. None of these
(IOB PO : 22-05-2011)
2. The standard Protocol of the Internet is ?
1. TCP/IP 2. JAVA (1)
3. HTML 4. Flash
5. None of these
(SBI Bank PO : 7-3-2010)
Storage Devices
మనం ఏదైనా సమాచారాన్ని భద్రపరచటానికి Storage Devices ఉపయోగిస్తుంటాం.
ఉదా ః Floppy Disk, CD, DVD, Pendrive
ఉదా ః
1. .....device uses laser techonology to store large amount of information ? (2)
1. Floppy disk
2. Compact disc read only memory (CD-ROM)
3. Hard disk
4. Extended disc read only Memory (ED-Rom)
5. None of these
(BOB Clerk : 6-6-2010)
2. All of the following storage media have read & Write capabilities except? (2)
1. Flash Memory cards
2. CD- Roms 3. Hard disk drives
4. Floppy disks 5. None of these
(BOB Clerk : 6-6-2010)

0 comments:

Post a Comment

  • VIDEOS
  • PHOTOS
  • NEWS UPDATE