How To Create a Website

Mana Manthani web site కు విచ్చేస్తున్న Manthanites కి స్వాగతం సుస్వాగతం మరియు మరియు శుభాకాంక్షలు .. , No. 9246575261

Special Interview with Mana Sridhar Anna

















తెలంగాణ తెచ్చిందీ..ఇచ్చిందీ మేమే!
-ప్రత్యేక రాష్ట్రం వచ్చింది సోనియా వల్లే
- వచ్చేది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే!
- వేల కోట్లతో మంథనిని అభివద్ధి చేశా..
-అవకాశమిస్తే తెలంగాణకే మణిమకుటంలా మారుస్తా..

-మన మంథని :ఇంటర్వ్యూలో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

తెలంగాణ తెచ్చిందీ.. ఇచ్చిందీ మేమే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కృషి వల్లే ప్రత్యేకరాష్ట్రం వచ్చింది.. దీంతోపాటు మేము చేసిన అభివద్ధే మమ్మల్ని గెలిపిస్తుంది.. అని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థితో ముఖాముఖి కోసం టీ మీడియా కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు ఇవీ..

మన మంథని : సార్వత్రిక ఎన్నికల్లో మీ పార్టీ విజయావకాశాలు ఎలా ఉంటాయని భావిస్తున్నారు?

శ్రీధర్‌బాబు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్‌తోనే సాధ్యమైంది. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను గుర్తించిన సోనియాగాంధీ, అనేక కష్టనష్టాల కోర్చి ప్రత్యేక రాష్ర్టాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధులుగా మేము మొదటి నుంచీ చిత్తశుద్ధితో పోరాడాం. అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చాం. ఇచ్చిన మాటకు కట్టుబడి.. తెలంగాణ ఇచ్చిందీ, తెచ్చిందీ కాంగ్రెస్సే! అందువల్ల గెలువబోయేదీ కాంగ్రెస్సే! అదీగాక మేము చేసిన అభివద్ధి కూడా మమ్ముల్ని విజయతీరాలు చేరుస్తుంది. 

మన మంథని :మీ నియోజకవర్గంలో ఎలాంటి అభివద్ధి ..?

శ్రీధర్‌బాబు: నియోజకవర్గంలోని విద్యార్థుల కోసం ప్రభు త్వ విద్యాసంస్థలను తెచ్చా. మంథని జేఎన్‌టీయూ(హెచ్) ఇంజినీరింగ్ కళాశాల, మహాదేవపూర్‌లో డిగ్రీ కళాశాల, కాటారంలో ఐటీఐ కళాశాల, కమాన్‌పూర్ మండలం రత్నాపూర్‌లో హార్టీకల్చర్ కళాశాల, కృషి విజ్ఞాన కేంద్రం, బాలికలకు ప్రత్యేకంగా ఐదు కస్తూర్భా పాఠశాలలు, ఆంగ్ల బో ధన కోసం మో డల్ స్కూళ్లను ప్రారంభించా. మహాదేవపూర్, మహాముత్తారం, కాటారం మండలాల్లో 40 వేల ఎకరాల బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు రూ.500 కోట్లతో కాళేశ్వర- ముక్తీశ్వర ఎత్తిపోతల పథకాన్ని, 20వేల ఎకరాల భూములను సాగులోకి తెచ్చేందుకు 2 టీఎంసీలతో లక్కారం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించా. బొక్కల  వాగు, కన్నాల ప్రాజెక్టుల ఆధునీకీకరణకు కృషి చేశా. 64 గిరిజన గ్రామాలను కలిపే రింగు రోడ్డు, పెద్దపల్లి-కాటారం, మంథని-గోదావరిఖని రహదారుల విస్తరణ చేపట్టా. వీటి వల్ల రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. రూ. 50 కోట్ల ఐఏపీ నిధులతో మారుమూల ప్రాం తాల్లో సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలు, రక్షిత మంచినీటి పథకాలు ఏర్పాటు చేశా. యువత ఉపాధికి శిక్షణ కేంద్రాలను నెలకొల్పా. వివిధ మండలాల్లో లోఓల్టేజీ సమస్యను తీర్చేందుకు రూ. 200 కోట్లతో మంథనిలో 220/130 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్, 20 వరకు ఇతర సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు కృషి చేశా.

మన మంథని: మరోసారి అవకాశం ఇస్తే ఏం చేస్తారు?

శ్రీధర్‌బాబు : తెలంగాణలో ఏర్పడబోయేది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే. కనుక మరిన్ని నిధులను తెచ్చి, నాన్న శ్రీపాదరావు ఆశయాల మేరకు నియోజకవర్గంలోని ప్రతి రైతు కూ సాగునీరందిస్తా. పరిశ్రమలు తీసుకొచ్చి, ఉద్యోగావకాశాలు కల్పిస్తా. పనులన్నీ మధ్యలోనే ఉన్నందున వాటిని పూర్తి చేసి, మంథని ప్రాంతాన్ని అభివద్ధిలో తెలంగాణలోనే మణిమకుటంగా తీర్చిదిద్దుతా.






0 comments:

Post a Comment

  • VIDEOS
  • PHOTOS
  • NEWS UPDATE