How To Create a Website

Mana Manthani web site కు విచ్చేస్తున్న Manthanites కి స్వాగతం సుస్వాగతం మరియు మరియు శుభాకాంక్షలు .. , No. 9246575261

C L Rajam Sir Interview...

















సీఎండీగా మన మంథని వాస్తవ్యులు.. మన శ్రీ చిల్లప్పగారి లక్ష్మీరాజం గారి సారథ్యంలోనే నమస్తే తెలంగాణ పత్రిక కొనసాగుతుంది:
-తెలంగాణ ఆకాంక్షలే ప్రధానం
-ప్రజల కోసం స్వతంత్ర స్వేచ్ఛావాణి
-బీజేపీలో చేరడం నా వ్యక్తిగతం
-పత్రికపై ఏ పార్టీ ప్రభావాలూ ఉండవు
-నమస్తే తెలంగాణ తృతీయ వార్షికోత్సవంలో సీఎండీ సీఎల్ రాజం స్పష్టీకరణ
-తెలంగాణ ఉద్యమ చరిత్రను లిఖించిన అక్షరాయుధం నమస్తే తెలంగాణ:
-ఐకమత్యమే బలమని చాటుదాం:ఎండీ విజయరాజం
-ఘనంగా తృతీయ వార్షికోత్సవ సంబురాలు
-నమస్తే తెలంగాణ తృతీయ వార్షికోత్సవంలో సీఎండీ సీఎల్ రాజం స్పష్టీకరణ-తెలంగాణ ఉద్యమ చరిత్రను లిఖించిన అక్షరాయుధం నమస్తే తెలంగాణ:-ఐకమత్యమే బలమని చాటుదాం:ఎండీ విజయరాజం-ఘనంగా తృతీయ వార్షికోత్సవ సంబురాలు-నమస్తే తెలంగాణ తృతీయ వార్షికోత్సవంలో సీఎండీ సీఎల్ రాజం స్పష్టీకరణ-తెలంగాణ ఉద్యమ చరిత్రను లిఖించిన అక్షరాయుధం నమస్తే తెలంగాణ:-ఐకమత్యమే బలమని చాటుదాం:ఎండీ విజయరాజం-ఘనంగా తృతీయ వార్షికోత్సవ సంబురాలు 



మస్తే తెలంగాణ పత్రికకు నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలే వెన్నుదన్నుగా ఉన్నారని, భవిష్యత్తులో కూడా ఉంటారని, ఈ పత్రిక తెలంగాణ ప్రజల పత్రికగా విరాజిల్లుతుందని నమస్తే తెలంగాణ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సీఎల్ రాజం అన్నారు. నమస్తే తెలంగాణ తన అంతరాత్మ అని, తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చడంలో పత్రిక వృత్తి నిబద్ధమై స్వతంత్రంగా స్వేచ్ఛగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీజేపీలో చేరడం తన వ్యక్తిగత విషయమని, పత్రికపై ఏ పార్టీ ప్రభావాలూ ఉండవని ఆయన తెలిపారు. నమస్తే తెలంగాణ దినపత్రిక తృతీయ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం బంజారాహిల్స్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సంబురాలలో ఆయన మాట్లాడారు. తన అభిప్రాయాలను ఎలాంటి అరమరికలు లేకుండా వెల్లడించారు.CMD-rajam176 శాతం లీడింగ్ వాటాదారుగా ఉన్న తాను ఈ పత్రికకు చైర్మన్‌గా, మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతానని, తన సారథ్యంలోనే పత్రిక తెలంగాణ ప్రజల పత్రికగా భాసిల్లుతుందని చెప్పారు. ఎడిటర్ అల్లం నారాయణ అక్షరాలు ఈ పత్రికకు కరదీపికలుగా ఉంటాయని అన్నారు. జూన్ నెలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రావడం, నమస్తే తెలంగాణ తృతీయ వార్షికోత్సవం కావడం, తెలంగాణ ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఉద్యోగులందరికీ మంచి రోజులు వచ్చాయని ఆయన అన్నారు. పత్రికను తాను ఎప్పుడూ లాభాలు తెచ్చే వ్యాపారసంస్థగా ఆలోచించలేదని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు నిలువుటద్దం కావాలన్న తపనతోనే పత్రిక నడిపే బాధ్యతలను తీసుకున్నామని చెప్పారు. celebrationsసీఎల్ రాజం అనే వ్యక్తికి గొప్ప పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టిన సంస్థ నమస్తే తెలంగాణ పత్రిక అని, ఈ కీర్తిలో సమస్త నమస్తే తెలంగాణ సిబ్బందికి భాగస్వామ్యం ఉన్నదని ఆయన సవినయంగా పేర్కొన్నారు. నమస్తే తెలంగాణ పత్రికలో పనిచేస్తున్న ఉద్యోగుల కర్తవ్యం ఇంకా పరిపూర్తి కాలేదని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఎంత ఉద్యమస్ఫూర్తితో పనిచేశామో, అంతే స్ఫూర్తితో తెలంగాణ పునర్నిర్మాణంలో పనిచేయాలని పిలుపునిచ్చారు. గత మూడు సంవత్సరాలలో నమస్తే తెలంగాణను తెలంగాణ ప్రజలందరూ తమ పత్రికగా స్వీకరించారని, ఇది నమస్తే తెలంగాణ కుటుంబం సాధించిన విజయమని ఆయన అభినందించారు. 


నమస్తే తెలంగాణలోని ఉద్యోగులందరూ యాజమాన్య కుటుంబసభ్యులేనని పేర్కొన్నారు. పత్రికను టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీలన్నీ తమ పత్రికగానే భావించాయని, అంటే ప్రతీ సందర్భంలో పత్రిక నిర్వహించాల్సిన సమతుల్యతా ధర్మాన్ని పాటించామని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇదే సమతుల్యతను పాటిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం, తెలంగాణ ప్రజల అండదండలు మనకే ఉన్నాయని పేర్కొన్నారు. జర్నలిస్టులకు వృత్తిపరమైన స్వేచ్ఛ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. తాను న్యాయం కోసం పోరాడుతానని, న్యాయం పక్షాన నిలిచి ఉంటానని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఢిల్లీవరకు చాటి చెప్పడంలో నమస్తే తెలంగాణ అగ్రభాగంలో ఉంటుందని అన్నారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగత శత్రుత్వం ఉండదని, ఎవ్వరూ వ్యక్తిగత శత్రుత్వాన్ని పెంచుకోవద్దని విజ్ఞప్తి చేశారు. తాను బీజేపీలో చేరడం తన వ్యక్తిగత రాజకీయ నిర్ణయమని, తన నిర్ణయం ప్రభావం పత్రికపైన ఉండదని ఆయన చెప్పారు.


CMD-rajam
ఎడిటర్ అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్రను లిఖించిన అక్షరాయుధం నమస్తే తెలంగాణ అని అభివర్ణించారు. ఉద్యమాల భావోద్వేగాలతో తల్లడిల్లుతున్న తెలంగాణ వంటి ప్రాంతంలో పత్రికను నడపడం మామూలు విషయం కాదని, ఆ పనిని సీఎల్ రాజం విజయవంతంగా నిర్వహించగలిగారని అభినందించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఆవాహన చేసుకొని వాటిని అక్షరాలను చేసి ప్రజలకందించామని చెప్పారు. కష్టాలలో నష్టాలలో, ఉద్విగ్నభావ సందర్భాలలో ఏడువేల నమస్తే తెలంగాణ కుటుంబసభ్యులతో కలిసి ప్రయాణించే, కలిసి కష్టించే అవకాశాన్ని నమస్తే తెలంగాణ కల్పించిందని అన్నారు. 



తెలంగాణ కోసమే పుట్టిన పత్రిక నమస్తే తెలంగాణ అని ఆయన స్పష్టం చేశారు. ఈ పత్రికను నడిపించింది, బతికించిందీ సీఎల్ రాజం. ఆయనతో కలిసి నడవడం మనందరి బాధ్యతని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో చేర్చిన అంశాలన్నీ అమలులోకి వచ్చే విధంగా నిర్మాణాత్మకంగా పత్రిక వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. నమస్తే తెలంగాణ మన పాలకుల దక్షతలను, ప్రభుత్వం అమలుచేసే పథకాలను ప్రపంచానికి చాటుతూ ప్రజల పక్షాన నిలిచి రాస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగా పత్రిక నడుస్తుందని, తెలంగాణ ప్రజల సమస్యలే వస్తువులుగా ముందుకు నడుస్తుందని చెప్పారు. ఉద్యమస్ఫూర్తితో పునర్నిర్మాణ బాధ్యతలో కూడా జర్నలిస్టులుగా మా బాధ్యతను నిర్వర్తిస్తామని చెప్పారు.


NT
ఐకమత్యమే బలం: డైరెక్టర్ విజయరాజం


ఐకమత్యం నమస్తే తెలంగాణ బలమని డైరెక్టర్ విజయరాజం పేర్కొన్నారు. మార్కెట్‌లోని అన్ని పత్రికలతో దీటుగా ఎక్కువ సమాచారంతో తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో వస్తున్న నమస్తే తెలంగాణను ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారని ఆమె అన్నారు. ఐకమత్యంతో, స్నేహసుహృద్భావంతో కలిసి శ్రమిస్తున్నందునే ఈ విజయాలను సాధించగలుగుతున్నామని ఆమె తెలిపారు. నమస్తే తెలంగాణ అక్షరాభ్యాసం దశకు చేరుకున్నదని ఆమె అభిప్రాయపడ్డారు. నమస్తే తెలంగాణ పత్రికలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ సమయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. నమస్తే తెలంగాణ ఎప్పటివలెనే తెలంగాణ ప్రజల గళమై ప్రతిధ్వనిస్తుందని చెప్పారు.











0 comments:

Post a Comment

  • VIDEOS
  • PHOTOS
  • NEWS UPDATE