How To Create a Website

Mana Manthani web site కు విచ్చేస్తున్న Manthanites కి స్వాగతం సుస్వాగతం మరియు మరియు శుభాకాంక్షలు .. , No. 9246575261

Manthani Videos @ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్‌రావు

















Mana Manthani Videos ..



2nd day
కాశీ నామస్మరణతో పాపాలు దూరం

అనేక పేర్లతో విశ్వవ్యాప్తి చెందినవాడు పరమేశ్వరుడు 

- శివవైభవ తత్వంపై మంథనిలో చాగంటి ప్రవచనాలు

- భారీగా తరలివచ్చిన భక్తులు


కాశీ పట్టణంలోని శివవైభవం మరే పట్టణంలో లేదని, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో పరమైక శివక్షేవూతంగా వెలిసిందని, నిత్యం మూడు సార్లు కాశీ...కాశీ..కాశీ.. అని ఉచ్చరిస్తే జన్మజన్మాల పాపాలు దూరమవుతాయని శారద జ్ఞానపుత్ర, ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్‌రావు తెలిపారు. కరీంనగర్ జిల్లా మంథనికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త, నమస్తే తెలంగాణ దినపవూతిక సీఎండీ సీఎల్ రాజం, విజయ దంపతుల ఆధ్వర్యంలో రెండో రోజైన శనివారం రాత్రి శివవైభవ తత్వంపై చాగంటి భక్తులనుద్దేశించి ప్రవచించారు. పరమైక శివక్షేత్రం కాశీ పట్టణమని, కాశీ గంగలో కాళేశ్వరం గోదావరిలో స్నానం ఆచరించిన జన్మజన్మల పాపం ఆ భగవంతులు కడిగి పారేస్తారని శంకర భాగవతాదులు కాశీ క్షేత్రం గురించి వర్ణించాడన్నారు. భారతదేశంలోనే కాశీ పట్టణం తరువాత మంథని పట్టణం విన్నానని, అన్నపూర్ణ దేవి కలిగిన స్థానం మంథని అని విన్నానన్నారు. కాశీ రక్షణకు స్థానం క్షేత్రపాలకుడు కాలభైరవుడు శిశిలతత్వం కలిగిన క్షేత్రమన్నారు. భాందవ శివభక్తాచ స్వదేశోభువనవూతయ అంటే శివభక్తులందరికీ బాంధవ్యత కలిగిన వాడన్నారు. రుద్రుడు, కాలుడు, శంభుడు, ఈశుడు, శివుడు అని ఇలా ఎన్నో పేర్లతో విశ్వవ్యాప్తం చెందినవాడే పరమేశ్వరుడన్నారు. పరమ శివుని తత్వంతో ప్రజలు ముందుకు వెళ్లి ఇహపర ఆనందాలను పొందవచ్చన్నారు. 


భక్తజన సందోహం 

శివ వైభవ తత్వంపై చాగంటి ప్రవచనాలు వినేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. చాగంటి ప్రవచనాలను టీవీల ద్వారా వింటున్న భక్తజనానికి నేరుగా ఆయనను తిలకించడంతోపాటు ప్రవచనాలు ఆలకించే అవకాశం దొరకడంతో సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు మంథనికి తరలివచ్చారు. హైదరాబాద్,వరంగల్, కరీంనగర్, ధర్మపురి, వేములవాడ, చెన్నూరు, తాండూరు, మంచిర్యాల, పెద్దపల్లి, గోదావరిఖని, జనగాం ప్రాంతాలతోపాటు కాళేశ్వరం పుష్కరాలకు వచ్చిన ఆంధ్రా ప్రాంతానికి చెందిన భక్తులు సైతం తరలివచ్చారు. అశేష భక్త జనం తరలిరావడంతో శ్రీ నృసింహా శివకిరణ్ గార్డెన్ కిక్కిరిసిపోయింది. రెండు రోజులుగా చాగంటి ప్రవచనాలు మంథనిలో నిర్వహిస్తుండడంతో పట్టణంలో శివతత్వం అలుముకుంది. 



పుష్కర స్నానాలు ఆచరించిన చాగంటి 

సరస్వతీ మాత నమో నమహా అంటూ చాగంటి కోటేశ్వర్‌రావు పుష్కర స్నానం ఆచరించారు. మంథని నుంచి కాళేశ్వరం త్రివేణి సంగమం చేరుకున్న ఆయన సరస్వతీ నదిలో పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం కాళేశ్వర, ముక్తీశ్వరాలయానికి చేరుకోగానే నమస్తే తెలంగాణ దినపవూతిక డైరెక్టర్ విజయరాజం సాంప్రదాయ పద్ధతిలో చాగంటి దంపతులకు బొట్టుపెట్టి ఆహ్వానించగా, ఆలయ సాంప్రదాయం ప్రకారం వేదపండితులు స్వాగతం పలికారు. ఆలయంలో మొదట అనూజ్ఞ గణపతికి, కాళేశ్వర, ముక్తీశ్వరుడికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలోని శ్రీ సరస్వతీమాతతోపాటు వివిధ దేవతా మూర్తులను దర్శించుకుని పూజలు నిర్వహించారు. 



భక్తజన కోరికపై ప్రత్యేక ప్రవచనం

కాళేశ్వర దేవస్థానంలోని కాళేశ్వర, ముక్తీశ్వర స్వామిని నమస్తే తెలంగాణ డైరెక్టర్ విజయరాజంతో కలిసి దర్శనం చేసుకున్న చాగంటి అశేష భక్త జనులు, ఆలయ పాలకమండలి కోరికపై ప్రత్యేక ప్రవచనం చెప్పారు. ఆలయ ప్రాంగణంలోని సభా వేదికపై కాళేశ్వర, ముక్తీశ్వర ఆలయ దర్శనం వల్ల కలిగే ఆనందం, ప్రయోజనాలపై ప్రవచనం ద్వారా తెలియజేశారు. ఎక్కడా లేని విధంగా ఒకే పానపట్టంపై శివుడు, యముడు ఉండటం, ఆలయం విశిష్టతను ప్రవచనం ద్వారా తెలిపారు.

3rd Day



మన మంథని లో మూడు రోజులుగా ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.
ముగిసిన మూడు రోజుల శివతత్వ ప్రవచనాలు.
మంథని భక్తుల ప్రేమ మనసును దోచింది: చాగంటి కోటేశ్వర్‌రావు..
-కార్యక్షికమం నిర్వహించడం అభినందనీయం: మంత్రి శ్రీధర్‌బాబు
వేదాలకు ఆలవాలం.. ఆలయాలకు పుట్టినిల్లయిన మన మంథని లో మూడు రోజులుగా ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వర్‌రావు శివవైభవతత్వంపై చేసిన ప్రవచనాలు అశేష భక్త జనాలను తరలివచ్చేలా చేశాయి. మంథనికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, నమస్తే తెలంగాణ దినపవూతిక సీఎండీ సీఎల్ రాజం, డైరెక్టర్ విజయరాజం దంపతుల ఆధ్వర్యంలో మూడు రోజుల కార్యక్షికమంలో శివవైభవతత్వంపై చాగంటి ప్రజలనుద్దేశించి ప్రవచించారు. మూడు రోజులు జరిగిన ఈ కార్యక్షికమానికి భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. చాగంటి ప్రవచన కార్యక్షికమాన్ని సీఎల్ రాజం దంపతులు నిర్వహించడంతో అశేషంగా భక్తజనసందోహం తరలిరావడంతో మంత్రపురిలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ మంథ ని భక్తజనుల ప్రేమ కన్నతల్లిని తలపించిందని.. మంథ ని తన మనస్సు దోచిందని అన్నారు. మరోమారు రావాలని కోరుకుంటున్నానని తెలిపారు. అంతకుముందు కమాన్‌పూర్ మండలం సుందిల్ల శ్రీ లక్ష్మినర్సింహ స్వామి క్షేత్రంలో చాగంటి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ముగింపు కార్యక్షికమం సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ సీఎండీ సీఎల్ రాజం దంపతులు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డిలు చాగంటి నుంచి ఆశీర్వచనాలు అందుకున్నారు. సీఎండీ దంపతులు చాగంటి దంపతులను సంప్రదాయబద్ధంగా సన్మానించారు. 

CMDsirమోహాన్ని వీడాలి: చాగంటి
మానవులు బుద్ధి, మోహాన్ని వీడాలని చాగంటి కోటేశ్వర్ రావు ప్రవచనాల సందర్భంగా తెలిపారు. మూడు రోజుల శివవైభవతత్వ ప్రవచన కార్యక్షికమాల్లో చివరిరోజైన ఆదివారం చాగంటి ప్రజలనుద్దేశించి ప్రవచించారు. జప, ధ్యాన, సంస్మరణం, శుభకర్మలు ఆచరించడం వలన మానవుడి బుద్ధి స్వచ్ఛవవుతుందని.. మానవులంతా మోహాంధకారం నుంచి మేల్కోవాలని అన్నారు. పరమేశ్వరుడు లోకకళ్యాణం కోసమే హాలాహాలాన్ని భక్షించాడని పేర్కొన్నారు. శివభక్తులైన దుర్వాసుడు, అంబరీషుడు, మార్కండేయుడు వీరంతా కాలాన్ని శాసించారని తెలిపారు.

సీఎల్ రాజం ఈ కార్యక్షికమం నిర్వహించడం అభినందనీయం: మంత్రి శ్రీధర్‌బాబు 
ప్రజలకు అభివృద్ధితోపాటు ఆధ్యాత్మిక చింతన అవసరమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. చాగంటి ప్రవచన కార్యక్షికమానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ.. మంథని నియోజక వర్గాన్ని తాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంటే.. నమస్తే తెలంగాణ దినపవూతిక సీఎండీ సీఎల్ రాజం ఆధ్యాత్మిక కార్యక్షికమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. శివుడి ప్రాముఖ్యత, తేజస్సుపై చాగంటి కోటేశ్వర్ రావు ప్రవచనాలు వినడం ఈ ప్రాంత భక్త జనులకు అదృష్టమని, ఈ ప్రాంతానకి వచ్చినందుకు చాగంటికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. దేశ సంపదకు మించిన ఆధ్యాత్మిక చింతన నేటి సమాజానికి అవసరమని, అభివృద్ధితోపాటు ఆధ్యాత్మికతతో శాంతి వెల్లివిరిసి ప్రజలు సౌఖ్యంగా ఉంటారని అన్నారు. 

రాజన్నను దర్శించుకున్న చాగంటి 
వేములవాడ కల్చరల్ (టీ మీడియా): వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం రాత్రి చాగంటి కోటేశ్వర్‌రావు దంపతులు దర్శించుకున్నారు. వారికి ఆలయ స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్య ఆధ్వర్యంలో అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చాగంటి దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం ఆలయ అద్దాల మండపంలో బ్రాహ్మణులు వేదమంవూతాలతో ఆశీర్వచనం చేయగా, ఆలయ ఈవో కృష్ణాజీరావ్, ఆలయ ధర్మకర్త విజయరాజం స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. వారి వెంట ఆలయ ఏఈవో ఉమారాణి, గౌరీనాథ్, నమస్తే తెలంగాణ సీఎండీ పీఏ నమిలకొండ వెంకట్, ఏపీ ఆర్వో తిరుపతిరావు ఉన్నారు.

0 comments:

Post a Comment

  • VIDEOS
  • PHOTOS
  • NEWS UPDATE