Releasing Shortly.......Mana Manthani... Bhajana Songs....in our web site .
మన మంథని సంస్కృతీసంప్రదాయాల్లో భజనకు పెద్ద పీటే ఉంది. ఎందుకంటే పదిమంది కలుసుకునే వేదిక అది. భజనలో శ్రావ్యంగా పాటలు పాడే వారు కొందరైతే... అందుకు అనుగుణంగా తాళం వేయడం, పాడే వారితో గొంతు కలిపి, భక్తిపారవశ్యంలో ఓలలాడటం ద్వారా మానసికానందంలో మునిగి తేలుతారు. మన గ్రామాల్లో ఇప్పటికీ శ్రమశక్తి జీవులకు భజనలతోనే చాలా వరకూ ఊరట. వైద్యశాస్త్ర ప్రకారం సమస్యలకు చెల్లు చీటీ రాసేసినట్టే.
భజన (Bhajan)
భగవంతుని కీర్తించేందుకు, స్మరించేందుకు కల అనేక సేవల రూపాలలో ఒకటి.పదిమందీ కలుసుకునే వేదిక. దేవాలయములలో, ఇతర ప్రార్ధనా స్థలములలో గుంపుగా కొందరు చేరి సాగించు స్మరణం భజనగా వ్యవహరిస్తారు. మన మంథని లో పాడిన మన భజన పరులు భజనలు బాగా ప్రాచుర్యం పొందినవి. భజన వల్ల మనసు, నాడీవ్యవస్థ ఉత్తేజితమవుతాయి.సామూహికంగా భగవన్నామావళిని లయబద్ధంగా గొంతు కలిపినపుడు మనసు అలౌకిక ఆనందంలో తేలుతుంది.పదిమందితో కలిసినపుడు తాత్కాలికంగా సమస్యలన్నీ మరచి, భగవంతుని భజించడం వల్ల మానసిక, శారీరక ప్రశాంతత కలుగుతుంది.అలసటను మరచిపోయి నూతన ఉత్త్తేజం పొంది ఉత్సాహవంతులు అవుతారు.పాటలకు అనుగుణంగా తాళం వేయడం, పాడే వారితో గొంతు కలిపి, భక్తిపారవశ్యంలో ఓలలాడటం ద్వారా మానసికానందంలో మునిగి తేలుతారు.భజనవల్ల హృదయస్పందన బాగుంటుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది. దురాలోచనలు దూరమై, చైతన్యం పెరుగుతుంది. రెండుచేతులూ కలవడం వల్ల నాడులు ఉత్తేజమవుతాయి. మెదడు చురుగ్గా పని చేస్తుంది. క్రమపద్ధతిలో సాగే శృతిలయల వల్ల ఆల్ఫా, తీటా, డెల్టా తరంగాలు విడుదలవుతాయి. శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళుతుంది.దిగుళ్లు దూరమవుతాయి.మనసుకు ఎంతో ఉపశమనం కలుగుతుంది.
భజనల్లో రకాలు
భజనల్లో పలు రకాలు కలవు. ఇవి ఒక్కో ప్రాంతాలలో ఒక్కోవిధంగా నడుస్తుంటాయి.
సాధారణ భజనలు
సాధారణంగా భజనలు దేవాలయాలలో చేస్తుంటారు.
సాంస్కృతిక భజనలు
ఈ రకపు భజనలు కొంత ఖర్చు, శ్రమలతో కూడుకొన్నవి. ధనవంతులు, రాజులు, సంస్థానాదీశులు ఇటువంటి వాటిని ప్రోత్సహించేవారు. ఇవి పాటలు పాడటంలో ప్రావీణ్యమున్నవారు, సంగీత వాయిద్యాల సహకారంతో నిర్వహించు కార్యక్రమాలు. ఇవి వినేందుకు వీనుల విందుగా శ్రావ్యంగా ఉంటాయి. వీటిని ప్రత్యేకంగా కొంత శిక్షణ, సాధన అవసరం.
గృహములలో భజనలు
ఇవి ప్రత్యేక సంధర్భాలలో, విశేషాలను అనుసరించి నిర్వహిస్తుంటారు. వీటికి ఉదాహరణలు- అయ్యప్ప భజనలు, గృహప్రవేశ సమయంలో నిర్వహించు భజనలు,
నగర సంకీర్తనలు
తెల్లవారు ఝామున కొందరు భక్తులు సమూహంగా ఊరిలో సంచరిస్తూ చేస్తూ నిర్వహించే భజనలను నగర సంకీర్తనం అంటారు.-
0 comments:
Post a Comment