How To Create a Website

Mana Manthani web site కు విచ్చేస్తున్న Manthanites కి స్వాగతం సుస్వాగతం మరియు మరియు శుభాకాంక్షలు .. , No. 9246575261

1-08-2013 7pm News Update


తెలంగాణపై వెనక్కి తగ్గేది లేదు : దిగ్విజయ్
ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కి తగ్గేదిలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యవహరాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. సీమాంధ్రమంత్రుల రాజీనామాలపై ఆయన స్పందించారు. ఆందోళనలు, రాజీనామాలు సర్వసాధారణమే అన్నారు. ఆందోళనలలో రాజీవ్‌గాంధీ విగ్రహాలు ధ్వంసం చేయడం విచారకరమన్నారు.అందరి ఆందోళనలకు పరిష్కారం చూపిస్తామన్నారు. రాష్ట్రవిభజన విషయంలో ప్రజలు సమన్వయం పాటించాలని దిగ్విజయ్‌సింగ్ కోరారు. కోస్తాతీర ప్రాంతం, మంచి వనరులున్న ఆంధ్రప్రదేశ్‌కి మంచి భవిష్యత్తు ఉంటుదన్నారు.


ఆంధ్రప్రదేశ్‌కు మంచి భవిష్యతు ఉంది: దిగ్విజయ్ 
రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర నేతలు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని దిగ్విజయ్ అన్నారు. సీమాంధ్ర కోస్తా తీరంలో మంచి వనరులున్నాయని, విద్యుత్ వనరులు వారి చేతిలో ఉన్నాయని వీటితో అభివృద్ధి సాధించా వచ్చని ఆయన తెలిపారు. సీమాంధ్రులు లేవనెత్తే సమస్యలకు పరిష్కారం చూపిస్తామని అన్నారు. రాజధాని విషయంలో వాళ్లు ఆందోళన పడవద్దని అన్నారు. చంఢీగఢ్, గాంధీనగర్‌లకు ధీటుగా కొత్త రాజధానిని నిర్మిస్తామని సీమాంధ్రులకు హామీ ఇచ్చారు. ఈ రెండు నగరాలు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏర్పడినవేనని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది: షిండే 
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రక్రియ రాష్ట్ర ఏర్పాటు ప్రారంభమైందని హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే అన్నారు. తాను హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇవాళ ఆయన మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి మాట్లాడారు. తెలగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సీడబ్ల్యూసీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిందని, ఇక రాజ్యాంగం ప్రకారం ప్రక్రియ మొదలుకానుందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ తీర్మానం ఎలా ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని స్పష్టంగా చెప్పారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. యూపీఏ కమిటీ కేంద్ర కేబినెట్‌కు నోట్ పంపింది. కేంద్ర కేబినెట్ సబ్ కమిటీ ఏర్పడి ఈ నోట్‌ను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతామని ఆయన తెలిపారు. అక్కడ నుంచి రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం తెలుసుకునేందుకు బిల్లు ముసాయిదాను పంపుతారని, అసెంబ్లీ తీర్మానం ఎలా ఉన్నా రాష్ట్ర ఆవిర్భావం జరుగుతుందని వివరించారు.

ఐదు నెలల్లో తెలంగాణ ఏర్పాటు: షిండే
అయితే రాష్ట్ర ప్రక్రియ పూర్తి కావడానికి ఐదారునెలల సమయం పట్ట వచ్చని ఆయన తెలిపారు. వాస్తవానికి ఎనిమిది నెలల సమయం పడుతుందని కానీ తెలంగాణ విషయంలో ఐదు నెలల్లో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. అయితే ఈ పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టే వీలుకాకపోవచ్చని సూచనప్రాయంగా తెలిపారు.

తెలంగాణ పాత డిమాండ్: షిండే 
తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఇప్పటిది కాదని, ఇది చాలా పూరతనమైన డిమాండ్ అని షిండే అన్నారు. సౌరాష్ట్ర గుజరాత్, మహారాష్ట్రలుగా విడిపోయే కంటే ముందే తెలంగాణ డిమాండ్ ఉందని ఆయన వివరించారు. దేశంలో విదర్బ కాకుండా చాలా చోట్ల నుంచి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు వస్తున్నాయని ఆయన అన్నారు. అయితే విదర్బ కంటే ముందే తెలంగాణ అంశం పెండింగ్‌లో ఉందని తెలిపారు. చాలా ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పెండింగ్‌లో ఉన్నందున నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని: షిండే
హైదరాబాద్‌ను సీమాంధ్ర, తెలంగాణ రెండు ప్రాంతాలకు ఉమ్మడి రాజధానిగా చేయాలని సీమాంధ్ర ప్రాంత నేతలు డిమాండ్ చేస్తున్నారు కదా అని విలేకరులు ప్రశ్నించగా షిండే తీవ్రంగా స్పందించారు. సీడబ్ల్యూసీలో తీర్మానం చేసినట్టు పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని తెలిపారు.

అన్ని డిమాండ్లను పరిశీలిస్తున్నాం: షిండే
దేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం వస్తున్న అన్ని డిమాండ్లను కేంద్రం పరిశీలిస్తుందని షిండే తెలిపారు. కొత్త రాష్ట్రాల కోసం డిమాండ్ చేసేవారు వారి ఆందోళనలను ప్రజాస్వామ్యయుతంగా చేయాలని ఆయన కోరారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు విషయంలో తమ ముందుకు వచ్చే ప్రతి ప్రతిపాదనను పరిశీలిస్తామని అన్నారు.

0 comments:

Post a Comment

  • VIDEOS
  • PHOTOS
  • NEWS UPDATE